న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

T20 World Cup: టీ20ల్లో మెరుస్తున్న అశ్విన్.. వరుణ్ చక్రవర్తికి ఎసరు! తుది జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుందో!

R Ashwin vs Varun Chakravarthy: who should be in india playing 11?

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చినప్పటి నుంచి భారత జట్టులో ఆటగాళ్లకు కొదవే లేకుండా పోయింది. ప్రస్తుతం రెండు పటిష్ట జట్లు మనకు అందుబాటులో ఉన్నాయంటే.. ఐపీఎల్ ఎంతటి ప్రభావం చూపుతుందో మనం అర్ధం చేసుకోవచ్చు. ఒక్కో స్థానం కోసం ఇద్దరుముగ్గురు పోటీ పడుతున్నారు. కుర్రాళ్ల కారణంగా ఓ దశలో సేనియర్లకు చోటు లేకుండా పోతోంది. ఉదాహరణకు.. ఓపెనింగ్ కోసం రోహిత్ శర్మతో పాటు లోకేష్ రాహుల్, శిఖర్ ధావన్, పృద్వి షా, మయాంక్ అగర్వాల్ పోటీపడుతున్నారు. ఇలానే ప్రతి ఒక్క స్థానం కోసం ఇద్దరు ముగ్గురు పోటీలో ఉన్నారు. ఈ క్రమంలో టీ20 ప్రపంచకప్‌ 2021లో కూడా పోటీ తీవ్రంగానే ఉంది. ముఖ్యంగా స్పిన్నర్ల విషయంలో.

IND vs AUS: రోహిత్ హాఫ్ సెంచరీ.. మెరిసిన సూర్యకుమార్! ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం!!IND vs AUS: రోహిత్ హాఫ్ సెంచరీ.. మెరిసిన సూర్యకుమార్! ఆస్ట్రేలియాపై భారత్ ఘన విజయం!!

 అనూహ్యంగా టీ20 ప్రపంచకప్‌కి యాష్:

అనూహ్యంగా టీ20 ప్రపంచకప్‌కి యాష్:

టీమిండియాలో యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ రాకతో వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌కు పరిమిత ఓవర్లలో చోటు కాస్త కష్టమైంది. ఇక ఇటీవలి కాలంలో ఐపీఎల్ టోర్నీలో రాణిస్తున్న రాహుల్ చహర్, వరుణ్ చక్రవర్తిలకు టీంఇండియాలో చోటు దక్కడంతో యాష్ పూర్తిగా పరిమిత ఓవర్లకు దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతకొంతకాలంగా యాష్ టెస్టులకే పరిమితమయ్యాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ టెస్ట్ సిరీసులు గెలవడంతో కీలక పాత్ర పోషించాడు. ఆపై ఇంగ్లండ్ సిరీసుకు ఎంపికయినా మ్యాచులు ఆడలేదు. అనంతరం ఐపీఎల్ 2021లో పర్వాలేదనిపించాడు. అయితే ఇటీవలి కాలంలో పరిమిత ఓవర్ల ఫార్మాట్ ఆడని యాష్.. అనూహ్యంగా టీ20 ప్రపంచకప్‌ 2021కి ఎంపికయి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఈ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది.

తుది జట్టులో ఎవరు ఆడుతారు:

తుది జట్టులో ఎవరు ఆడుతారు:

యూఏఈలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ 2021కు ఎంపికయిన రవిచంద్రన్ అశ్విన్‌, వరుణ్ చక్రవర్తిలు ఐపీఎల్ 2021లో రాణించారు. దాంతో స్పెసలిస్ట్ స్పిన్నర్ విషయంలో భారత్ తుది జట్టుపై ఆసక్తి నెలకొంది. ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజాతో కలిసి బౌలింగ్ చేసేది ఎవరా అని అందరూ ఆలోచిస్తున్నారు. అశ్విన్‌ ప్రాక్టీస్ మ్యాచులలో అదరగొట్టాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియాపై 2 ఓవర్లు వేసి 8 పరుగులుఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు వరుణ్ 2 ఓవర్లు వేసి ఏకంగా 23 పరుగులు ఇచ్చాడు. దాంతో ఇపుడు యాష్ హైలెట్ అయ్యాడు. ఐపీఎల్ 2021లో అదరగొట్టిన వరుణ్ తుది జట్టులో ఆడుతాడా? లేదా ప్రాక్టీస్ మ్యాచులో అదరగొట్టిన యాష్ ఆడతాడో చూడాలి.

టీమిండియా ఘన విజయం:

టీమిండియా ఘన విజయం:

వార్మప్‌ మ్యాచ్‌లో మరోసారి టీమిండియా ఘన విజయం సాధించింది. ఆసీస్‌పై మరో 12 బంతులు మిగిలుండగానే గెలిచింది. 153 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్‌కు కేఎల్ రాహుల్‌ (39), రోహిత్‌ శర్మ (60 రిటైర్ట్) అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. రాహుల్ అవుటైన తర్వాత వచ్చిన సూర్యకుమార్‌ యాదవ్‌ (38 నాటౌట్‌) కూడా రాణించాడు. చివర్లో రోహిత్ శర్మ రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరగడంతో క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్యా (14) సిక్సర్‌తో మ్యాచ్ ముగించాడు. దీంతో భారత జట్టు 17.5 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 152 రన్స్ చేసింది. ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో కూడా టీమిండియా ఇదే రీతిలో అద్భుత విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Thursday, October 21, 2021, 11:00 [IST]
Other articles published on Oct 21, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X