న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఎగబాకారు: ఐసీసీ ర్యాంకుల్లో దూకుడు కనబర్చిన పృథ్వీ షా, పంత్

Prithvi Shaw, Rishabh Pant surge in the ICC ranking for Test batsmen

హైదరాబాద్: వెస్టిండిస్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌ను 2-0తో ఆతిథ్య టీమిండియా కైవసం చేసుకున్న నేపథ్యంలో భారత యువ ఆటగాళ్లు పృథ్వీ షా, రిషబ్ పంత్‌లు టెస్టుల్లో తమ తమ ర్యాంకులను మరింతగా మెరుగు పరచుకున్నారు.

<strong>మరిన్ని చిక్కుల్లో పడ్డ బీసీసీఐ బాస్: ఐసీసీ మీటింగ్ నుంచి పేరు తప్పించారు</strong>మరిన్ని చిక్కుల్లో పడ్డ బీసీసీఐ బాస్: ఐసీసీ మీటింగ్ నుంచి పేరు తప్పించారు

ఐసీసీ తాజాగా సోమవారం ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో వీరిద్దరూ పది స్థానాలకు పైగా ఎగబాకారు. మరోవైపు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. హైదరాబాద్‌ వేదికగా జరిగిన రెండో టెస్టులో 70, 33 నాటౌట్‌తో నిలిచిన పృథ్వీ షా 13 స్థానాలకు ఎగబాకి 60వ ర్యాంకులో నిలిచాడు.

రాజ్ కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పృథ్వీ షా సెంచరీ సాధించడంతో తన టెస్టు కెరీర్‌ను 73వ స్థానంతో ప్రారంభించిన సంగతి తెలిసిందే. విండిస్‌తో జరిగిన రెండు టెస్టుల్లో 90కిపైగా పరుగులు చేసిన యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఏకంగా 23 స్థానాలు ఎగబాకి 62వ ర్యాంకులో నిలిచాడు.

విండిస్‌తో టెస్టు ఆరంభానికి ముందు పంత్ 111వ ర్యాంకులో

విండీస్‌ సిరీస్‌ ఆరంభానికి ముందు రిషబ్ పంత్ 111వ ర్యాంకులో ఉండటం విశేషం. రాజ్ కోట్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 92 పరుగుల వద్ద ఔటైన రిషబ్ పంత్, హైదరాబాద్ వేదికగా జరిగిన రెండో టెస్టులో సైతం అదే 92 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరిన సంగతి తెలిసిందే. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 134 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 92 పరుగులు చేసిన పంత్.. అనవసర షాట్‌కు ప్రయత్నించి మిడ్‌ఆఫ్‌లో ఉన్న హెట్‌మైర్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు.

రెండో భారత ఆటగాడిగా పంత్ ఓ చెత్త రికార్డును

రెండో భారత ఆటగాడిగా పంత్ ఓ చెత్త రికార్డును

దీంతో వరుస ఇన్నింగ్స్‌ల్లో 90పైచిలుకు పరుగుల వద్ద ఔటైన రెండో భారత ఆటగాడిగా పంత్ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతకుముందు ఈ రికార్డు మాజీ క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్ పేరిట ఉండేది. 1997 శ్రీలంకపై రెండు ఇన్నింగ్స్‌ల్లో రాహుల్ ద్రవిడ్ వరుసగా 92, 93 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇప్పుడు పంత్ కూడా రాజ్‌ కోట్‌, హైదరాబాద్‌ రెండు వేదికల్లోను పంత్‌ 92 పరుగుల వద్దే వెనుదిరగడం గమనార్హం.

18వ ర్యాంకులో రహానే

18వ ర్యాంకులో రహానే

ఇక, హైదరాబాద్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 80 పరుగులు చేసిన రహానే నాలుగు స్థానాలు ఎగబాకి 18వ ర్యాంకు సాధించాడు. ఈ టెస్టులో పది వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన టీమిండియా పేసర్ ఉమేశ్‌ యాదవ్‌ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 25వ స్థానంలో నిలిచాడు. రెండో టెస్టులో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి పది వికెట్లు తీసి ఉమేశ్ యాదవ్ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.

25వ స్థానంలో నిలిచిన ఉమేశ్ యాదవ్

25వ స్థానంలో నిలిచిన ఉమేశ్ యాదవ్

తద్వారా భారత్ తరుపున టెస్టుల్లో పది వికెట్లు సాధించిన ఎనిమిదో భారత పేసర్‌గా నిలిచాడు. ఇప్పటివరకూ భారత్‌ తరఫున ఏడుగురు మాత్రమే ఈ ఘనత సాధించారు. హైదరాబాద్ టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసిన ఉమేశ్‌.. రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో వెస్టిండిస్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. ఫలితంగా టెస్టుల్లో తొలిసారి ఉమేశ్ యాదవ్ పది వికెట్లు పడగొట్టాడు.

కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకుకు జాసన్ హోల్డర్

కెరీర్‌ బెస్ట్‌ ర్యాంకుకు జాసన్ హోల్డర్

అంతకముముందు కపిల్‌దేవ్‌, చేతన్‌ శర్మ, వెంకటేశ్‌ ప్రసాద్‌, జవగళ్‌ ప్రసాద్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌, ఇషాంత్‌ శర్మ, జహీర్‌ ఖాన్‌లు మాత‍్రమే 10 వికెట్లు సాధించిన పేసర్లు. ఇందులో కపిల్‌ దేవ్‌, ఇర్ఫాన్‌ పఠాన్‌లు రెండేసి సార్లు ఈ ఘనత సాధించారు. విండీస్‌ కెప్టెన్ జాసన్ హోల్డర్‌ కెరీర్‌ బెస్ట్‌ 53వ ర్యాంకు సాధించాడు.

Story first published: Monday, October 15, 2018, 16:27 [IST]
Other articles published on Oct 15, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X