ఫిరోజ్ షా కోట్లాలో ఢిల్లీని 'చిత్తు' చేస్తారా? (ఫోటోలు)

Posted By:

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పదో సీజన్‌లో భాగంగా మంగళవారం వరుస విజయాలతో దూసుకుపోతున్న డిఫెండింగ్‌ చాంపియన్‌ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విజయం సాధిస్తే పాయింట్ల పట్టికలో కోల్ కతాను వెనక్కి నెట్టి రెండో స్ధానంలో నిలుస్తుంది. పదో సీజన్‌లో సన్‌రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. జట్టుని ముందుండి నడిపించడంతో పాటు జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు.

సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్

సెంచరీతో ఆకట్టుకున్న వార్నర్

ఆదివారం కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు తొమ్మిది మ్యాచ్‌లాడిన వార్నర్ 459 పరుగులతో టోర్నీలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. దీంతో ‘ఆరెంజ్‌ క్యాప్‌'ను తన సొంతం చేసుకున్నాడు. వార్నర్‌కి తోడు ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (341), కేన్‌ విలియమ్సన్‌ (204), మోజెస్‌ హెన్రిక్స్‌ (200) రాణించడం జట్టుకు కలిసొచ్చే అంశం.

అత్యుత్తమ బౌలింగ్‌ లైనప్‌ సన్ రైజర్స్ సొంతం

అత్యుత్తమ బౌలింగ్‌ లైనప్‌ సన్ రైజర్స్ సొంతం

ఇక బౌలింగ్‌ విషయానికొస్తే టోర్నీలోనే అత్యుత్తమ బౌలింగ్‌ లైనప్‌ ఉన్న జట్లలో సన్‌రైజర్స్‌ ఒకటి. సన్ రైజర్స్ బౌలర్ భువనేశ్వర్‌ కుమార్‌ తొమ్మిది మ్యాచ్‌ల్లోనే 20 వికెట్లు తీసి ‘పర్పుల్‌ క్యాప్‌'ను సొంతం చేసుకున్నాడు. అప్ఘనిస్థాన్ యువ బౌలర్ రషీద్‌ ఖాన్‌ (12 వికెట్లు), ఆశిష్‌ నెహ్రా (8), సిద్దార్థ్‌ కౌల్‌ (7) రాణిస్తున్నారు.

కొత్త బంతితో రాణిస్తున్న మహ్మద్ సిరాజ్

కొత్త బంతితో రాణిస్తున్న మహ్మద్ సిరాజ్

ఇక హైదరాబాద్ ఆటగాడు మహ్మద్‌ సిరాజ్‌ కొత్త బంతితో రాణిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇంతకముందు జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు పది మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌ ఆరింటిలో విజయం సాధించగా, మూడింట ఓటమి పాలైంది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. దీంతో 13 పాయింట్లతో పట్టికలో మూడోస్థానంలో కొనసాగుతోంది.

ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శన చేస్తోన్న ఢిల్లీ

ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శన చేస్తోన్న ఢిల్లీ

ఇక ఢిల్లీ విషయానికి వస్తే ఈ సీజన్‌లో చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌తో జరిగిన చివరిమ్యాచ్‌లో కేవలం 67 పరుగులకే కుప్పకూలింది. టోర్నీ చరిత్రంలో ఢిల్లీకిదే అత్యల్ప స్కోరు కావడం విశేషం. మంగళవారం నాటి మ్యాచ్‌కి కెప్టెన్ జహీర్ ఖాన్ కూడా దూరమవడం జట్టును ఇబ్బందులకు గురిచేస్తోంది.

ఢిల్లీకి మరిన్ని కష్టాలు

ఢిల్లీకి మరిన్ని కష్టాలు

మరోవైపు ఇంగ్లాండ్ ఆటగాళ్లు శామ్‌ బిల్లింగ్స్, క్రిస్‌ మోరిస్, దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబడ ఈ వారం నుంచి ఐపీఎల్ నుంచి వైదొలుగుతుండడంతో ఢిల్లీకి మరిన్ని కష్టాలు తోడవనున్నాయి. బ్యాటింగ్‌లో ఢిల్లీ యువ బ్యాట్స్ మెన్ సంజూ శాంసన్ 289 పరుగులతో ఫరవాలేదనిపిస్తున్నాడు.

ఆఖరి స్థానంలో నిలిచిన ఢిల్లీ

ఆఖరి స్థానంలో నిలిచిన ఢిల్లీ

యువ ఆటగాళ్లు శ్రేయాస్‌ అయ్యర్, రిషబ్ పంత్‌ ఓ మాదిరిగా రాణిస్తున్నారు. ఐపీఎల్ పదో సీజన్‌లో ఎనిమిది మ్యాచ్‌లాడిన ఢిల్లీ కేవలం రెండు మ్యాచ్‌ల్లో నెగ్గగా.. ఆరు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది. దీంతో నాలుగు పాయింట్లతో పట్టికలో ఆఖరి స్థానంలో నిలిచింది. మరోవైపు ఢిల్లీ ఆడబోయే చివరి ఆరు మ్యాచ్‌ల్లో ఐదు సొంతగడ్డపైనే ఆడనుంది.

Story first published: Tuesday, May 2, 2017, 17:20 [IST]
Other articles published on May 2, 2017

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి