న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆసియాకప్‌తో మెరుగైన ర్యాంకులు సాధించిన రోహిత్.. ధావన్‌లు

Asia Cup 2018 : Rohit Sharma And Shikhar Dhawan Ascend In ICC ODI Rankings
 Post Asia Cup Triumph, Rohit Sharma And Shikhar Dhawan Ascend In ICC ODI Rankings

న్యూ ఢిల్లీ: రోహిత్‌ శర్మ నేతృత్వంలో టీమిండియా ఆసియా కప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. బంగ్లాతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో 3 వికెట్ల తేడాతో విజయం సాధించి ఏడోసారి కప్‌ను ముద్దాడింది. మరి కొద్ది రోజుల్లో వెస్టిండీస్‌తో మొదలుకానున్న టోర్నీతో టీమిండియా క్రికెట్ అభిమానులకు కనువిందు చేయనుంది. అయితే ఈ విజయం అనంతరం రోహిత్‌ శర్మ, ధావన్ల ర్యాంకింగ్స్‌ కూడా మెరుగయ్యాయి.

<strong>రోహిత్.. లేకుండా జట్టును ప్రకటించడమా: గంగూలీ</strong>రోహిత్.. లేకుండా జట్టును ప్రకటించడమా: గంగూలీ

రెండు స్థానాలు ఎగబాకిన రోహిత్‌ శర్మ

రెండు స్థానాలు ఎగబాకిన రోహిత్‌ శర్మ

తాజాగా వెల్లడించిన ఐసీసీ వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు ఎగబాకి రోహిత్‌ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. ఆసియా కప్‌లో ఐదు ఇన్నింగ్స్‌ల్లో రోహిత్‌ ఒక శతకం, రెండు హాఫ్ సెంచరీలతో రాణించి మొత్తం 317 పరుగులు సాధించాడు. దీంతో 842 పాయింట్లతో రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. ఇక ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్‌, రికార్డుల రారాజు కోహ్లీ 884 పాయింట్లతో తొలిస్థానంలో కొనసాగుతున్నాడు.

 ధావన్‌ కూడా నాలుగు స్థానాలు ఎగబాకి

ధావన్‌ కూడా నాలుగు స్థానాలు ఎగబాకి

ఇక ఆసియా కప్‌లో రెండు సెంచరీలతో మొత్తం 342 పరుగులు సాధించిన మరో ఓపెనర్‌ ధావన్‌ కూడా నాలుగు స్థానాలు ఎగబాకి ఈ జాబితాలో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు. ఆసియాకప్‌లో అద్భుతంగా రాణించి ముఖ్యంగా డెత్‌ ఓవర్లలో బ్యాట్స్‌మెన్లకు చుక్కలు చూపించిన బుమ్రా ఐసీసీ వన్డే బౌలర్ల ర్యాంకింగ్స్‌లో తొలిస్థానంలో కొనసాగుతున్నాడు. అతని అనంతరం అఫ్గాన్‌ ఆల్‌రౌండర్‌ రషీద్‌ ఖాన్‌ ఉన్నాడు.

కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి

కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి

ఆసియా కప్ టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేసినప్పటికీ బీసీసీఐ సెలక్షన్ కమిటీ వెనువెంటనే జరగనున్న వెస్టిండీస్‌తో మ్యాచ్‌లకు టీమిండియాలో కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి యువ క్రికెటర్లకు అవకాశమిచ్చింది బీసీసీఐ..

వెస్టిండీస్‌తో తలపడే భారత జట్టు:

వెస్టిండీస్‌తో తలపడే భారత జట్టు:

విరాట్‌ కోహ్లి (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, మయాంక్‌ అగర్వాల్‌, పృథ్వీ షా, ఛతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, రిషబ్‌ పంత్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, ఉమేశ్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, శార్దూల్‌ ఠాకూర్‌

Story first published: Sunday, September 30, 2018, 15:07 [IST]
Other articles published on Sep 30, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X