న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వివాహ బంధంతో ఓ ఇంటివాడైన టీమిండియా యువ పేసర్!

Rajasthan Royals Pacer Jaydev Unadkat Gets Married

అహ్మదాబాద్‌‌: టీమిండియా యువ పేసర్ జయదేవ్ ఉనద్కత్ ఓ ఇంటి వాడయ్యాడు. తన చిరకాల స్నేహితురాలు రినీ కంటారియాను మంగళవారం పెళ్లి చేసుకున్నాడు. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ విషయాన్ని జయదేవ్‌ ఉనద్కతే ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. తన వివాహానికి సంబంధించిన ఫొటోలను కూడా ఈ ట్వీట్‌కు జత చేశాడు.

'2021 ఫిబ్రవరి 2న మా వివాహం కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో జరిగింది. మీరు మాపై కురిపించిన ప్రేమ, అభిమానానికి కృతజ్ఞతలు.. ఈ అద్భుతమైన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించే సమయంలో మీ ఆశీర్వాదాలను కోరుకుంటున్నాం'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. వాస్తవానికి వీరికి గతేడాది మార్చి 15న నిశ్చితార్థం జరగగా.. కరోణా కారణంగా వాయిదా పడింది. ఇక ఈ కొత్తజంటకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అభిమానులతో పాటు సహచర, మాజీ క్రికెటర్లు ఈ సౌరాష్ట్ర క్రికెటర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

సౌరాష్ట్రకు చెందిన జయదేవ్‌ ఉనాద్కత్ ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. అప్‌కమింగ్ సీజన్‌కు కూడా అతన్ని రాయల్స్ రిటైన్ చేసుకుంది. ఇక 2010లో సంప్రదాయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఉనాద్కత్, 2013లో టీమిండియా తరఫున వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. అయితే, ఆ తర్వాత మళ్లీ జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 2016లో టీ20 ఫార్మాట్‌లో టీమిండియా తరఫున బరిలోకి దిగాడు.

ఇక 2018 ఐపీఎల్‌ వేలంలో రూ. 11.5 కోట్ల భారీ ధరకు రాజస్తాన్‌ జట్టు అతన్ని కొనుగోలు చేసింది. ఆ తర్వాత అదే జట్టు మళ్లీ రూ. 8.5 కోట్లకు దక్కించుకుంది. ఐపీఎల్ 2020లో వేలంలో కూడా మళ్లీ అదే జట్టు రూ. 3 కోట్లకు తీసుకుంది. కానీ ఉనద్కత్ అంచనాలను అందుకోలేకపోయాడు. గత సీజన్‌లో కూడా పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా అతన్ని రాజస్థాన్ రిటైన్ చేసుకుంది. ఇక ఈ సీజన్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 6 వికెట్లు తీసిన ఈ సౌరాష్ట్ర పేసర్ జట్టును నాకౌట్‌కు చేర్చడంలో విఫలమయ్యాడు.

Story first published: Wednesday, February 3, 2021, 22:09 [IST]
Other articles published on Feb 3, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X