న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేడు కోల్‌కతాతో చెన్నై సమరం.. రసెల్‌ను అడ్డుకోగలరా?

PL 2019: Match 23, CSK vs KKR Predicted Playing 11, Match Preview, Injury updates, Pitch report, Weather forecast & Head to Head Records - April 9th, 2019

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) సీజన్‌ -12లో భాగంగా ఈ రోజు రాత్రి చెన్నైలోని చిదంబరం మైదానం వేదికగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తలపడనుంది. ఈ రెండు జట్లు ఈ సీజన్‌లో ఆడిన ఐదు మ్యాచ్‌లలో నాలుగు విజయాలతో పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలను కైవసం చేసుకున్నాయి. అయితే కోల్‌కతాకు రన్ రేట్ ఎక్కువగా ఉండడంతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.

చెన్నై జట్టు ఒక్క ముంబైతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిని చవిచూసింది. అయితే ఇప్పటివరకు కోల్‌కతా అన్ని మ్యాచ్‌లలో సత్తా చాటింది. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌ టై కావడంతో.. సూపర్ ఓవర్ నిర్వహించగా కోల్‌కతా తొలిసారి ఓటమి రుచిని చూసింది. ఈ నేపథ్యంలో కోల్‌కతా ఫేవరేట్ గా బరిలోకి దిగుతోంది.

సమిష్టి ప్రదర్శన:

సమిష్టి ప్రదర్శన:

కేకేఆర్‌ ఈ సీజన్-12లో ఇప్పటివరకూ అత్యుత్తమ ఆటతో ప్రత్యర్థులను హడలెత్తిస్తోంది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో సత్తాచాటుతోంది. బ్యాటింగ్లో లిన్ , నరైన్, రాణా, కార్తీక్, రస్సెల్, ఊతప్పలు తలో మ్యాచ్‌లలో మెరిశారు. గత మ్యాచ్‌లో స్టార్ ఆటగాడు క్రిస్ లిన్ ఫామ్ అందుకోవడం కలిసొచ్చే అంశం. విధ్వంసక ఆటగాడు రస్సెల్ ఉండనేఉన్నాడు. ఇక బౌలింగ్లో ప్రసిద్ కృష్ణ , నరైన్, ఫెర్గుసన్, చావ్లాలు ప్రత్యర్థులను కట్టడి చేస్తున్నారు. దీంతో రెండు విభాగాల్లో కేకేఆర్‌ పటిష్టంగానే ఉంది.

 ఎంత మంచి బౌలర్ బంతిని వేసినా సునాయాసంగా సిక్సర్‌గా

ఎంత మంచి బౌలర్ బంతిని వేసినా సునాయాసంగా సిక్సర్‌గా

మలుస్తున్నాడు ఆల్‌రౌండర్‌ రసెల్‌. ఈ సీజన్‌లో బౌలర్లు ఎవరికి బయపడుతున్నారంటే కేవలం రసెల్‌కే.. అంతలా విధ్వంసం సృష్టిస్తున్నాడు మరి. ప్రత్యర్ధులు గెలుపుపై ధీమాగా ఉన్న మ్యాచ్‌లను సైతం తమ జట్టు వైపు తిప్పేస్తున్నాడు ఈ కరీబీయన్‌ ఆటగాడు. ఈడెన్‌లో సన్‌రైజర్స్‌పై 19 బంతుల్లో 49 పరుగులు, కింగ్స్‌ ఎలెవన్‌పై 17బంతుల్లో 48 పరుగులు చేసి.. ఓడిపోయే స్థితిలో ఉన్న కోల్‌కతాను విజయతీరాలకు చేర్చాడు. ఇప్పటి వరకూ ఆడిన 5 మ్యాచులలో 77 బంతులాడి 207 పరుగులు చేశాడు. 103.50 సగటు, 268.83 స్ట్రైక్‌రేట్‌ ఉంది. ఇప్పటికే 22 సిక్సర్లు, 12 ఫోర్లు బాదాడు. ఇంతలా విధ్వంసం సృష్టిస్తున్న ఇతన్ని చెన్నై బౌలర్లు ఏ మేరకు అడ్డుకుంటారో చూడాలి. రసెల్‌ను త్వరగా పెవిలియన్ చేర్చకుంటే చెన్నై భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే.

జాదవ్, ధోనీలపైనే భారం:

జాదవ్, ధోనీలపైనే భారం:

చెన్నై జట్టుకు ఓపెనర్లు ఆశించిన శుభారంభం అందించలేదు. వాట్సన్ అడపాదడపా రాణిస్తుండగా.. తెలుగుతేజం అంబటి రాయుడు విఫలమవుతున్నాడు. రైనా కూడా ఇప్పటివరకు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. రాయుడు, రైనాలు చెన్నైకి భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు. టాప్ ఆర్డర్ వైఫల్యంతో జాదవ్, ధోనీలపైనే బ్యాటింగ్ భారం పడుతోంది. కింగ్స్ లెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బ్రావోకి బదులుగా తుది జట్టులోకి కివీస్ ఆల్‌రౌండర్ స్కాట్ కుగెల్జిన్‌ వచ్చి సత్తా చాటాడు. డుప్లెసిస్ కూడా అర్ధ శతకంతో మెరిశాడు. దీంతో చెన్నై బ్యాటింగ్ బలంగానే ఉంది.

చహర్ అద్భుతం:

చహర్ అద్భుతం:

ఇక బౌలింగ్ లో దీపక్ చహర్ అద్భుతంగా రాణిస్తున్నాడు. సీజన్ మొదటి నుంచి తన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక శార్దూల్ ఠాకూర్, మోహిత్ కూడా శక్తికి మేర రాణించారు. స్పిన్ విభాగంలో మాత్రం చెన్నైకి తిరుగులేదు. తాహిర్, హర్భజన్, జడేజాలతో పటిష్టంగా ఉంది. అవసరం అయితే జాదవ్, రైనాలు వేసేందుకు సిద్ధంగా ఉన్నారు. తాహిర్, హర్భజన్లను కోల్‌కతా ఆటగాళ్లు ఎదురుకోగలరా? అనే సందేహం ఉంది. అయితే రసెల్‌ను మాత్రం త్వరగా పెవిలియన్ చేర్చితే విజయం చెన్నైకి సులువే.

జట్లు (అంచనా)

జట్లు (అంచనా)

కోల్‌కతా జట్టు:

క్రిస్ లిన్, సునీల్ నరైన్, రాబిన్ ఉతప్ప, శుభ్‌మన్ గిల్, నితీశ్ రాణా, దినేశ్ కార్తీక్ (కెప్టెన్), ఆండ్రూ రసెల్, పీయూష్ చావ్లా, కుల్దీప్ యాదవ్, లాకీ ఫెర్గ్యూసన్, ప్రసీద్ కృష్ణ.

చెన్నై జట్టు:

షేన్ వాట్సన్, డుప్లెసిస్, సురేశ్ రైనా, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, మహేంద్రసింగ్ ధోనీ, రవీంద్ర జడేజా, హర్భజన్ సింగ్, ఇమ్రాన్ తాహిర్, దీపక్ చాహర్, స్కాట్ కుగెల్జిన్‌.

Story first published: Tuesday, April 9, 2019, 16:57 [IST]
Other articles published on Apr 9, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X