Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

చహల్, రోహిత్ కోతి వేశాలు.. ఒక తన్ను తన్నిన ఖలీల్ (వైరల్ వీడియో)

Yuzvendra Chahal Shares his new TikTok video with Rohit Sharma and Khaleel Ahmed
Yuzvendra Chahal Recreates Famous Scene With Rohit Sharma & Khaleel Ahmed | Oneindia Telugu

హైదరాబాద్: టిక్ టాక్.. ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న షార్ట్ వీడియో అప్లికేషన్. ముఖ్యంగా యువతరం పిచ్చ పిచ్చగా ఫోలో అవుతున్న మొబైల్ యాప్. ఎక్కడికి వెళ్లినా తమ స్మార్ట్ ఫోన్స్ లో ఈ యాప్ ద్వారా వీడియోలు చేయడం, వాటిని పోస్ట్ చేయడం సాధారణంగా మారిపోయింది. ఆ వీడియోలను ఎంత మంది చూశారు, ఎంత మంది లైక్ చేశారు, ఏం కామెంట్లు చేశారనే కుతూహలం కూడా బాగా పెరిగిపోయింది. ఈ పిచ్చి సాధారణ ప్రజలకే కాకుండా క్రికెటర్లకు ఎక్కింది. ముఖ్యంగా టీమిండియా లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ టిక్ టాక్ పిచ్చి మాత్రం పీక్స్‌కు వెళ్లింది.

 ఆ ఆటగాడెవరూ?

ఆ ఆటగాడెవరూ?

ఈ మధ్య న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా సహచర ఆటగాళ్లతో చేసిన ఓ టిక్ టాక్ వీడియో తెగ వైరలైంది. ఆ వీడియోలో చాహల్, శ్రేయాస్ అయ్యర్ వెనుక టోఫీ పెట్టుకుని డ్యాన్స్ వేసిన ఆటగాడు ఎవరో చెప్పాలంటూ నెటిజన్లు ప్రశ్నించారు. ఇక తాజాగా సహచర ఆటగాళ్లైన టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, యువ పేసర్ ఖలీల్ అహ్మద్ చేసిన ఓ టిక్ టాక్ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

విహార యాత్రలతో ఫుల్ ఎంజాయ్..

విహార యాత్రలతో ఫుల్ ఎంజాయ్..

టెస్ట్ సిరీస్ జట్టులో లేని చాహల్.. వన్డే సిరీస్ ముగిసిన అనంతరం స్వదేశానికి వచ్చాడు. ఈ ఖాళీ సమయాన్ని తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో గడుపుతున్నాడు. విహార యాత్రలతో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. మాములుగా మైదానంలోనే చాహల్ టీవీ అంటూ హడావుడి చేసే ఈ హర్యానా స్పిన్నర్.. ఇక విశ్రాంతి సమయంలో.. అది తన క్లోజ్ ఫ్రెండ్ అయిన రోహిత్ కలిస్తే ఊరుకుంటాడా? రచ్చ రచ్చ చేశాడు.

సీన్ రీ క్రేయట్ చేస్తూ..

సీన్ రీ క్రేయట్ చేస్తూ..

ఓ బాలీవుడ్ సినిమా సీన్ రీ క్రేయేట్ చేస్తూ టిక్ టాక్ వీడియో చేశాడు. ఇందులో చాహల్ తన జాకెట్‌ను తికమక వేసుకొని కింద పడుకోగా.. రోహిత్, ఖలీల్ అతని ఫ్రెండ్స్‌లా యాక్ట్ చేశారు. కానీ ఆ సీన్ క్రియేట్ చేయడంలో విఫలమైన ఈ స్టార్ క్రికెటర్లు.. కావాల్సిన ఫన్ మాత్రం క్రియేట్ చేశారు. చాహల్ అయితే తన కోతి వేశాలతో కళ్లు తెరిచి సీన్‌ను చెడగొట్టాడు. దీంతో ఖలీల్ ఈ లెగ్ స్పిన్నర్‌ను ఒక తన్ను తన్నాడు. ఈ వీడియోను చహలే ‘వీ ఆర్ బ్యాక్' అనే క్యాప్షన్‌తో ట్వీట్ చేయగా.. నెట్టింట వైరల్ అయింది.

 సూపర్ పెర్ఫామెన్స్..

సూపర్ పెర్ఫామెన్స్..

వన్డే సిరీస్‌లో రెండు వన్డేలు ఆడిన చాహల్ 3/58, 3/47‌తో మొత్తం 6 వికెట్లతో అద్భుత ప్రదర్శన కనబర్చాడు. కానీ అతని అద్భుత ఆటతీరు భారత్ ఓటమిని అడ్డుకోలేకపోయింది. ఇతర ఆటగాళ్లు విఫలమవడంతో భారత్ మూడు వన్డేల సిరీస్‌ను 0-3తో క్లీన్‌స్వీప్ అయింది.

ఇక రోహిత్ శర్మ ఇదే న్యూజిలాండ్ టూర్‌లో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో కాలి పిక్క గాయంతో వన్డే, టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక యువ పేసర్ ఖలీల్ అహ్మద్ చివరిసారిగా నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో ఆడాడు. న్యూజిలాండ్ పర్యటనలో భారత్-ఎ తరఫున బరిలోకి దిగాడు.

Story first published: Wednesday, February 26, 2020, 16:32 [IST]
Other articles published on Feb 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+