న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

INDvsNZ: అతన్ని ఆడించండి.. లేదంటే తిట్టించుకోవడానికి రెడీగా ఉండండి..!

Play Sanju Samson or get ready to be criticized says former team india player

కివీస్‌పై తప్పక గెలవాల్సిన మూడో వన్డే కోసం భారత జట్టు సిద్ధం అవుతోంది. క్రీస్ట్ చర్చ్‌లో ఇప్పటికే భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. అయితే మూడో వన్డేలో అయినా సంజూ శాంసన్‌కు చోటు దక్కుతుందా? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. తొలి వన్డేలో సంజూ ఫర్వాలేదనిపించాడు. కానీ మరో బౌలింగ్ ఆప్షన్ కావాలంటూ రెండో మ్యాచ్‌లో అతన్ని ధవన్ పక్కన పెట్టేశాడు. సంజూ స్థానంలో దీపక్ హుడాను తీసుకున్నాడు.

 వీళ్లకు ఛాన్స్ ఇవ్వండి..

వీళ్లకు ఛాన్స్ ఇవ్వండి..

చెత్తగా ఆడుతున్న రిషభ్ పంత్ వంటి వారికి అవకాశం ఇస్తూ.. నిలకడగా రాణిస్తున్న సంజూ శాంసన్‌ను బెంచ్‌కే పరిమితం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ ఆకాష్ చోప్రా కూడా ఈ విషయంపై స్పందించాడు. 'మూడో వన్డేలో సంజూ శాంసన్‌ను ఆడించడానికి ప్రయత్నించండి. దీపక్ హుడా కూడా ఆడాలి. కుల్దీప్‌ యాదవ్‌కు కూడా ఒక్క మ్యాచ్ ఇవ్వండి, ఉమ్రాన్‌ను కొనసాగించండి. సంజూను ఆడించకపోతే మాత్రం చాలా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాటికి సిద్ధపడితేనే అతన్ని పక్కన కూర్చోపెట్టండి' అని తేల్చిచెప్పాడు.

ఎవరిని తీసేయాలి..?

ఎవరిని తీసేయాలి..?

వన్డేల్లో 60పైగా సగటుతో బ్యాటింగ్ చేస్తున్న సంజూ శాంసన్‌ను కాదని, వచ్చిన ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోని పంత్‌ను ఎలా ఆడిస్తారని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇదే చెప్పిన చోప్రా.. 'కానీ సంజూను ఆడిస్తే దీపక్ హుడాను ఎలా ఆడిస్తారు? అతన్ని కూడా ఆడిస్తే పంత్‌ను ఆడించలేం. అలాంటప్పుడు ఏం చేస్తారు? సూర్యకుమార్ యాదవ్‌ను తర్వాతి సిరీస్‌లో ఆడించడం లేదు. కాబట్టి అతన్ని ఇప్పుడు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. వీటన్నింటికీ మించి ఇదేం డెడ్ రబ్బర్ మ్యాచ్ కాదు. చాలా ముఖ్యమైన మ్యాచ్' అని చెప్పాడు.

పరోక్షంగా పంత్‌పై కామెంట్స్?

పరోక్షంగా పంత్‌పై కామెంట్స్?

దీంతో అతను పరోక్షంగా పంత్‌ను పక్కన పెట్టాలని అంటున్నాడని ఫ్యాన్స్ అంటున్నారు. టెస్టుల్లో అద్భుతమైన రికార్డులు ఉన్న పంత్.. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం ఇప్పటి వరకు తన సత్తా నిరూపించుకోలేకపోయాడు. అందుకే జట్టులో అతని స్థానాన్ని చాలా మంది ప్రశ్నిస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాపార్డర్‌లో గిల్, ధవన్ బాగా ఆడుతున్నారని చోప్రా చెప్పాడు. వీళ్లిద్దరూ ఇదే ఫామ్ కొనసాగించాలని ఆశించాడు. ధవన్ నుంచి చాలా ఆశిస్తున్నారని, అతను చక్కగా ఆడితే అంతకుమించి కావలసింది ఏమీ లేదని స్పష్టం చేశాడు. మరి క్రీస్ట్‌చర్చ వేదికగా జరిగే మూడో వన్డేలో సంజూకు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి.

Story first published: Tuesday, November 29, 2022, 17:52 [IST]
Other articles published on Nov 29, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X