మందాన హాఫ్ సెంచరీ: ఉత్కంఠ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై భారత్ విజయం

Posted By:
Poonam Yadav and Ekta Bisht help India clinch thriller

హైదరాబాద్: సొంతగడ్డపై వరుస వైఫల్యాల తర్వాత భారత మహిళల జట్టు ఓ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో మిథాలీ రాజ్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు ఒక వికెట్ తేడాతో విజయం సాధించింది. మూడు వన్డేల సిరిస్‌లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా తొలి వన్డే శనివారం ప్రారంభమైంది.

ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 208 పరుగుల విజయ లక్ష్యాన్ని మిథాలీ సేన 49.1 ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ మధ్య కాలంలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న స్మృతి మంధాన(86: 109 బంతుల్లో 5ఫోర్లు, 4సిక్సర్లు) ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ నమోదు చేసిన జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది.

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కెప్టెన్ మిథాలీ రాజ్ ఈ మ్యాచ్‌లో రాజ్ డకౌట్‌గా వెనుదిరిగి నిరాశపరిచింది. 41 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను స్మృతి మందాన తన అద్భుత బ్యాటింగ్‌తో ఆదుకుంది. మిడిలార్డర్‌లో మందానకు తోడుగా హర్మన్‌ప్రీత్ కౌర్(21), దీప్తి శర్మ(24) పరుగులతో రాణించారు.

మిగతా బ్యాట్స్ ఉమెన్ అంతా తక్కువ స్కోర్లకే పెవిలియన్‌కు చేరారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.3 ఓవర్లలో 207 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టులో డానియల్లీ వ్యాట్‌(27), బీమౌంట్‌(37), నటాలీ స్కీవర్‌(21), డానియెల్లీ హజెల్‌(33) ఫరవాలేదనిపించారు.

తొలి వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌ఉమెన్ ఆ తర్వాత పదిహేను పరుగుల వ్యవధిలో మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రాన్‌ విల్సన్‌ (45) పరుగులతో జట్టుని ఆదుకుంది. ఇంగ్లాండ్ జట్టులో ఫ్రాన్ విల్సన్ 45 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది.

చివర్లో తొమ్మిదో హజెల్‌(33) రాణించడంతో ఇంగ్లాండ్ రెండొందల పరుగుల మార్కుని దాటింది. భారత బౌలర్లలో పూనమ్‌ యాదవ్‌ నాలుగు వికెట్లు, ఏక్తా బిస్త్‌ మూడు వికెట్లు తీయగా.... దీప్తి శర్మకు రెండు వికెట్లు, జులన్‌ గోస్వామికి ఒక వికెట్ లభించింది.

రికెట్ అంటే ఇష్టమా? నిరూపించు! మైఖేల్ ఫాంటసీ క్రికెట్ ఆడు

Story first published: Friday, April 6, 2018, 17:39 [IST]
Other articles published on Apr 6, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి