పాకిస్థాన్ సూపర్ లీగ్: కరాచీ కింగ్స్ కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్

Posted By:
 PSL 2018: Karachi Kings announce their new captain in absence of Imad Wasim

హైదరాబాద్: పీఎస్ఎల్‌లో కరాచీ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ఎంపికయ్యాడు. దుబాయి వేదికగా ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ మూడో సీజన్‌లో జరుగుతోన్న సంగతి తెలిసిందే. గాయం కారణంగా కరాచీ కింగ్స్ జట్టు కెప్టెన్ ఇమద్ వసీం టోర్నీలోని మిగతా రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

జట్టులో పాకిస్థాన్‌కు చెందిన బాబర్ అజామ్, మహమ్మద్ అమీర్, షాహిద్ అఫ్రిది లాంటి ఆటగాళ్లు ఉన్నప్పటికీ టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం ఇమద్ వసీం స్థానంలో కెప్టెన్‌గా ఇయాన్ మోర్గాన్‌నే ఎంపిక చేసింది. ఈ మేరకు బుధవారం జట్టు మేనేజ్‌మెంట్ బుధవారం అధికారిక ప్రకటన చేసింది.

ఇయాన్ మోర్గాన్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అనేక అద్భుత విజయాలను సొంతం చేసుకుంది. టీ20 ఫార్మాట్‌లో ఇయాన్ మోర్గాన్ జట్టుని విజయవంతంగా నడిపించగలడనే నమ్మకంతో అతడిని కెప్టెన్‌గా ఎంపిక చేసినట్లు పేర్కొంది.

'కరాచీ కెప్టెన్ ఇమద్ వసీం గాయం పడటంతో వైద్యులు అతడికి కొన్ని రోజులు విశ్రాంతి కావాలని సూచించారు. దీంతో కరాచీ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా ఇంగ్లాండ టీ20, వన్డే కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను నియమిస్తున్నాం' అని చెప్పేందుకు గర్వపడుతున్నామని జట్టు మేనేజ్‌మెంట్ ఒక ప్రకటనలో పేర్కొంది.

కాగా, కరాచీ కింగ్స్ 9 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పటివరకు కరాచీ కింగ్స్ ఆడిన 8 మ్యాచ్‌ల్లో 4 మ్యాచ్‌ల్లో విజయం సాధించారు. మార్చి 15న తమ తదుపరి మ్యాచ్‌లో పెషావర్ జల్మీతో తలపడనుంది. లీగ్‌ దశలో భాగంగా కరాచీ కింగ్స్ తన చివరి మ్యాచ్‌ని మార్చి 16న ఇస్లామాబాద్ యునైటెడ్‌తో ఆడనుంది.

Story first published: Wednesday, March 14, 2018, 17:42 [IST]
Other articles published on Mar 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి