న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాహుల్ పేలవ ఫామ్, ఐపీఎలే అతని కొంపముంచుతుందా??

Rahul has been far more indispensable for his franchise Kings XI Punjab

హైదరాబాద్: 2018 ఐపీఎల్ సీజన్‌లో కేఎల్ రాహుల్ ప్రదర్శన చూసిన వాళ్లెవరూ అతని ప్రదర్శనతో పోల్చుకోలేరు. బ్యాటింగ్‌కు రావడం నిమిషాల్లోనే వెనుదిరగడం ఇది రాహుల్ ప్రస్తుత పరిస్థితి. ఐపీఎల్‌లో మాత్రం తానొక్కడే అయి జట్టుకు స్కోరు సంపాదించడంతో పాటు గెలిపించిన మ్యాచ్‌లు చాలానే ఉన్నాయి. అతని విన్యాసాలతో పంజాబ్‌ను నాకౌట్‌కు చేర్చకపోయినా, ఐపీఎల్ అభిమానుల మనసులో మాత్రం చెరగని ముద్ర వేసుకున్నాడు. కానీ, రాహుల్‌ ఘనత అంతా పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కే పరిమితం అవుతోంది. ఈ ఏడాది టెస్టుల్లో రాహుల్‌ అత్యంత పేలవంగా విఫలమవుతున్నాడు.

అవసరాల రీత్యా శైలిని మార్చుకున్న రాహుల్‌

అవసరాల రీత్యా శైలిని మార్చుకున్న రాహుల్‌

నిజానికి కేఎల్‌ రాహుల్‌ భారత జట్టులోకి టెస్టు ఓపెనర్‌గానే అరంగ్రేటం చేశాడు. ఆరంభంలో తిరుగులేని డిఫెన్స్‌‌తో రాణించాడు. కానీ ఆధునిక క్రికెట్‌ అవసరాల రీత్యా రాహుల్‌ శైలిని మార్చుకున్నాడు. షార్ట్ ఫార్మాట్ టీ20 దూకుడుకు తగినట్టు రాహుల్‌ తన శైలిని మార్చుకున్నాడు. ప్రతి బంతినీ బౌండరీకి తరలించాలనే నెపంతో హిట్టింగ్ టార్గెట్‌గా కొనసాగాడు. ఇలాగే గతేడాది ఐపీఎల్‌లోనూ అదరగొట్టాడు. కళ్లుచెదిరే టీ20 ఫామ్‌ అతనిలోని టెస్టు శైలిని మార్చేసింది.

వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ సిరీస్‌లలో దారుణ వైఫల్యం

వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ సిరీస్‌లలో దారుణ వైఫల్యం

అతనిలో ఈ 2 ఫార్మాట్ల దూకుడును పరిశీలిస్తే.. టీ20ల్లో రాహుల్‌ స్ట్రైక్‌ రేట్‌ 120గా ఉన్న సమయంలో టెస్టుల్లో సగటు 40గా ఉండేది. ఈ ఏడాది మాత్రం టీ20 స్ట్రైక్‌ రేట్‌ 150 దాటేయగా, కానీ టెస్టు సగటు మాత్రం 20ల్లోకి పడిపోయింది. ఈ క్రమంలో వెస్టిండీస్‌, ఇంగ్లాండ్‌ సిరీస్‌లలో రాహుల్‌ దారుణ వైఫల్యం చెందాడు. ఇంగ్లాండ్‌తో చివరి టెస్టులో ఓవల్‌ ఫైనల్‌ ఇన్నింగ్స్‌లో మాత్రమే149 పరుగులతో సత్తా చాటాడు. దీంతో రాహుల్‌ మళ్లీ టెస్టు ఫామ్‌ సాధించినట్లుగా భ్రమపడ్డారంతా.. కానీ స్వదేశంలో వెస్టిండీస్‌ సిరీస్‌ సమయానికి మళ్లీ మొదటికొచ్చేశాడు.

 బౌలర్‌ బంతిని సంధించే కోణంపై ఎక్కువ దృష్టి

బౌలర్‌ బంతిని సంధించే కోణంపై ఎక్కువ దృష్టి

ఆధునిక క్రికెట్‌లో ఎంతో మంది క్రికెటర్లు ఎదుర్కొంటున్న సమస్యనే కేఎల్ రాహుల్‌ను వైఫల్య బాటలో నడిపిస్తోంది. బౌలర్‌ బంతిని సంధించే కోణంపై ఎక్కువ దృష్టి పెడుతూ, షాట్‌ ఎంపిక విషయంలో రాహుల్‌ సందిగ్థత ఎదుర్కొంటున్నాడు. దీంతో తప్పుడు షాట్లకు ప్రయత్నించి వచ్చీ రాగానే పెవిలియన్‌కు చేరుకుంటున్నాడు. విండీస్‌పై రాజ్‌కోట్‌లో డకౌట్‌ అయిన రాహుల్‌, హైదరాబాద్‌లో వరుసగా 4, 33 పరుగులే చేశాడు. ఇక ఆడిలైడ్‌ టెస్టులో 2, 44తో మెప్పించాడు. మెరుగైన షాట్లతో అలరించినా, ఆడిన షాట్లనే మళ్లీ మళ్లీ ఆడుతూ వికెట్‌ పారేసుకున్నాడు. పెర్త్‌ టెస్టులో 2, 0 పరుగులతో పూర్తిగా విఫలమయ్యాడు.

 ఆట తీరు మార్చుకోకుంటే భవితవ్యంపై

ఆట తీరు మార్చుకోకుంటే భవితవ్యంపై

విమర్శకులకు బాగా దొరికిపోతున్న రాహుల్‌ వైఫల్యాలతో గడిపేస్తున్నాడు. ఈ ఏడాది ఆడిన 14 ఇన్నింగ్స్‌ల్లో రాహుల్‌ 11 పర్యాయాలు ఎల్బీడబ్ల్యూ, క్లీన్‌ బౌల్డ్‌గానో అవుటయ్యాడు. 7 ఇన్నింగ్స్‌లుగా రాహుల్‌ కనీసం ఒక్క హాఫ్ సెంచరీ సాధించలేదు. కుడి చేతి వాటం సీమర్లకు వికెట్‌ కోల్పోతున్న రాహుల్‌ వీలైనంత త్వరగా టెక్నిక్‌ను సవరించుకోవాలి. ఆట తీరు మార్చుకోకుంటే అతని భవితవ్యంపై సందేహాలు నెలకొంటున్నాయి.

Story first published: Thursday, December 20, 2018, 18:02 [IST]
Other articles published on Dec 20, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X