న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

India vs South Africa: మూడో టీ20లో డీకాక్ బద్దలు కొట్టిన రికార్డులివే!

Quinton de Kock Powers South Africa To Dominating Victory Against India As T20I Series Ends Level

హైదరాబాద్: దక్షిణాఫ్రికా జట్టు టీ20 కెప్టెన్ క్వింటన్ డీకాక్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో కెప్టెన్సీ అరంగేట్రంలోనే వరుసగా యాభైకి పైగా పరుగులు సాధించిన మూడో క్రికెటర్‌గా గుర్తింపు సాధించాడు. 3 టీ20లు, 3 టెస్టు మ్యాచ్‌ల సిరిస్ ఆడేందుకు సఫారీ జట్టు భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.

ఈ పర్యటనలో భాగంగా టీ20లకు కెప్టెన్‌గా క్వింటన్ డీకాక్‌ను నియమించగా... టెస్టు సిరిస్‌కు డుప్లెసిస్‌ను దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. ఆదివారం ఇరు జట్ల మధ్య మూడో టీ20 జరగడంతో 3 టీ20ల సిరిస్ ముగిసింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 వికెట్లతో ఘన విజయం సాధించింది.

<strong>మరోసారి పంత్ పేలవ ప్రదర్శన: ట్విట్టర్‌లో విమర్శల వర్షం</strong>మరోసారి పంత్ పేలవ ప్రదర్శన: ట్విట్టర్‌లో విమర్శల వర్షం

135 పరుగుల విజయ లక్ష్యంతో

135 పరుగుల విజయ లక్ష్యంతో

భారత్ నిర్దేశించిన 135 పరుగుల విజయ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 16.5 ఓవర్లలో ఛేదించి విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను దక్షిణాఫ్రికా 1-1తో సమం చేసింది. ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి టీ20 వర్షం కారణంగా రద్దు కాగా.. రెండో మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది.

79 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర

79 పరుగులతో జట్టు విజయంలో కీలకపాత్ర

రెండో టీ20లో డీకాక్ 52 పరుగులు సాధించగా... మూడో టీ20లో 79 (52 బంతుల్లో; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) పరుగలతో జట్ట విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ నేపథ్యంలో డీకాక్‌ కెప్టెన్సీ అరంగేట్రంలోనే వరుసగా యాభైకి పైగా పరుగులు సాధించిన మూడో క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో పాల్‌ స్టిర్లింగ్‌(ఐర్లాండ్‌) అగ్రస్థానంలో ఉండగా.. నవనీత్‌ సింగ్‌(కెనడా) రెండో స్థానంలో ఉన్నాడు.

టీ20ల్లో వెయ్యి పరుగుల మైలురాయిని

టీ20ల్లో వెయ్యి పరుగుల మైలురాయిని

దీంతో పాటు టీ20ల్లో క్వింటన్ డీకాక్‌(1018) వెయ్యి పరుగుల మైలురాయిని కూడా అందుకున్నాడు. టీ20ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగులు సాధించిన వికెట్‌ కీపర్ల జాబితాలో కుమార సంగక్కర(శ్రీలంక)తో కలిసి సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాడు. డీకాక్‌ కేవలం 38 ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరాడు.

రెండో కెప్టెన్‌గా డీకాక్ రికార్డు

రెండో కెప్టెన్‌గా డీకాక్ రికార్డు

ఈ జాబితాలో బ్రెండన్‌ మెకల్లమ్‌(31), మహ్మద్‌ షెహ్‌జాద్‌(37)లు వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. అంతేకాదు దక్షిణాఫ్రికా తరఫున టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రెండో కెప్టెన్‌గా డీకాక్‌ గుర్తింపు సాధించాడు. గతంలో డుప్లెసిస్‌ 85 పరుగులు సాధించాడు. ఇప్పటివరకు సపారీ టీ20 కెప్టెన్‌ చేసిన అత్యధిక పరుగుల రికార్డు ఇదే.

Story first published: Monday, September 23, 2019, 11:53 [IST]
Other articles published on Sep 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X