న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కోహ్లీపై ‘స్లో బంతుల’ వ్యూహాం: అలవోకగా చేధించిన కెప్టెన్ (వీడియో)

India vs Australia 3rd T20 : Kohli And Krunal Shine As India Down Australia, Series Ends 1-1
PHOTOS: Krunal, Kohli shine as India down Australia; series ends 1-1

హైదరాబాద్: ఆతిథ్య ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరిస్‌ను టీమిండియా సమం చేసింది. సిడ్నీ వేదికగా ఆదివారం జరిగిన మూడో టీ20లో కెప్టెన్ విరాట్ కోహ్లీ ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ వ్యూహం బెడిసికొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది.

<strong>సిడ్నీ మైదానంలో కోచ్ లాంగర్ నేతృత్వంలో వార్నర్‌ నెట్ ప్రాక్టీస్‌ (వీడియో)</strong>సిడ్నీ మైదానంలో కోచ్ లాంగర్ నేతృత్వంలో వార్నర్‌ నెట్ ప్రాక్టీస్‌ (వీడియో)

అనంతరం చేధనకు దిగిన భారత బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ విరాట్ కోహ్లీ (61 నాటౌట్) హాఫ్ సెంచరీతో రాణించడంతో భారత్ జట్టు 19.4 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి 168 లక్ష్యాన్ని ఛేదించేసింది. దీంతో.. మూడు టీ20ల సిరీస్ 1-1తో సమం చేసింది. ఈ సిరిస్‌లో మెల్ బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20 వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే.

టీమిండియా విజయానికి 5 పరుగులు

టీమిండియా విజయానికి 5 పరుగులు

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌ ఆఖరి ఓవర్‌లో టీమిండియా విజయానికి 5 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలో క్రీజులో ఉన్న కెప్టెన్ విరాట్ కోహ్లీపై ‘స్లో బంతుల' వ్యూహాన్ని ఆస్ట్రేలియా ప్రయోగించింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లో దినేశ్ కార్తీక్, కృనాల్ పాండ్యాపై ఇదే వ్యూహాన్ని ప్రయోగించి ఆస్ట్రేలియా విజయం సాధించింది.

మూడో టీ20లో సైతం అవలభించినప్పటికీ

మూడో టీ20లో సైతం అవలభించినప్పటికీ

దీంతో ఇదే వ్యూహాన్ని మూడో టీ20లో సైతం అవలభించినప్పటికీ క్రీజులో కెప్టెన్ కోహ్లీ ఉండటంతో విఫలమైంది. ఆఖరి ఓవర్‌లో భారత్ విజయానికి 5 పరుగులు అవసరం కావడంతో ఐపీఎల్‌లో డెత్ ఓవర్ల స్పెషలిస్ట్‌గా పేరొందిన ఆండ్రూ టై‌ని చివరి ఓవర్‌‌‌లో బౌలింగ్‌ కోసం ఆస్ట్రేలియా రంగంలోకి దింపింది. స్లో బంతులు వేయాల్సిందిగా టైకి ఆరోన్ ఫించ్ సూచించాడు.

వ్యూహంలో భాగంగా తొలి బంతిని

వ్యూహంలో భాగంగా తొలి బంతిని

అదే సమయంలో బౌండరీ లైన్స్ వద్ద ఫీల్డింగ్‌ను సైతం సెట్ చేశాడు. వ్యూహంలో భాగంగా తొలి బంతిని ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా ఆండ్రూ టై స్లో డెలివరీ రూపంలో విసిరాడు. దీంతో దానిని హిట్ చేయడంలో కోహ్లీ విఫలమయ్యాడు. ఇక రెండో బంతి.. బౌన్సర్ రూపంలో వైడ్‌లైన్‌పై సంధించాడు. ఇది కూడా స్లో డెలివరీనే కావడం విశేషం.

వైడ్‌గా ఇవ్వని అంఫైర్

వైడ్‌గా ఇవ్వని అంఫైర్

దీంతో కోహ్లీ కలగజేసుకుని వైడ్ అని చెప్పినప్పటికీ అంపైర్ దానిని వైడ్‌గా ఇవ్వలేదు. దీంతో రెండు బంతులు వరుసగా డాట్ అవడంతో సమీకరణం 4 బంతుల్లో 5 పరుగులుగా మారిపోయింది. ఇక మూడో బంతి కూడా స్లో డెలివరీ రూపంలో ఆఫ్ స్టంప్‌కి వెలుపలగా వస్తుందని పసిగట్టిన విరాట్ కోహ్లీ అందుకు తగినట్లుగా క్రీజులో కదులుతూ బౌలర్ తలమీదుగా ఫోర్ బాదాడు.

3 బంతుల్లో ఒక పరుగుగా మారిపోయిన సమీకరణం

దీంతో సమీకరణం 3 బంతుల్లో ఒక పరుగుగా మారిపోయింది. ఆ తర్వాత సింగిల్‌ని నిలువరించేందుకు లాంగాన్‌లోని ఫీల్డర్లను 30 అడుగుల వృత్తంలోకి కెప్టెన్‌ తీసుకురాగా, నాలుగో బంతిని మిడ్ వికెట్ దిశగా హిట్ చేసిన విరాట్ కోహ్లీ భారత్‌కు విజయాన్ని అందించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Story first published: Monday, November 26, 2018, 12:53 [IST]
Other articles published on Nov 26, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X