న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ఈ బాల్ వంద ఓవర్లు ఆడినా చెక్కు చెదరదు'

Playing 100 overs also that ball hasnt changed

హైదరాబాద్: రోజురోజుకూ సాంకేతిక పెరుగుతూ ప్రత్యేకతను చాటుకుంటోంది. ఈ నేపథ్యంలో సరికొత్త బాల్‌ను రూపొందించింది ఢిల్లీ బృందం. దీని కోసం మూడు సంవత్సరాలపాటు కష్టపడ్డామని బాల్ తయారీదారు, సీనియర్ కోచ్ రాజేశ్ తెలిపారు.

చిన్నారి సంప్రీతి కీమోథెరపీ సాయం కోసం ఓ వెయిటర్ తండ్రి ఆవేదన

క్రికెట్ బంతి టెస్టుల్లోనైతే 80 ఓవర్లపాటు మన్నుతుంది. అదే వన్డేల్లోనైతే 50 ఓవర్లకు ఓసారి మారుస్తారు. కానీ నిరంతరాయంగా 100 ఓవర్ల కంటే ఎక్కువగా బౌలింగ్ చేయగలిగే సరికొత్త బంతిని ఢిల్లీకి చెందిన ఆర్కిటెక్ట్ అనిరుద్ చతుర్వేది తయారు చేశారు. తర్వాత కూడా ఈ బంతిని ప్రాక్టీస్ సెషన్లో వాడుకోవచ్చని చెప్పుకొస్తున్నారు.

ఏకంగా 300 ఓవర్లపాటు ఆడినా:
300 ఓవర్లపాటు ఈ బంతితో ఆడినా.. దాని లోపలి భాగం చెక్కుచెదరని చెబుతున్నారు. అనురాగ్ సింగ్, క్రికెట్ కోచ్ రాకేశ్ రాయ్‌లతో కలిసి మూడేళ్ల పరిశోధించి ఈ బంతిని తయారు చేశామని అనిరుద్ చెప్పారు. ఈ బంతికి 100 ఓవర్స్ బై ఏజే అండ్ యాసిడ్ అని పేరుపెట్టారు. ఈ సరికొత్త బంతిని అనురాగ్ సింగ్‌కు చెందిన ఏజే క్రికెట్ బాల్స్ కంపెనీ ఉత్పత్తి చేయనుంది.

సెహ్వాగ్ కోసం బ్యాట్‌ను రూపొందించినవారే:
ఈ సంస్థ గతంలో వీరేంద్ర సెహ్వాగ్‌ కోసం ప్రత్యేకంగా బ్యాట్‌ను రూపొందించింది. సరికొత్త బంతిని రూ.850 చొప్పున విక్రయిస్తామని చెప్పింది. ఈ బంతిని రబ్బర్, కార్క్, లెదర్‌‌ను ప్రత్యేకంగా ప్రాసెస్ చేసి చక్కటి నాణ్యతతో రూపొందించారు. ఈ నెలాఖరు నుంచి ఈ బంతిని దేశ విదేశాల్లోని క్రికెట్ అకాడమీలకు అందించనున్నారు. దీని తయారీ కోసం టైలర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.

Story first published: Thursday, March 22, 2018, 12:43 [IST]
Other articles published on Mar 22, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X