న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

KKR vs SRH: హాఫ్ సెంచ‌రీల‌తో దుమ్ములేపిన త్రిపాఠి, మాక్ర‌మ్‌.. స‌న్‌రైజ‌ర్స్ హ్యాట్రిక్ విజ‌యం

Rahul Tripathi(71) and Aiden Markram(68*) Half Centuries and Sunrisers Hyderabad Beat by 7 wickets Kolkata Knight Riders

రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మాక్ర‌మ్ హాఫ్ సెంచ‌రీల‌తో దుమ్ములేప‌డంతో కోల్‌క‌తానైట్ రైడ‌ర్స్‌పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 7 వికెట్ల తేడాతో ఘ‌న‌విజయం సాధించింది. త్రిపాఠి(71), మాక్ర‌మ్(68*) దూకుడుతో మ‌రో 13 బంతులు మిగిలి ఉండ‌గానే స‌న్‌రైజ‌ర్స్ ల‌క్ష్యాన్ని చేధించింది. వ‌రుస‌గా రెండు సిక్సులు కొట్టి మాక్ర‌మ్ జ‌ట్టును గెలిపించాడు. ఈ సీజ‌న్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఇది హ్యాట్రిక్ విజ‌యం. మొద‌టి రెండు మ్యాచ్‌లు ఓడిన స‌న్‌రైజ‌ర్స్ ఆ త‌ర్వాత వ‌రుస‌గా 3 మ్యాచ్‌లు గెలిచింది. అంత‌కుముందు నితీష్ రానా(54), ఆండ్రూ ర‌స్సెల్(49*) చెల‌రేగ‌డంతో కోల్‌క‌తా 175 ప‌రుగులు చేసింది.

ఓపెన‌ర్లు విఫ‌లం

ఓపెన‌ర్లు విఫ‌లం

176 ప‌రుగుల భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ త‌గ‌లింది. ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌(3), కేన్ విలియమ్స‌న్ (17) విఫ‌ల‌మ‌వ‌డంతో ప‌వ‌ర్‌ప్లే ముగియ‌క‌ముందే 39 ప‌రుగుల‌కే రెండు వికెట్లు కోల్పోయింది. వీరిని క‌మిన్స్‌, ర‌స్సెల్ క్లీన్ బౌల్డ్ చేశారు.

 దుమ్ములేపిన రాహుల్ త్రిపాఠి

దుమ్ములేపిన రాహుల్ త్రిపాఠి

ఈ క్ర‌మంలో ఎయిడెన్ మాక్ర‌మ్‌తో జ‌త క‌ట్టిన రాహుల్ త్రిపాఠి దుమ్ములేపే ఆటతో చెల‌రేగిపోయాడు. తొలి బంతి నుంచే ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును ప‌రుగులు పెట్టించాడు. గ్రౌండ్‌లో అన్ని వైపుల ఫోర్లు, సిక్సులు బాదుతూ కేకేఆర్ బౌల‌ర్ల‌కు కొర‌క‌రాని కొయ్య‌గా త‌యార‌య్యాడు. ఇదే దూకుడుతో 21 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో త్రిపాఠికి ఇది ఎనిమిదో హాఫ్ సెంచ‌రీ. హాఫ్ సెంచ‌రీ అనంత‌రం మ‌రింత రెచ్చిపోయాడు. త్రిపాఠికి మాక్ర‌మ్ కూడా స‌హ‌క‌రించాడు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు క‌లిసి మూడో వికెట్‌కు 25 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ భాగ‌స్వామ్యాన్ని పూర్తి చేశారు. మొత్తంగా ఇద్ద‌రు క‌లిసి 54 బంతుల్లోనే 94 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పారు. ఈ క్ర‌మంలో జ‌ట్టు స్కోర్ 133 ప‌రుగుల వ‌ద్ద ఉండ‌గా 4 ఫోర్లు, 6 సిక్సుల‌తో 37 బంతుల్లోనే 71 ప‌రుగులు చేసిన త్రిపాఠి.. ర‌స్సెల్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్ర‌య‌త్నించి బౌండ‌రీ లైన్ వ‌ద్ద ఉన్న వెంక‌టేష్ అయ్య‌ర్‌కు క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు.

