న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎంత తోపు ఆటగాడైనా ఆ రెండు విషయాల్లో మెరుగ్గా లేకుంటే ధోనీ పక్కనపెట్టేసేవాడు: మాజీ కోచ్

R Sridhar recalls how MS Dhoni changed India’s fielding approach

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ హయాంలోనే ఫీల్డింగ్‌కు అత్యంత ప్రాధాన్యమివ్వడం మొదలైందని మాజీ ఫీల్డింగ్ కోచ్, తెలుగు తేజం ఆర్ శ్రీధర్ అన్నాడు. ఫీల్డింగ్, వికెట్ల మధ్య రన్నింగ్ చేయడం వంటి విషయాలపై ధోనీ స్పెషల్ ఫోకస్ పెట్టేవాడని గుర్తు చేసుకున్నాడు. ఎంతటి తోపు ఆటగాడైన ఈ రెండు విషయాల్లో మెరుగ్గా లేకుంటే పక్కనపెట్టేసేవాడని తెలిపాడు. ధోనీ సారథ్యంలోనే ఫీల్డింగ్ విషయంలో టీమిండియా అప్రోచ్ మారిందని, ఈ సంప్రదాయాన్ని విరాట్ కోహ్లీ, రవిశాస్త్రిలు కొనసాగించారని శ్రీధర్ చెప్పుకొచ్చాడు.

నో కాంప్రమైజ్ అనేవాడు..

నో కాంప్రమైజ్ అనేవాడు..

2014లో టీమిండియా ఫీల్డింగ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన శ్రీధర్ 2021 టీ20 ప్రపంచకప్ వరకు ఆ పదవిలో కొనసాగాడు. తాజాగా క్రికెట్ డాట్‌కామ్‌‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రీధర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'ధోనీ సారథిగా ఉన్నప్పుడు ఫీల్డింగ్‌ను కూడా లీడ్ చేసేవాడు. వికెట్ల మధ్య బ్యాటర్లు పరుగెత్తే విధానంపై ఓ కన్నేసేవాడు.

ఈ రెండు విషయాల్లో ఏ మాత్రం కాంప్రమైజ్ కావద్దని చెప్పేవాడు. అతను తెచ్చిన ఈ సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ధోనీ ఫీల్డింగ్‌కు ఇచ్చిన ప్రాధాన్యతను విరాట్ కోహ్లీ కొనసాగించాడు. రవిశాస్త్రి అయితే 11 మంది అత్యుత్తమ ఫీల్డర్లనే మైదానంలోకి దించాలని ఎప్పుడూ చెప్పేవాడు.'అని శ్రీధర్ చెప్పుకొచ్చాడు.

అందరూ బెస్ట్ ఫీల్డర్లే..

అందరూ బెస్ట్ ఫీల్డర్లే..

ఇక భారత జట్టులో అత్యుత్తమ ఫీల్డర్ ఎవరా? అని ప్రశ్నించగా.. ఒక్కరి పేరు చెప్పకుండా శ్రీధర్ తెలివిగా సమాధానమిచ్చాడు. 'ఉమేశ్ యాదవ్, మహమ్మద్ సిరాజ్, మోహిత్ శర్మలతో నేను బెస్ట్ ఫీల్డింగ్ సెషన్స్ నిర్వహించా. ఫాస్ట్ బౌలర్లుగా ఈ ముగ్గురు బెస్ట్ ఫీల్డర్స్. సాధారణంగా కోహ్లీ, జడేజా, మనీశ్ పాండే సూపర్ ఫీల్డర్స్.

ఈ ముగ్గురు ఫీల్డింగ్‌తో ఫన్ చేస్తారు. చాహల్, కుల్దీప్, కేదార్ జాదవ్‌లు మాత్రం ఫీల్డింగ్‌లో మెరుగయ్యేందుకు చాలా కష్టపడ్డారు. వీరందరితో పనిచేయడాన్ని నేను పూర్తిగా ఆస్వాదించాను'అని శ్రీధర్ చెప్పుకొచ్చాడు.

బుమ్రా,కోహ్లీ ఫామ్‌లో లేరు ఎలా మరి *Cricket | Telugu OneIndia India Will Win Asia Cup Without Bumrah
అప్పుడు రోహిత్ శర్మను కూడా..

అప్పుడు రోహిత్ శర్మను కూడా..

ప్రస్తుతం టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్‌ను ఓపెనర్‌గా పంపించినట్లే.. రోహిత్ శర్మను మహేంద్ర సింగ్ ధోనీ ప్రమోట్ చేశాడని శ్రీధర్ తెలిపాడు. రోహిత్‌ను ఓపెనర్‌గా పంపిస్తూ ధోనీ తీసుకున్న ఆ నిర్ణయం గొప్పదని అభిప్రాయపడ్డాడు. '2013 చాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా రోహిత్ శర్మను ఓపెనర్‌గా ప్రమోట్ చేస్తూ ధోనీ కీలక నిర్ణయం తీసుకున్నాడు.

ప్రాక్టీస్ గేమ్‌లో దినేశ్ కార్తీక్ అదరగొట్టినా.. అతను రోహిత్‌ను టాపార్డర్‌లో ఆడించాడు. మేనేజ్‌మెంట్‌ నిర్ణయాల్లో అతని నిర్ణయాలే కీలకమయ్యేవి. అయితే ధోనీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది.'అని శ్రీధర్ చెప్పుకొచ్చాడు

Story first published: Wednesday, August 10, 2022, 9:24 [IST]
Other articles published on Aug 10, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X