న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బ్యాట్స్‌మెన్‌కు అశ్విన్‌ హెచ్చరిక.. ఎవరైనా క్రీజు వదిలితే మళ్లీ మాన్కడింగ్ చేస్తా!!

R Ashwin says he will Mankad batsmen going out of the crease in IPL 2020

చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 13వ సీజన్‌ వచ్చే ఏడాది మార్చి 29 నుంచి ప్రారంభం కానుంది. అయినా ఐపీఎల్‌ సందడి ఎప్పటి నుండో మొదలయింది. ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున ఆడనున్న టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అప్పుడే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు హెచ్చరిక పంపాడు. ఏ బ్యాట్స్‌మెన్‌ క్రీజు వెలుపలికి వెళ్లినా మరోసారి మాన్కడింగ్ చేస్తా అని అన్నాడు.

'ధోనీ పునరాగమనం ఐపీఎల్‌పై ఆధారపడి ఉంది.. టీమిండియాలో తప్పక ఉంటాడు''ధోనీ పునరాగమనం ఐపీఎల్‌పై ఆధారపడి ఉంది.. టీమిండియాలో తప్పక ఉంటాడు'

ఢిల్లీకి బదిలీ:

ఢిల్లీకి బదిలీ:

ఈ నెల 19న ఐపీఎల్ వేలం ముగిసింది. వేలానికి ముందు గత రెండు సీజన్‌లకు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ కెప్టెన్‌గా ఉన్న అశ్విన్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించిన యాజమాన్యం ఢిల్లీ క్యాపిటల్స్‌కి బదిలీ చేసేసింది. దీంతో.. ఐపీఎల్ 2020 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ తరఫున అశ్విన్‌ బరిలోకి దిగబోతున్నాడు. తాజాగా అశ్విన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా #askash అనే హ్యాష్‌ట్యాగ్‌తో క్రికెట్ అభిమానులతో మాట్లాడాడు.

మళ్లీ మాన్కడింగ్ చేస్తా:

మళ్లీ మాన్కడింగ్ చేస్తా:

#askash 'షో'లో భాగంగా ఐపీఎల్ 2020లోనూ మాన్కడింగ్ చేస్తారా? అని అశ్విన్‌ని ఓ అభిమాని ప్రశ్నించాడు. 'ఓ తప్పకుండా చేస్తా. ఏ బ్యాట్స్‌మెన్‌ అయినా క్రీజు వదిలితే మళ్లీ మాన్కడింగ్ చేస్తా' అని బదులిచ్చాడు. ఈ సమాధానంతో అభిమానులు అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్లు అశ్విన్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'గత ఏడాది విమర్శలు అశ్విన్ మనస్తత్వాన్ని మార్చలేదు' అంటూ విమర్శిస్తున్నారు.

మాన్కడింగ్‌తో బట్లర్‌ ఔట్:

మాన్కడింగ్‌తో బట్లర్‌ ఔట్:

ఐపీఎల్ 2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్‌ ఆటగాడు జోస్ బట్లర్‌ని మాన్కడింగ్ చేయడం ద్వారా అశ్విన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్‌ తన జట్టుని గెలుపు దిశగా నడిపిస్తున్నాడు. అశ్విన్ బౌలింగ్ చేస్తున్న సమయంలో.. బంతి విసరకముందే బట్లర్‌ నాన్‌స్ట్రైక్ ఎండ్‌లోని క్రీజు వెలుపలికి వెళ్లాడు. ఇది గమనించిన అశ్విన్.. బంతిని విసరకుండా బెయిల్స్‌ని పడగొట్టాడు. దీంతో బట్లర్‌ పెవిలియన్ చేరాడు.

కెరీర్‌కు మచ్చ:

కెరీర్‌కు మచ్చ:

మాన్కడింగ్ చేయడంతో అశ్విన్‌పై చాలా విమర్శలు వచ్చాయి. క్రీడాస్ఫూర్తి తప్పాడంటూ చాలా మంది మాజీ క్రికెటర్లు బాహాటంగానే అన్నారు. క్రికెట్ నిబంధనలకి లోబడే మాన్కడింగ్ చేశా అని అశ్విన్ వివరణ ఇచ్చినా ఎవరూ కూడా మద్దతు పలకలేదు. భారత్ తరఫున ఎంతో కీర్తిప్రతిష్టలు గడించిన అశ్విన్.. ఈ ఒక్క ఘటనతో తన సుదీర్ఘ కెరీర్‌కు మచ్చ తెచ్చుకున్నాడు.

Story first published: Tuesday, December 31, 2019, 13:13 [IST]
Other articles published on Dec 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X