న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అందుకే ధోనీ అంటే బౌలర్లకు ఇష్టం: మాజీ క్రికెటర్

Pragyan Ojha Explains Why bowlers praise MS Dhoni
MS Dhoni Helps Bowlers To Keep Their Mind Clear On Field Says Pragyan Ojha | Oneindia Telugu

బౌలర్లకు అండగా నిలవడం, వారి‌ ఒత్తిడి తగ్గించి ఉత్సాహాన్ని అందించడంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి మరే సారథి సాటిరాడు. ఈ విషయాన్ని బౌలర్లే చాలా సందర్భాల్లో వెల్లడించారు. వారు చెప్పడమే కాదు.. అతని పర్యవేక్షణాలో బౌలర్లు సాధించిన వికెట్లు.. రికార్డులు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశాయి.

టీమిండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా సైతం నిన్న(మంగళవారం) తన తొలి మ్యాచ్.. ఫస్ట్ బాల్ అనుభవాన్ని నెమరువేసుకుంటూ ధోనీపై ప్రశంసల జల్లు కురిపించాడు. తాజాగా భారత మాజీ క్రికెటర్, హైదరాబాద్ స్టార్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా కూడా జార్ఖండ్ డైనమైట్‌ను ఆకాశానికెత్తాడు.

ప్రశాంతంగా ఉంటారు..

ప్రశాంతంగా ఉంటారు..

ఇటీవలె అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ఈ హైదరాబాద్ స్టార్.. ధోనిని బౌలర్ల కెప్టెన్‌గా ఎందుకు పిలుస్తారో వివరించాడు.‘ధోనీ బౌలర్ల కెప్టెన్. బౌలర్లను అర్థం చేసుకునే కెప్టెన్ ఉండాలి. ధోనీ ఇచ్చే సూచనలు, సలహాలు, మైదానంలో ఫీల్డింగ్ సెట్ చేసే విధానంతోనే అందరూ అతన్ని ప్రశంసిస్తారు. ఇలాంటి సారథి పక్కన ఉంటే ఉత్కంఠకర మ్యాచ్‌లో కూడా బౌలర్ల ప్రశాంతంగా బౌలింగ్ చేస్తారు. 'అని ఓజా తెలిపాడు.

చహల్, రోహిత్ కోతేశాలు.. ఒక తన్ను తన్నిన ఖలీల్ (వైరల్ వీడియో)

ధోనీ సారథ్యంలోనే..

ధోనీ సారథ్యంలోనే..

ఇక ప్రజ్ఞాన్ ఓజా అంతర్జాతీయ క్రికెట్‌ను ధోనీ సారథ్యంలోనే ప్రారంభించాడు. 2008 ఆసియా కప్‌లో కరాచీ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో వన్డే కెరీర్‌ను ప్రారంభించాడు. 2009లో శ్రీలంక పర్యటనలో భాగంగా జరిగిన టెస్ట్‌తో సంప్రదాయక ఫార్మాట్‌ను, 2009లో బంగ్లాదేశ్‌తో టీ20 కెరీర్ మొదలుపెట్టాడు. మూడు ఫార్మాట్లు ధోనీ సారథ్యంలోనే మొదలుపెట్టిన ఈ హైదరాబాద్ క్రికెటర్.. తన అంతర్జాతీయ కెరీర్‌ను కూడా ఈ జార్ఖండ్ డైనమైట్ సారథ్యంలోనే ఎక్కువగా కొనసాగింది.

2013లో చివరి మ్యాచ్..

2013లో చివరి మ్యాచ్..

2013 నుంచి అంతర్జాతీయ క్రికెట్ దూరమైన ఓజా.. భారత్‌ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 113 వికెట్లు.. వన్డేల్లో 21 వికెట్లు, టీ20ల్లో10 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. 2013లో ముంబైలో వెస్టిండీస్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఓజా చివరిసారిగా భారత్ తరఫున ఆడాడు.

 సచిన్ వీడ్కోలు మ్యాచ్‌లో..

సచిన్ వీడ్కోలు మ్యాచ్‌లో..

టీమిండియా లెజండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ వీడ్కోలు మ్యాచే ఓజా చివరి అంతర్జాతీయ మ్యాచ్ కాగా.. ఈ మ్యాచ్‌లో ఈ హైదరాబాద్ స్పిన్నర్ 10 వికెట్లను ఖాతాలో వేసుకున్నాడు. సచిన్ కూడా ఈ విషయాన్ని గుర్తూ చేస్తూ ఇటీవలే వీడ్కోలు పలికిన ఓజాను అభినందించాడు. 'నీ మంచి మన్సస్సును, పనిలో నైపుణ్యాన్ని చూడటం ఎల్లప్పుడూ చాలా బాగుంటుంది. 2013లో నా వీడ్కోలు టెస్టులో ప‌ది వికెట్లు తీసి ఆ మ్యాచ్‌ను మ‌ధురంగా మలిచావు. నీ రెండో ఇన్నింగ్స్ సాఫీగా సాగాలి మిత్రమా' అని సచిన్ ట్వీట్ చేసాడు.

Story first published: Wednesday, February 26, 2020, 14:33 [IST]
Other articles published on Feb 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X