కర్నాటక ఎన్నికలు: కొత్త పదవిని అందుకునే దిశలో ద్రవిడ్..

Posted By: Subhan
Rahul Dravid to be Karnataka assembly poll mascot?

హైదరాబాద్: భారత మాజీ క్రికెటర్‌, అండర్ 19 జట్టు ప్రధాన కోచ్ రాహుల్‌ ద్రవిడ్‌ కొత్త పదవిని అందుకోబోతున్నాడు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల రాయబారిగా వ్యవహరించే అవకాశం కనిపిస్తోంది. ఓటు హక్కు వినియోగంతోపాటు ఉత్తములను ఎన్నుకునే విధానంపై ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు ఈసీ ప్రముఖులను రాయబారిగా నియమించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.

అందుకోసం స్టార్‌ క్రికెటర్లనుగానీ, సినిమా హీరోలని గానీ రాయబారిగా నియమించాలని చూస్తున్న ఈసీ.. ద్రవిడ్‌ పేరుని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ద్రవిడ్‌తో పాటుగా అంధుల క్రికెట్ ప్లేయర్లని, అర్జున అవార్డు గ్రహీతలనీ, ఖేల్ రత్న అవార్డు గ్రహీతలనీ ఇంకా, సాండల్‌వుడ్ స్టార్లని పరిశీలిస్తున్నారు.

అయితే ఈ విషయంపై ఈసీ ఇంకా ద్రావిడ్‌ను సంప్రదించలేదు. ద్రవిడ్‌నే కాకుండా కర్ణాటకకు చెందిన ఇతర ప్రముఖ క్రికెటర్ల పేర్లను కూడా పరిశీస్తున్నట్టు తెలిసింది. ఈ ఎన్నికలకు రక్షణ కల్పించేందుకు రిటైర్డ్ ఆర్మీ బలగాలను సంప్రదించినున్నారు. అరవై ఏళ్లకు లోపు వయస్సుతో ఉండి ఫిట్‌గా ఉన్న వాళ్లని మాత్రమే తీసుకోనున్నారు.

ఇటీవల జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ పోటీల్లో విజేతగా భారత్ నిలిచిన సంగతి విదితమే. ఈ జట్టుకు ప్రధాన కోచ్‌గా వ్యవహరించిన 'కర్ణాటక సుపుత్ర' రాహుల్ ద్రవిడ్‌ ప్రధాని చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు.

Story first published: Thursday, February 15, 2018, 10:19 [IST]
Other articles published on Feb 15, 2018
POLLS

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి