న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌: రాహుల్ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం

By Nageshwara Rao
Rahul Dravid, Ricky Ponting and Claire Taylor inducted into ICC Hall of Fame

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ) హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో రాహుల్ ద్రవిడ్‌‌కు చోటు దక్కింది. దుబాయిలో జరిగిన కార్యక్రమంలో రాహుల్‌ ద‍్రవిడ్‌కు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు కల్పించిన విషయాన్ని ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక‍్యూటివ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ తెలిపారు.

రాహుల్ ద్రవిడ్‌తో పాటు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌, ఇంగ్లాండ్‌ మహిళా జట్టు మాజీ వికెట్ కీపర్ క్లెయిర్‌ టేలర్‌లకు హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న వారిలో ఉన్నారు. కాగా, భారత్ తరుపున ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న ఐదో ఆటగాడిగా రాహుల్ ద్రవిడ్ నిలిచాడు.

అంతకముందు బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్‌, అనిల్‌ కుంబ్లేలు భారత తరపున హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్నారు. భారత అండర్‌-19, భారత-ఎ జట్లకు ప్రస్తుతం కోచింగ్‌ బాధ్యతలు నిర్వహిస్తోన్న ద్రవిడ్‌ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయాడు.

ఆస్ట్రేలియా తరుపున హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న 25వ ఆటగాడిగా రికీ పాంటింగ్‌ నిలిచాడు. ఇక, మహిళల తరుపున ఈ ఘనత సాధించిన ఏడో క్రికెటర్‌గా క్లెయిర్‌ టేలర్‌ నిలిచింది. అంతేకాదు ఇంగ్లాండ్ తరపున మూడో క్రీడాకారిణిగా ఆమె గుర్తింపు సాధించారు.

ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌సన్‌ మాట్లాడుతూ

ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌సన్‌ మాట్లాడుతూ

ఈ సందర్భంగా ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ రిచర్డ్‌సన్‌ మాట్లాడుతూ "క్రికెట్‌ గేమ్‌లో దిగ్గజ ఆటగాళ్లు ఎవరైతే ఉన్నారో వారికి ఐసీసీ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో స్థానం కల్పించడాన్ని గౌరవంగా భావిస్తున్నాం. ప్రపంచంలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చిన వారికి ఇచ్చే గుర్తింపు ఇది. ఈ సందర్భంగా రాహుల్‌ ద‍్రవిడ్‌, రికీ పాంటింగ్‌, టేలర్‌లను అభినందిస్తున్నా" అని ఆయన అన్నారు.

ఇదొక గొప్ప గౌరవం

ఈ అవార్డు అందుకున్న తర్వాత రాహుల్ ద్రవిడ్ మాట్లాడుతూ "ఇదొక గొప్ప గౌరవం. హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో చోటు దక్కించుకోవాలనేది ప్రతీ ఒక్కరి కల. ఈ తరహా గౌరవం కచ్చితంగా ఏ ఆటగాడి జీవితంలోనైనా రెట్టించిన ఆనందాన్ని తీసుకొస్తుంది" అని అన్నాడు.

ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా

"నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా సుదీర్ఘకాలం నేను క్రికెటర్‌గా ఎదిగేందుకు సాయపడిన కోచ్‌లు, అధికారులు... ప్రోత్సహించిన నా కుటుంబసభ్యులు, స్నేహితులు, సహచర ఆటగాళ్లతో పాటు నా విజయాలను గుర్తించి హాల్ ఆఫ్ పేమ్‌లో ఎంపిక చేసినందుకు గాను ఐసీసీకి ధన్యవాదాలు" అని ద్రవిడ్ పేర్కొన్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో 20వేలకుపైగా పరుగులు

భారత్ తరుపున 164 టెస్టు మ్యాచ్‌లాడిన ద్రవిడ్ 13,288 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు ఉన్నాయి. ఇక, వన్డేల విషయానికి వస్తే 344 వన్డేలాడి 10,899 పరుగులు నమోదు చేశాడు. ఇందులో 12 సెంచరీలు ఉన్నాయి. దీంతో పాటు 2004లో ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుతో పాటు ఐసీసీ టెస్టు ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని కూడా గెలుచుకున్నాడు. 1996లో భారత జట్టు తరఫున అంతర్జాయతీ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన రాహుల్‌ ద్రవిడ్ 2012లో క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.

Story first published: Monday, July 2, 2018, 12:12 [IST]
Other articles published on Jul 2, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X