న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IND vs NZ 1st T20: భారత్, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్‎పై నీలినీడలు.. కారణం అదే!!

Pollution Threat on India vs New Zealand 1st T20 in Jaipur
IND vs NZ 1st T20 In Trouble క్రికెట్ మ్యాచులపై కన్నేసిన కాలుష్యం || Oneindia Telugu

ముంబై: మెగా టోర్నీ టీ20 ప్రపంచకప్‌ 2021 ముగిసింది. దుబాయ్‌ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆదివారం (నవంబర్ 14) జరిగిన ఫైనల్లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తుచేసింది. మెగా టోర్నీ నుంచి భారత్ లీగ్ దశ నుంచే నిష్క్రమించిన విషయం తెలిసిందే. ఇక న్యూజిలాండ్‌తో భారత్ ద్వైపాక్షిక సిరీసులో తలపడనుంది. భారత పర్యటనలో కివీస్ మూడు టీ20ల సిరీస్, రెండు టెస్టుల సిరీస్ ఆడనుంది. నవంబర్ 17న ఇరు జట్ల మధ్య పొట్టి సిరీస్ ఆరంభం కానుంది. అయితే జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో జరిగే టీ20 మ్యాచ్‎పై అనుమానాలు నెలకొన్నాయి.

తొలి టీ20 మ్యాచ్‎పై నీలినీడలు:

తొలి టీ20 మ్యాచ్‎పై నీలినీడలు:

ప్రస్తుతం తొలి టీ20 జరిగే జైపూర్ గాలిలో కాలుష్యం స్థాయి బాగా పెరిగినట్లు తెలుస్తుంది. జైపూర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రకారం గత వారం నుంచి జైపూర్‎లో కాలుష్యం స్థాయి పెరిగింది. ఆదివారం జైపూర్‌లో గాలి అత్యంత దారుణంగా ఉందని, పొగ మంచు బాగా ఉందని నివేదిక పేర్కొంది. గాలి ఏక్యూఐ 337 వద్ద నమోదైంది. దీపావళి తర్వాత ఈ స్థాయిలో ఏక్యూఐ నమోదవడం ఇది రెండోసారి. దీపావళి రోజున జైపూర్ ఎయిర్ ఏక్యూఐ 364గా ఉంది. తొలి టీ20 జరిగే సమయానికి కూడా ఎయిర్ ఏక్యూఐ ఇంచుమించు స్థాయిలో ఉంటుందని సమాచారం. దాంతో టీ20 మ్యాచ్‎పై నీలినీడలు కమ్ముకున్నాయి. మ్యాచ్ జరిగేది లేనిది ఆరోజు తేలనుంది.

ఈరోజు జైపూర్‌కు కివీస్:

ఈరోజు జైపూర్‌కు కివీస్:

తొలి టీ20 కోసం భారత్ ఇప్పటికే జైపూర్ చేరుకోగా.. ఈరోజు న్యూజిలాండ్‌ కూడా రానుంది. టీ20 ప్రపంచకప్‌ 2021లో న్యూజిలాండ్ ఫైనల్‌ మ్యాచ్ ఆడడం వల్ల జైపూర్ చేరుకోవడం ఆలస్యమైంది. జైపూర్‎కు చేరుకున్న కివీస్ జట్టుకు ఒక్కరోజు అంటే (నవంబర్ 16) ప్రాక్టీస్ సమయం ఉంటుంది. ఇప్పటివరకు యూఏఈలో టీ20లు ఆడిన కివీస్ జట్టుకు లేకున్నా.. పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక జైపూర్‌లో 8 ఏళ్ల తర్వాత మ్యాచ్ జరగబోతుంది. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో భారత్‌కి ఇది తొలి టీ20. గతంలో భారత్ 13 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 12 వన్డేలు, 1 టెస్ట్ ఉంది. 12 వన్డేల్లో భారత్ 8 గెలిచింది. కాగా ఇక్కడ ఆడిన ఏకైక టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది.

తొలి డోసు తీసుకున్నవారినే:

తొలి డోసు తీసుకున్నవారినే:

తొలి టీ20 నేపథ్యంలో రాజస్థాన్ క్రికెట్ అసోసియేషన్ కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. కనీసం కరోనా టీకా తొలి డోసు తీసుకున్నవారినే జైపూర్ మైదానంలోకి అనుమతించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంతో సమావేశమై కీలక నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర క్రికెట్ నిర్వహణ కమిటీ తెలిపింది. దాదాపు 8 ఏళ్ల తర్వాత జైపుర్ మైదానంలో అంతర్జాతీయ మ్యాచ్ జరగనుంది. టిక్కెట్టు ధర రూ. 1000 నుంచి రూ. 15,000 వరకు ఉండనుంది.

బబుల్‌లో ప్లేయర్స్:

బబుల్‌లో ప్లేయర్స్:

భారత పర్యటనలో న్యూజిలాండ్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. నవంబర్ 17న జైపూర్‌లో తొలి టీ20, నవంబర్ 19న రాంచీలో రెండో టీ20 జరగనుంది. ఇక మూడో టీ20 కోల్‌కత్తాలో జరగనుంది. టీ20 సిరీస్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ 2 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను కూడా ఆడనుంది. తొలి టెస్టు నవంబర్ 25 నుంచి కాన్పూర్‌లో జరగనుండగా,.. రెండో టెస్టు డిసెంబర్ 3 నుంచి ముంబైలో జరగనుంది. ఈ సిరీస్ కూడా కరోనా మహమ్మారి నేపథ్యంలో బయో బబుల్‌లో జరుగుతుంది. టీ20 ప్రపంచకప్‌ 2021 బబుల్ నుంచే ఇరు జట్లు జైపూర్

పొట్టి సిరీసు కోసం ఏర్పాటు చేసిన బబుల్‌లో ఉండనున్నాయి.

Story first published: Monday, November 15, 2021, 15:52 [IST]
Other articles published on Nov 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X