మాక్ర‌మ్ హాఫ్ సెంచ‌రీ

మాక్ర‌మ్ హాఫ్ సెంచ‌రీ

త్రిపాఠి ఔటైన త‌ర్వాత నికోల‌స్ పూర‌న్‌తో క‌లిసి ఎయిడెన్ మాక్ర‌మ్ ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్ర‌మంలో 31 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. ఐపీఎల్‌లో మాక్ర‌మ్‌కు ఇది రెండో హాఫ్ సెంచ‌రీ. హాఫ్ సెంచ‌రీ అనంత‌రం మ‌రింత రెచ్చిపోయిన మాక్ర‌మ్ క‌మిన్స్ వేసిన 18వ ఓవ‌ర్లో వ‌రుస‌గా రెండు సిక్సులు కొట్టి జ‌ట్టును గెలిపించాడు. దీంతో మ‌రో 13 బంతులు మిగిలి ఉండ‌గానే కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌పై స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ 7 వికెట్ల తేడాతో ఘ‌న‌విజ‌యం సాధించింది. 6 ఫోర్లు, 4 సిక్సుల‌తో 36 బంతుల్లోనే 68 ప‌రుగులు చేసిన మాక్ర‌మ్‌, 5 ప‌రుగుల‌తో పూర‌న్ నాటౌట్‌గా నిలిచారు. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో ర‌స్సెల్ 2, క‌మిన్స్ ఒక వికెట్ తీశారు. ఈ సీజ‌న్లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌కు ఇది వ‌రుస‌గా మూడో విజ‌యం కావ‌డం గ‌మ‌నార్హం.

చెల‌రేగిన రానా, ర‌స్సెల్‌

చెల‌రేగిన రానా, ర‌స్సెల్‌

అంత‌కుముందు టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ 8 వికెట్ల న‌ష్టానికి 175 ప‌రుగులు చేసింది. నితీష్ రానా హాఫ్ సెంచ‌రీతో చెల‌రేగాడు. 36 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సుల‌తో రానా 54 ప‌రుగులు చేశాడు. 31 ప‌రుగుల‌కే కేకేఆర్ 3 వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ఉన్న ద‌శ‌లో క్రీజులో వ‌చ్చిన రానా.. కెప్టెన్ శ్రేయ‌స్ అయ్య‌ర్‌తో క‌లిసి నాల్గో వికెట్‌కు 39 ర‌న్స్‌, జాక్స‌న్‌తో క‌లిసి ఐదో వికెట్‌కు 33 ర‌న్స్‌, ర‌స్సెల్‌తో క‌లిసి ఆరో వికెట్‌కు 39 ర‌న్స్‌తో విలువైన భాగ‌స్వామ్యాల‌ను నెల‌కొల్పాడు. ఇక చివ‌ర్లో ఆండ్రూ ర‌స్సెల్ విధ్వంసంతో కోల్‌క‌తా మంచి స్కోర్ చేసింది. ఆండ్రూ ర‌స్సెల్ 25 బంతుల్లోనే 49 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ర‌స్సెల్ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్సులు ఉన్నాయి. కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ కెప్టెన్ శ్రేయస్ 25 బంతుల్లో 3 ఫోర్ల‌తో 28 ప‌రుగులు చేశాడు. మిగ‌తా వారిలో ఫించ్ 7, జాక్స‌న్ 7, వెంక‌టేష్ 6, అమాన్ ఖాన్ 5, క‌మిన్స్ 3 ప‌రుగులు చేశారు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో న‌ట‌రాజ‌న్ 3, ఉమ్రాన్ మాలిక్ 2, భువ‌నేశ్వ‌ర్, జాన్స‌న్‌, సుచిత్ త‌లో వికెట్ తీశారు.

స్కోర్లు

కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌: 175-8

స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్‌: 176-3

Story first published: Friday, April 15, 2022, 23:37 [IST]
Other articles published on Apr 15, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X