న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియాకు షాక్.. ఓపెనర్‌కు గాయం.. నెట్ సెషన్‌కు దూరం!!

Prithvi Shaw suffers swelling on leg, Skips Practice, Shubman Gill Likely To Make Test Debut


క్రైస్ట్‌చర్చ్:
న్యూజిలాండ్‌తో శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో విజయం సాధించాలని టీమిండియా ఎంతో పట్టుదలతో ఉంది. అయితే యువ ఓపెనర్ పృథ్వీ షాకు అయిన గాయం టీమిండియాను కాస్త కలవరపెడుతోంది. పృథ్వీ షా ప్రస్తుతం ఎడమ కాలు వాపుతో బాధపడుతున్నాడట. దీంతో గురువారం హాగ్లీ ఓవల్‌లో జరిగిన భారత నెట్ సెషన్‌లో అతడు పాల్గొనలేదు. షా మైదానంలో ఉన్నప్పటికీ నెట్స్‌లో బ్యాటింగ్ మాత్రం చేయలేదు.

సిక్సర్‌ లేకుండా వన్డేల్లో అత్యధిక స్కోరు.. ఇంగ్లండ్ రికార్డు బద్దలు కొట్టిన లంక!!సిక్సర్‌ లేకుండా వన్డేల్లో అత్యధిక స్కోరు.. ఇంగ్లండ్ రికార్డు బద్దలు కొట్టిన లంక!!

గాయంతో బాధపడుతున్న షా:

గాయంతో బాధపడుతున్న షా:

కాలు వాపుతో బాధపడుతున్న పృథ్వీ షా రెండో టెస్ట్ సమయానికి కోలుకుంటాడని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తోంది. రెండో టెస్టులో మయాంక్ అగర్వాల్‌తో కలిసి పృథ్వీ షా ఓపెనింగ్ చేస్తాడని మేనేజ్మెంట్ ధీమా వ్యక్తం చేసింది. గురువారం షా భారత నెట్ సెషన్‌లో పాల్గొనలేదు. అయితే మైదానంలో ఉండి సీనియర్ల సాధనను పరిశీలించాడు. ఇక హెడ్ కోచ్ అతనికి విలువైన సూచనలు ఇచ్చాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు మిగిలిన జట్టు ప్రాక్టీస్ చేసింది.

 బ్యాకప్‌గా శుభమాన్:

బ్యాకప్‌గా శుభమాన్:

ప్రస్తుతం పృథ్వీ షాను భారత వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. ఒకవేళ మ్యాచ్ సమయానికి పృథ్వీ షా కాలు వాపు తగ్గకుంటే శుభమాన్ గిల్‌ రూపంలో తమకు బ్యాకప్ ఉందని భారత జట్టు యాజమాన్యం తెలిపింది. షాకు అయిన గాయం తగ్గకుంటే.. అగర్వాల్‌తో కలిసి గిల్‌ ఓపెనింగ్ చేస్తాడు. ఇదే జరిగితే గిల్ భారత్ తరఫున టెస్టుల్లో ఆరంగేట్రం చేయనున్నాడు. ఇప్పటికే షా విఫలమవుతుండడంతో గిల్‌ను ఆడించాలని డిమాండ్లు పెరుగుతున్న విషయం తెలిసిందే.

గిల్ ప్రాక్టీస్:

గిల్ ప్రాక్టీస్:

గత నెలలో న్యూజిలాండ్ పర్యటనలో ఇండియా 'ఎ' తరఫున ఆడిన శుభమాన్ గిల్‌ అద్భుతంగా ఆడి మంచి ఫామ్‌లో ఉన్నాడు. గిల్ గురువారం జరిగిన సాధనలో సుదీర్ఘ సమయం బ్యాటింగ్ చేశాడు. ప్రధానంగా పేస్ బౌలింగ్‌లో బంతులను ఎదుర్కొన్నాడు. అలానే షార్ట్ పిచ్ బౌలింగ్‌ను ఎదుర్కోన్నాడు. సీనియర్లు చటేశ్వర్ పుజారా, అజింక్య రహానేలతో కలిసి అతడు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసాడు.

 ప్రాక్టీస్ మ్యాచ్‌లో విఫలం:

ప్రాక్టీస్ మ్యాచ్‌లో విఫలం:

ఇటీవల అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్న గిల్‌ వ‌రుస సెంచ‌రీల‌తో స‌త్తాచాటాడు. న్యూజిలాండ్ 'ఎ'పై సెంచ‌రీతో ఆక‌ట్టుకున్న గిల్‌.. అంత‌కుముందు ద్విశ‌త‌కంతో దుమ్మురేపాడు. ఇటీవ‌ల న్యూజిలాండ్ లెవ‌న్‌తో జ‌రిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో త‌నకు బ్యాటింగ్ చేసే అవ‌కాశం ల‌భించింది. అయితే ఇందులో కేవ‌లం 8 ర‌న్స్ మాత్ర‌మే చేసి చాన్స్ వృథా చేసుకున్నాడు.

Story first published: Thursday, February 27, 2020, 12:27 [IST]
Other articles published on Feb 27, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X