న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బౌండరీలు బాదాలనే ప్రణాళికతో బరిలోకి దిగాం: తొలి టీ20లో హాఫ్ సెంచరీపై కేఎల్ రాహుల్

Plans were clear that you have to hit boundaries: KL Rahul after India win Hyderabad T20I

హైదరాబాద్: హైదరాబాద్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన తొలి టీ20లో బౌండరీలు బాదాలనే ప్రణాళికతో బరిలోకి దిగామని టీమిండియా బ్యాట్స్‌మన్‌ కేఎల్ రాహుల్‌ అన్నాడు. ఈ మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ 40 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సుల సాయంతో 62 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.

మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ "చాలా రోజుల తర్వాత టాపార్డర్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశం లభించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. తొలి టీ20లో రాణించాను. రెండో మ్యాచ్‌లో కూడా ఇలానే ఆడాలని భావిస్తున్నాను. వచ్చే ఏడాది అక్టోబర్‌ గురించి ఆలోచించట్లేదు" అని అన్నాడు.

రూ. 26 లక్షలు పలికిన ఫుట్‌బాల్‌ లెజెండ్‌ పీలే 'జెర్సీ'రూ. 26 లక్షలు పలికిన ఫుట్‌బాల్‌ లెజెండ్‌ పీలే 'జెర్సీ'

వరల్డ్‌కప్‌కు ఇంకా సమయం ఉంది

వరల్డ్‌కప్‌కు ఇంకా సమయం ఉంది

"వరల్డ్‌కప్‌కు ఇంకా సమయం ఉంది. దానికి ముందు చాలా మ్యాచులు ఆడాల్సి ఉంది. ఇక్కడ వికెట్‌ బ్యాటింగ్‌కు అంత అనుకూలంగా లేదు. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగినప్పుడు ఎదురుదాడికి దిగుతూ బ్యాటింగ్‌ చేయాలి. గెలవాలంటే పది రన్‌రేటుతో పరుగులు చేయాల్సి ఉంటుంది" అని కేఎల్ రాహుల్ చెప్పుకొచ్చాడు.

భారీ లక్ష్యం ముందుండటంతో

భారీ లక్ష్యం ముందుండటంతో

"భారీ లక్ష్యం ముందుండటంతో బౌండరీలు బాదాలనే ప్రణాళికతో బరిలోకి దిగాం. విరాట్ కోహ్లీ అద్భుతంగా పోరాడి జట్టును విజయ తీరాలకు చేర్చాడు" అని కేఎల్ రాహుల్‌ అన్నాడు. కాగా, తొలి టీ20లో కోహ్లీతో కలిసి కేఎల్ రాహుల్ రెండో వికెట్‌కు సెంచరీకి పైగా భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు.

కేఎల్ రాహుల్ అరుదైన ఘనత

కేఎల్ రాహుల్ అరుదైన ఘనత

అంతేకాదు ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 1000 పరుగులు సాధించిన భారత 7వ క్రికెటర్‌గా నిలిచాడు. టీ20ల్లో అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న మూడో క్రికెటర్‌గా కేఎల్ రాహుల్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. కేఎల్ రాహుల్ తన 29వ ఇన్నింగ్స్‌లో వెయ్యి పరుగుల క్లబ్‌లో చేరాడు.

ఆరోన్ ఫించ్ సరసన

ఆరోన్ ఫించ్ సరసన

ఈ క్రమంలో ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ సరసన కేఎల్ రాహుల్ నిలిచాడు. ఇదిలా ఉంటే, టీ20ల్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో పాకిస్థాన్ యువ ఆటగాడు బాబర్ అజామ్(26 ఇన్నింగ్స్‌లు) అగ్రస్థానంలో ఉండగా, కొహ్లీ(27 ఇన్నింగ్స్)లతో రెండో స్థానంలో ఉన్నాడు.

Story first published: Saturday, December 7, 2019, 18:47 [IST]
Other articles published on Dec 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X