న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వెస్టిండీస్‌ హెడ్ కోచ్‌గా ఫిల్‌ సిమన్స్‌.. నాలుగేళ్ల కాలానికి ఒప్పందం!!

Phil Simmons Reappointed West Indies Coach three years after being dismissed

ఆంటిగ్వా: వెస్టిండీస్‌ మాజీ ఆటగాడు, కోచ్ ఫిల్‌ సిమ్మన్స్‌ తిరిగి తిరిగి మళ్లీ సొంత గూటికే చేరుకున్నారు. సిమ్మన్స్‌ మరోసారి వెస్టిండీస్‌ హెడ్ కోచ్‌గా నియమించబడ్డారు. రాబోయే నాలుగేళ్ల పాటు సిమన్స్ ప్రధాన కోచ్‌గా ఉండనున్నారు. మేరకు వెస్టిండీస్‌ క్రికెట్‌ బోర్డు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. వివాదాస్పద పరిస్థితుల మధ్య దాదాపు మూడేళ్ల క్రితం వెస్టిండీస్ హెడ్ కోచ్‌ పదవి నుండి సిమ్మన్స్‌ తప్పుకున్నాడు. అనంతరం తన తప్పును తెలుసుకున్న వెస్టిండీస్‌ బోర్డు మళ్లీ అతనికే పట్టం కట్టింది.

స్మిత్‌ను కెప్టెన్‌గా తిరిగి నియమిస్తే అభ్యంతరమేమీ లేదు.. అతనికి సహకరిస్తా: ఆసీస్ కెప్టెన్స్మిత్‌ను కెప్టెన్‌గా తిరిగి నియమిస్తే అభ్యంతరమేమీ లేదు.. అతనికి సహకరిస్తా: ఆసీస్ కెప్టెన్

సిమ్మన్స్‌ను ప్రధాన కోచ్‌గా నియమించడంపై క్రికెట్‌ వెస్టిండీస్‌ అధ్యక్షుడు రికీ స్కరిట్‌ స్పీన్దించాడు. 'సిమ్మన్స్‌ను తిరిగి కోచ్‌గా నియమించడం సంతోషంగా ఉంది. మేము చేసిన తప్పును సరిద్దిద్దుకోవడమే కాదు.. సిమ్మన్స్‌పై ఉన్న నమ్మకంతోనే మళ్లీ కోచ్ బాధ్యతలు అప్పగించాం. మా క్రికెట్‌ బోర్డు తగిన వ్యక్తినే నియమించింది. బోర్డుకు అతని సేవలు చాలా కీలకం. జట్టు మళ్లీ గాడిలో పడుతుంది' అని ధీమా వ్యక్తం చేశారు.

ఫిల్‌ సిమ్మన్స్‌ 206లో వెస్టిండీస్‌ ప్రధాన కోచ్‌గా తొలగిన అనంతరం అఫ్గానిస్తాన్‌ క్రికెట్‌ జట్టుకు తాత్కాలిక కన్సల్టెంట్‌గా పని చేశారు. అనంతరం కోచ్‌గా కూడా సిమ్మన్స్‌ సేవలందించారు. అయితే ప్రపంచకప్‌-2019లో అఫ్గానిస్తాన్‌ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. అఫ్గాన్‌ పేలవ ప్రదర్శన కారణంగా.. సిమ్మన్స్‌ పదవిని అఫ్గాన్‌ బోర్డు పొడగించలేదు. అనంతరం సిమ్మన్స్‌ పలు క్రికెట్‌ బోర్డుల కోచ్‌ పదవికి దరఖాస్తులు చేసుకున్నారు. ఈక్రమంలో భారత క్రికెట్‌ ప్రధాన కోచ్‌ పదవి కోసం కూడా దరఖాస్తు చేసుకున్నారు. తుది ఆరు మంది జాబితాలో కూడా ఉన్నాడు. అయితే రావిశాస్త్రికే ఆ పదవి దక్కడంతో.. సిమ్మన్స్‌కు నిరాశే ఎదురైంది. ఇక తిరిగి తిరిగి మళ్లీ విండీస్‌కే గూటికే చేరాడు.

గతంలో జింబాబ్వే, ఐర్లాండ్‌, వెస్టిండీస్ జట్లకు కోచ్‌గా సిమ్మన్స్ వ్యవహరించారు. 2016లో విండీస్‌ క్రికెటర్ల జీత భత్యాల విషయంలో విభేదాలు తలెత్తిన నేపథ్యంలో బోర్డుతో సిమ్మన్స్‌కు అభిప్రాయ భేదాలు వచ్చాయి. దీంతో అతన్ని విండీస్‌ బోర్డు అర్థాంతరంగా తొలగించింది. ఇటీవల విండీస్ జట్టు అంతగా రాణించట్లేదు. ఒక్క సిరీస్‌లో కూడా కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఇక వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్‌ ఉన్న నేపథ్యంలో సిమ్మన్స్‌ను ప్రధాన కోచ్‌గా తీసుకున్నారు.

Story first published: Tuesday, October 15, 2019, 14:34 [IST]
Other articles published on Oct 15, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X