న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పుల్వామా ఉగ్రదాడి ఎఫెక్ట్: పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లు నిలిపివేత

The IMG Reliance Has Decided To Remove The PSL live Streaming | Oneindia Telugu
Pulwama Attack fallout: IMG-Reliance refuse to broadcast Pakistan Super League

హైదరాబాద్: పుల్వామా ఉగ్రదాడి ప్రభావం దాయాది దేశమైన పాకిస్థాన్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే పాక్‌కు ఎంఎఫ్ఎన్ హోదాని భారత ప్రభుత్వం తొలగించిన సంగతి తెలిసిందే. తాజాగా పుల్వామా ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఐఎంజీ రిలయన్స్ పాకిస్థాన్ సూపర్ లీగ్ ప్రత్యక్ష ప్రసారాలను నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఐఎంజీ రిలయన్స్‌ పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు తెలియజేసింది.

పుల్వామా ఉగ్రదాడి కారణంగా యావత్తు దేశం విషాదంలో మునిగిపోయిందని, ఇటువంటి సమయంలో పాక్ క్రికెట్ మ్యాచ్‌లు భారత్ లో ప్రసారం చేయడం భావ్యం కాదని అందుకే ఈ నిర్ణయం తీసుకుందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఆ సంస్ధ నిర్వాహాకులు వెల్లడించారు.

ఇప్పటికీ నేనే యూనివర్సల్ బాస్: తొలి వన్డే‌కి ముందు రిపోర్టర్లతో గేల్ఇప్పటికీ నేనే యూనివర్సల్ బాస్: తొలి వన్డే‌కి ముందు రిపోర్టర్లతో గేల్

భద్రతా కారణాలరీత్యా ప్రస్తుతం టోర్నీని యూఏఈలో నిర్వహిస్తుండగా.. నాకౌట్‌ మ్యాచ్‌లను పాకిస్థాన్‌లోని లాహోర్‌, కరాచీలలో నిర్వహించనున్నారు. పీఎస్ఎల్ మ్యాచ్‌లను ప్రసారం చేసేందుకు ఐఎంజీ రిలయన్స్‌ గతంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుతో ఒప్పందం కుదుర్చుకుంది. తాజా ఉగ్రదాడి నేపథ్యంలో ప్రసారాల నుంచి రిలయన్స్‌ తప్పుకున్నట్లు పీసీబీ అధికారికంగా ధ్రువీకరించింది. మరో సంస్థ కోసం వెతుకుతున్నట్లు తెలిపింది.

ఉగ్రదాడిని నిరసిస్తూ

ఉగ్రదాడిని నిరసిస్తూ

మరోవైపు ఉగ్రదాడిని నిరసిస్తూ ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియంలో ఉన్న పాక్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఫొటోలను తీసివేయాల్సిందిగా క్రికెట్ క్లబ్ ఆఫ్ ఇండియా (సీసీఐ) మేనేజింగ్ కమిటీ నిర్ణయించింది. ఆల్ రౌండర్ విభాగంలో ఇమ్రాన్ ఖాన్ ఫొటోను, క్రికెట్ జట్టు విభాగంలో పాక్ ఫొటోలను ఆ స్టేడియంలో ఉంచారు. ఆ జట్టులో ఇమ్రాన్ కూడా ఉండటంతో ఆ ఫొటోలను తొలగించారు.

పీసీఏ వినూత్న నిరసన

పీసీఏ వినూత్న నిరసన

ఇదిలా ఉంటే, పుల్వామా ఉగ్రదాడిపై పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (పీసీఏ) వినూత్నంగా నిరసన వ్యక్తం చేసింది. మొహాలి క్రికెట్‌ స్టేడియంలో ఉన్న 15 మంది పాకిస్తాన్‌ క్రికెటర్ల ఫొటోలను పీసీఏ తొలగించింది. స్టేడియంలో లోపలి భాగంలో గ్యాలరీలో, రిసెప్షన్‌ వద్ద, 'హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌'లో ఈ చిత్రాలు ఉన్నాయి.

ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, షాహిద్‌ అఫ్రిదిల ఫోటోలు తొలగింపు

ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, షాహిద్‌ అఫ్రిదిల ఫోటోలు తొలగింపు

"జవాన్ల పై దాడికి సంబంధించి దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు ఉన్నాయి. మేం కూడా దానికి అతీతులం కాదు. చనిపోయిన కుటుంబాలకు సంఘీభావం ప్రకటిస్తూ మా వైపు నుంచి ఈ చర్య తీసుకున్నాం" అని పీసీఏ కోశాధికారి అజయ్‌ త్యాగి చెప్పారు. తొలగించిన ఫోటోల జాబితాలో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో పాటు మియాందాద్, వసీం అక్రమ్, షాహిద్‌ అఫ్రిదిల ఫోటోలు ఉన్నాయి.

Story first published: Wednesday, February 20, 2019, 10:21 [IST]
Other articles published on Feb 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X