న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

హైదరాబాద్‌ క్రికెటర్ల పరిస్థితి ఇంతే!: రాయుడికి మద్దతుగా ఓజా ట్వీట్

Pragyan Ojha posts cryptic tweet on Ambati Rayudu’s exclusion from World Cup squad

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరగనున్న వన్డే వరల్డ్‌కప్‌ జట్టులో హైదరాబాద్ క్రికెటర్ అంబటి రాయుడుని సెలక్టర్లు ఎంపిక చేయకపోవడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ బహిరంగంగానే సెలక్టర్లపై విమర్శలు కురిపించాడు.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

దీంతో వరల్డ్‌కప్ జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన అంబటి రాయుడు, రిషబ్ పంత్‌లను స్టాండ్ బై ఆటగాళ్లుగా ఎంపిక చేస్తూ బీసీసీఐ అ మరుసటి రోజు ప్రకటన విడుదల చేసింది. తాజాగా అంబటి రాయుడికి మద్దతిస్తూ హైదరాబాదీ ఆటగాడు ప్రజ్ఞాన్‌ ఓజా చేసిన ట్వీట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది.

వరల్డ్ కప్ జట్టులో ఎంపిక చేసే సమయంలో అంబటి రాయుడు, విజయ్‌ శంకర్‌లలో ఎవరిని తీసుకోవాలనే దానిపై తీవ్ర చర్చ జరిగిందని, చివరికి విజయ్ శంకర్‌‌వైపు మొగ్గు చూపామని ఎమ్మెస్కే ప్రసాద్ అన్నాడు. "NO.4 స్పాట్‌లో అంబటి రాయుడు, విజయ్ శంకర్‌లకు పలు అవకాశాలు ఇచ్చాం. అయితే శంకర్‌ మూడు రకాలుగా(త్రీ డైమెన్షన్స్‌) ఉపయోగపడతాడు. శంకర్‌ బ్యాటింగ్‌, బౌలింగే కాదు మంచి ఫీల్డర్‌ కూడా. దీంతో శంకర్‌ వైపే మొగ్గు చూపాం" అని ఎమ్మెస్కే ప్రసాద్‌ అన్నాడు.

దీంతో ఎమ్మెస్కే వ్యాఖ్యలపై అంబటి రాయుడు వ్యంగ్యంగా వచ్చే వరల్డ్‌కప్‌ను '3డీ' కళ్లద్దాలు పెట్టుకుని చూస్తానంటూ రాయుడు ట్విట్టర్‌లో పోస్టు పెట్టాడు. "ఇప్పుడే 3d గ్లాసెస్ కోసం ఆర్డర్‌ చేశా. వచ్చే వరల్డ్‌కప్‌ను ఆ గ్లాసెస్‌తోనే చూస్తా" అంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌పై బీసీసీఐ స్పందిస్తూ రాయుడి బాధను అర్థం చేసుకోగలమని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోమని స్పష్టం చేసింది.

తాజాగా అంబటి రాయుడి ట్వీట్‌పై హైదరాబాద్ క్రికెటర్ ప్రజ్ఞాన్‌ ఓజా తన ట్విట్టర్‌లో "హైదరాబాద్‌ క్రికెటర్లలో కొందరి పరిస్థితి ఇంతే. ఇలాంటి పరిస్థితులను నేను ఎదుర్కున్నా. ఇది అందరూ అర్థం చేసుకోవాల్సిన అంశం" అని రాయుడికి మద్దతు తెలుపుతూ ట్వీట్‌ చేశాడు.

ప్రజ్ఞాన్ ఓజా విషయానికి వస్తే కెరీర్ అత్యున్నత దశలో ఉండగా కారణం లేకుండా జాతీయ జట్టు నుంచి తొలగించారు. భారత్ తరుపున 24 టెస్టులాడి 113 వికెట్లు తీశాడు. క్రికెట్ లెజెండ్ సచిన్‌ టెండూల్కర్ వీడ్కోలు టెస్టు మ్యాచ్‌లో వెస్టిండిస్‌ జట్టుపై ఓజా ఏకంగా పది వికెట్లు తీసి 'మ్యాన్ఆ ఫ్‌ ది మ్యాచ్‌' అవార్డుని గెలుచుకున్నాడు. 18 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు, 6 టీ20లు కూడా ఆడాడు.

Story first published: Friday, April 19, 2019, 18:09 [IST]
Other articles published on Apr 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X