న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పింక్ బాల్ టెస్ట్ స్పెషల్స్: అలనాటి మధుర క్షణాలను గుర్తు చేసుకున్న ‘ఆ నలుగురు’

India vs Bangladesh,Day-Night Test: Sachin,Laxman,Kumble And Harbhajan Shares Golden Memories
Pink Ball Test: Team India Legends Relive Glorious Eden Moments

హైదరాబాద్: చారిత్రాత్మక పింక్ బాల్ టెస్ట్‌లో దిగ్గజ ఆటగాళ్లంతా మళ్లీ ఒక్క చోట కలిశారు. ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా గతంలో చోటుచేసుకున్న మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు. భారత్‌-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య చారిత్రక డే నైట్‌ టెస్ట్‌ మ్యాచ్ సందర్భంగా దిగ్గజ క్రికెటర్లు సచిన్‌ టెండూల్కర్‌, అనిల్‌ కుంబ్లే, వీవీఎస్‌ లక్ష్మణ్‌, హర్భజన్‌సింగ్‌ ఈడెన్‌లో గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు.

1993లో వెస్టిండీస్‌పై హీరోకప్‌ ఫైనల్‌, 2001లో ఆస్ట్రేలియాతో టెస్టు మ్యాచ్‌ గురించి ముచ్చటించారు. ఈ రెండు కూడా భారత క్రికెట్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే మ్యాచ్‌లు. హీరోకప్‌ పైనల్లో అనిల్ కుంబ్లే 6 వికెట్లు తీసి 12 పరుగులిచ్చి టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక, 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ గురించి చెప్పాల్సిన పనిలేదు.

1
46120

తొలి డే నైట్ టెస్ట్: బంగ్లాదేశ్ 106 ఆలౌట్, 5 వికెట్లతో చరిత్ర సృష్టించిన ఇషాంత్ శర్మతొలి డే నైట్ టెస్ట్: బంగ్లాదేశ్ 106 ఆలౌట్, 5 వికెట్లతో చరిత్ర సృష్టించిన ఇషాంత్ శర్మ

ఈ టెస్టులో ఫాలోఆన్ ఆడిన టీమిండియా లక్ష్మణ్‌, ద్రావిడ్‌ల 376 పరుగులు భాగస్వామ్యం, హర్భజన్‌ హ్యాట్రిక్‌తోపాటు మ్యాచ్‌లో 13 వికెట్లు తీసి అద్భుత విజయాన్ని నమోదు చేసింది. భారత్‌-బంగ్లా పింక్ బాల్ టెస్ట్ సందర్భంగా తొలిరోజు లంచ్ విరామ సమయంలో ఈ చిరస్మరణీయ ఘట్టాలను అభిమానులతో పంచుకున్నారు.

అనిల్ కుంబ్లే

అనిల్ కుంబ్లే

అనిల్ కుంబ్లే మాట్లాడుతూ "రిటైరైన తర్వాత మేమంతా ఇలా కూర్చొని మాట్లాడుకొనే అవకాశం రాలేదు. అందుకే ఇది ఎంతో ప్రత్యేకమైన రోజు. చారిత్రక మ్యాచ్‌కు ఇంతకన్నా మంచి వేదిక మరొకటి ఉండదు" అని అన్నాడు.

సచిన్ టెండూల్కర్

సచిన్ టెండూల్కర్

2001లో ఆస్ట్రేలియాతో టెస్టులో హ్యాట్రిక్‌ సహా 13 వికెట్లు తీసిన భజ్జీని అభినందించారు. సచిన్ మాట్లాడుతూ "భజ్జీ హ్యాట్రిక్‌తో మ్యాచ్‌ స్వరూపమే మారిపోయింది. మేం ఆ మ్యాచ్‌ గెలిచిన విధానం భారత క్రికెట్‌ను సరికొత్త దశకు తీసుకెళ్లింది. భజ్జీ ఓ సంచలనం. రికీ పాంటింగ్‌ను చాలాసార్లు ఔట్‌ చేశాడు. లక్ష్మణ్‌, ద్రావిడ్‌ భాగస్వామ్యం డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని ఎన్నో రెట్లు పెంచింది" అని అన్నాడు.

హర్భజన్ సింగ్

హర్భజన్ సింగ్

భజ్జీ మాట్లాడుతూ "ఈరోజు ఇక్కడి వాతావరణం నన్ను 15 సంవత్సరాల వెనక్కు తీసుకుపోయింది. అప్పట్లో టెస్టు క్రికెట్‌ భిన్నంగా ఉండేది. ఈ అనుభూతి ఎంతో బాగుంది. ఈడెన్‌ గార్డెన్స్‌కు వచ్చిన ప్రతిసారి నేను సరికొత్త అనుభూతికి లోనవుతా. ఈ అవకాశం కల్పించిన గంగూలీకి హ్యాట్సాఫ్‌. 100 మంది కెప్టెన్ల ఆధ్వర్యంలో ఆడినా సౌరవే నా సారథి" అని పేర్కొన్నాడు.

వీవీఎస్‌ లక్ష్మణ్‌

వీవీఎస్‌ లక్ష్మణ్‌ మాట్లాడుతూ "పింక్‌ బాల్‌ టెస్ట్‌ ఈవెనింగ్‌ సెషన్‌లో పేసర్లు విజృంభిస్తారు. బంతి బాగా స్వింగవుతుంది. దాంతో కుదురుకునేందుకు బ్యాట్స్‌మెన్‌కు సమయం పడుతుంది" అని అన్నాడు. సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌ ఈ చర్చలో పాల్గొనాల్సి ఉన్నా అధికారిక కార్యక్రమాలతో తీరిక లేకుండా ఉండటం వల్ల కుదర్లేదు.

Story first published: Saturday, November 23, 2019, 9:13 [IST]
Other articles published on Nov 23, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X