న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

శ్రీకాంత్‌కు ప్రశంసల వెల్లువ: ప్రధాని మోడీతో సహా ఎవరేమన్నారు?

By Nageshwara Rao

హైదరాబాద్: ఒలింపిక్ ఛాంపియన్ చెన్‌లాంగ్‌ని ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో భారత జాతీయ జెండాను రెపరెపలాడించిన భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లో భారత స్టార్‌ షట్లర్‌, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే.

<strong>కిదాంబి శ్రీకాంత్‌కు బాయ్‌ రూ.5 లక్షలు: ఆనంద్‌ మహీంద్ర ఏమన్నాడో తెలుసా?</strong>కిదాంబి శ్రీకాంత్‌కు బాయ్‌ రూ.5 లక్షలు: ఆనంద్‌ మహీంద్ర ఏమన్నాడో తెలుసా?

ఆదివారం జరిగిన ఫైనల్లో ప్రపంచ 11వ ర్యాంకర్‌ శ్రీకాంత్‌ 22-20, 21-16తో వరుస గేముల్లో ఒలింపిక్‌ చాంపియన్‌ చెన్‌లాంగ్‌పై విజయం సాధించాడు. ఇటీవలే ఇండోనేషియా సూపర్‌ సిరీస్‌ ప్రిమియర్‌ గెలిచిన అతడికిది వరుసగా రెండో టైటిల్‌ కావడం విశేషం. 46 నిమిషాల ఏకపక్ష పోరులో ఆరో ర్యాంకర్‌ చెన్‌లాంగ్‌ భారత షట్లర్‌కు ఏమాత్రం గట్టి పోటీ ఇవ్వలేకపోయాడు.

గతంలో తలపడిన ఐదుసార్లూ శ్రీకాంత్‌ను ఓడించిన చెన్‌లాంగ్‌.. ఈసారి మాత్రం భారత షట్లర్‌ ఎటాకింగ్‌ గేమ్‌ ముందు తలొంచాడు. ఇదిలా ఉంటే మొత్తంగా శ్రీకాంత్‌కు కెరీర్‌లో ఇది నాలుగో సూపర్‌ సిరీస్‌ టైటిల్‌ కావడం విశేషం. అలాగే వరుసగా మూడు సూపర్‌ సిరీస్‌ (సింగపూర్‌, ఇండోనేసియా, ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌) ఫైనల్స్‌ ఆడిన ఐదో క్రీడాకారుడిగా కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు.

<strong>అస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ కైవసం చేసుకొన్న తెలుగుతేజం శ్రీకాంత్</strong>అస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ సిరీస్ కైవసం చేసుకొన్న తెలుగుతేజం శ్రీకాంత్

ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచిన కిదాంబి శ్రీకాంత్‌ను ప్రధాని మోడీతో సహా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు అభినందించారు.

ప్రధాని మోడీ

నీ ఘనతను చూసి మేమంతా గర్వపడుతున్నాం. మరో అద్భుతమైన విజయాన్ని సాధించిన నీకు అభినందనలు.

కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్

వరుసగా రెండో టైటిల్ సాధించావ్. అది కూడా ఒలింపిక్ చాంపియన్‌ను ఓడించి ఆస్ట్రేలియా ఓపెన్ విజేతగా నిలిచిన నీకు అభినందనలు.

ఏపీ సీఎం చంద్రబాబు

‘వరుసగా రెండో సూపర్‌ సిరీస్‌ నెగ్గిన కిడాంబికి హృ దయపూర్వక శుభాకాంక్షలు. శ్రీకాంత్‌ విజయం దేశానికే గర్వకారణమని, అతను ఇలాంటి విజయాలు మరెన్నో సాధించి దేశ ఖ్యాతిని ఇనుమడింపచేయాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్

వరుసగా రెండో సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన శ్రీకాంత్‌కు మనస్ఫూర్తిగా అభినందనలు చెబుతున్నాను. చాంపియన్.. నీవు మాకు గర్వకారణం.

రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్

ఆస్ట్రేలియా ఓపెన్ సూపర్ సిరీస్ నెగ్గిన శ్రీకాంత్‌కు అభినందనలు. పుల్లెల గోపీచంద్‌కు హ్యాట్సాఫ్.

మాజీ క్రికెటర్‌ సెహ్వాగ్‌

ఒలింపిక్‌, వరల్డ్‌ చాంపియన్‌ చెన్‌ లాంగ్‌ను ఓడించి.. నాలుగో సూపర్‌ సిరీస్‌ నెగ్గినందుకు అభినందనలు

టెన్నిస్ స్టార్ సానియా మిర్జా

శ్రీకాంత్‌ ఫైర్‌లో ఉన్నాడు. అది నాకు ఇష్టం. అతనికి మరోసారి శుభాకాంక్షలు. ఇదో జోరుని కొనసాగించు.

Story first published: Tuesday, November 14, 2017, 10:02 [IST]
Other articles published on Nov 14, 2017
Read in English: PM Modi applauds Srikanth
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X