న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

200 వికెట్లు: కోహ్లీ కెప్టెన్సీలో అశ్విన్ అరుదైన ఘనత

By Nageshwara Rao
 R Ashwin became the second bowler to take 200 wickets under the captaincy ofvirat kohli

హైదరాబాద్: ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా ఆతిథ్య ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సత్తా చాటుతున్నాడు. అంచనాలకు మించి రాణిస్తూ ఇంగ్లీషు గడ్డపై అసాధారణ ప్రతిభ కనబరుస్తున్నాడు.

తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీసిన రవిచంద్రన్ అశ్విన్, మూడో రోజు లంచ్ విరామ సమయానికి మరో మూడు వికెట్లు తీశాడు. కోహ్లీ సారథ్యంలో అశ్విన్ అరుదైన రికార్డులను నెలకొల్పుతున్నాడు. ఈ క్రమంలో అశ్విన్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు.

కోహ్లీ సారథ్యంలోనే అశ్విన్ 200 వికెట్లను తీసి మరో మైలురాయి అందుకున్నాడు. విరాట్ కోహ్లీ నాయకత్వంలో తక్కువ టెస్టుల్లో ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకు 59 టెస్టులాడిన అశ్విన్ అత్యంత వేగంగా 323 వికెట్లు పడగొట్టాడు.

1
42374

ఒకరి కెప్టెన్సీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాళ్లు:
* శ్రీలంక క్రికెటర్ సనత్ జయసూర్య కెప్టెన్సీలో మాజీ స్పిన్నర్ మురళీ ధరన్(30 మ్యాచ్‌లు) అతి తక్కువ టెస్టుల్లో ఈ రికార్డుని నెలకొల్పాడు.
* ఆస్ట్రేలియా ఆటగాడు రికీ పాంటింగ్ సారథ్యంలో మాజీ స్పిన్నర్ షేన్ వార్న్.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో అశ్విన్ 34 మ్యాచ్‌ల్లో ఈ ఘనత అందుకున్నారు.
* వివ్ రిచర్డ్స్ సారథ్యంలో మాల్కమ్ మార్షల్.. దక్షిమాఫ్రికా మాజీ కెప్టెన్ హాన్సీ క్రోన్జే నేతృత్వంలో ఏ డొనాల్డ్.. దక్షిణాఫ్రికా మాజీ సారథి గ్రేమ్ స్మిత్ సారథ్యంలో డేల్ స్టెయిన్.. 40 మ్యాచ్‌ల్లో ఈ రికార్డును చేరుకున్నారు.

ఇదిలా ఉంటే ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు లంచ్ విరామ సమయానికి 30.4 ఓవర్లలో ఇంగ్లాండ్ 6 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో జోస్ బట్లర్ (1) పరుగుతో ఉన్నాడు. అంతకముందు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 287 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

Story first published: Friday, August 3, 2018, 17:44 [IST]
Other articles published on Aug 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X