న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సిరిస్‌పై కన్నేసిన భారత్: లంక ధీటుగా బదులిస్తుందా?

By Nageshwara Rao
Preview, 2nd T20I: India aim to wrap up the series

హైదరాబాద్: అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శ్రీలంక మరో సిరిస్‌ను గెలుచుకునేందుకు సన్నద్ధమైంది. మూడు టీ20ల సిరిస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే గెలుచుకోవాలని రోహిత్ సేన ఉవ్విళ్లూరుతోంది. ఇండోర్ వేదికగా శుక్రవారం భారత్-శ్రీలంక జట్ల మధ్య రెండో టీ20 జరగనుంది.

కటక్ వేదికగా జరిగిన తొలి టీ20లో టీమిండియా పూర్తి ఆధిపత్యం సాధించి భారీ తేడాతో విజయాన్ని సొంతం చేసుకుంది. అదే జోరుని రెండో టీ20లో కూడా చూపిస్తే 2-0తో టీ20 సిరిస్‌ను కూడా కైవసం చేసుకుంటుంది. దీంతో ఈ మ్యాచ్‌లో భారత జట్టు పెద్దగా మార్పులేమీ చేసేలా కనిపించడం లేదు.

కెప్టెన్‌ రోహిత్‌ శర్నకు ఓపెనర్‌గా క్రీజులోకి వచ్చిన కేఎల్‌ రాహుల్‌ హాఫ్ సెంచరీతో రాణించాడు. దీంతో రెండో టీ20లో కూడా కేఎల్ రాహులే ఓపెనర్‌గా రానున్నాడు. ఇక వన్ డౌన్‌లో శ్రేయాస్ అయ్యర్ ఉండనే ఉన్నాడు. తొలి టీ20లో నాలుగో స్ధానంలో బ్యాటింగ్‌కు దిగిన ధోని తన దైన శైలిలో రాణించాడు.

తొలి టీ20లో చివర్లో మనీష్ పాండే దూకుడుతో టీమిండియా భారీ స్కోరు చేసింది. ఇలా టాప్‌-5 బ్యాట్స్‌మెన్‌ ఫామ్‌లో ఉండడం జట్టుకు కలిసొచ్చే అంశమే. దీంతో ఇండోర్‌లో కూడా ఇదే ఆర్డర్‌ను కొనసాగించొచ్చు. ఓవర్లు మరీ తక్కువగా ఉండి... భారీ హిట్టింగ్‌ చేయాల్సి వస్తే పాండ్యాను ముందుగా పంపే ఆలోచన చేయొచ్చు.

ఇక, బౌలింగ్ విషయానికి వస్తే మణికట్టు స్పిన్నర్లు చాహల్‌, కుల్దీప్‌లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్‌.. ఉనద్కత్‌ స్థానంలో కొత్త పేసర్‌ బసిల్‌ థంపిని తీసుకోవచ్చు. దీపక్‌ హూడాకు కూడా ఈ సిరీస్‌లో అరంగేట్రం చేయడం ఖాయం. కానీ అది ఈ మ్యాచ్‌లోనా.. మూడో టీ20లోనా అన్నది తెలియాలి.

ఇక, శ్రీలంక ఆటతీరు విషయానికి వస్తే తొలి టీ20లో మరీ తీసికట్టుగా ఆడింది. ఏ విభాగంలోనూ భారత్‌కు సమ ఉజ్జీగా నిలవలేకపోయింది. ఓపెనింగ్‌లో డిక్‌వెలా, తరంగ ఫర్వాలేదనుకున్నా ఆ తర్వాత బరిలోకి దిగిన బ్యాట్స్‌మన్ పూర్తిగా విఫలమయ్యారు. సీనియర్‌ క్రికెటర్ మాథ్యూస్‌ కూడా విఫలమయ్యాడు.

కుషాల్‌ పెరీరా ఈ సిరిస్‌లో పెద్దగా రాణించలేదు. గుణరత్నే, కెప్టెన్‌ తిసారా పెరీరాలో నిలకడ లేదు. తొలి టీ20లో పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ షనకను కెప్టెన్‌ కంటే ముందు పంపినా ఫలితం లేకపోయింది. ముఖ్యంగా స్పిన్నర్లు చాహల్‌, కుల్దీప్‌లను లంక బ్యాట్స్‌మెన్‌ ఎలా ఎదుర్కొంటారన్నదానిపైనే లంక గెలుపు ఆధారపడి ఉంది.

రెండో టీ20 జరిగే ఇండోర్‌లో శ్రీలంక కూడా ఒక మార్పుతో దిగనున్నట్లు తెలుస్తోంది. ఎడమచేతి వాటం పేసర్‌ విశ్వ ఫెర్నాండో స్థానంలో బ్యాట్స్‌మన్‌ సమరవిక్రమను తుది జట్టులోకి తీసుకోనున్నారు.

పిచ్, వాతావరణం:
ఇండోర్‌లోని హోల్కర్‌ స్టేడియం బ్యాటింగ్ పిచ్. మంచు ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. బౌండరీ చిన్నది కావడంతో పరుగుల వరద పారే అవకాశముంది. వర్ష సూచన లేదు.

జట్లు (అంచనా):
భారత్‌:
రోహిత్‌శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్, ఎంఎస్‌ ధోని, శ్రేయస్‌ అయ్యర్, మనీశ్‌పాండే, దినేశ్‌ కార్తీక్, హార్దిక్‌ పాండ్యా, యజువేంద్ర చహల్, కుల్దీప్‌ యాదవ్, బుమ్రా, బసిల్‌ థంపి
శ్రీలంక: తిసారా పెరీరా (కెప్టెన్‌), డిక్‌వెలా, తరంగ, మాథ్యూస్, కుషాల్‌ పెరీరా, సమరవిక్రమ, గుణరత్నే, షనక, అకిల ధనంజయ, చమీర, ప్రదీప్‌

Live on: రాత్రి 7 గంటల నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌లో

Story first published: Friday, December 22, 2017, 10:09 [IST]
Other articles published on Dec 22, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X