న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మొహ్మద్ హఫీజ్‌పై పీసీబీ ఫైర్.. మరోసారి ఆటగాళ్లందరికి కరోనా పరీక్షలు!

 PCB reprimands Mohammad Hafeez for breaching the testing protocols

కరాచీ: తనకు కరోనా వైరస్ సోకలేదని ట్విటర్ వేదికగా ప్రకటించిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ మొహ్మద్ హఫీజ్ చిక్కుల్లోపడ్డాడు. తమకు సమాచారం ఇవ్వకుండా కరోనా టెస్ట్‌ల ఫలితాన్ని సోషల్ మీడియా వేదికగా ఎలా వెల్లడిస్తాడని హఫీజ్‌పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. హాఫీజ్ తొందరపాటుతో తమకు సమస్యను సృష్టించాడని, ఇది ముమ్మాటికి బోర్డు క్రమశిక్షణా నిబంధనలను ఉల్లంఘించడమేనని పీసీబీ సీఈవో వసీమ్ ఖాన్ మండిపడ్డాడు.

 గందరగోళం సృష్టించాడు..

గందరగోళం సృష్టించాడు..

‘మొహ్మద్ హఫీజ్‌తో నేను మాట్లాడాను. అతని తొందరపాటు పీసీబీని పూర్తిగా అసంతృప్తికి గురిచేసింది. వ్యక్తిగతంగా కరోనా వైరస్ టెస్టు చేసుకునే హక్కు అతనికి ఉంది. కానీ.. టెస్టు ఫలితాన్ని తొలుత పీసీబీకి చెప్పి ఉండాల్సింది. అలాకాకుండా.. అతనే స్వయంగా ప్రకటించి.. బోర్డుకు ఓ సమస్యను సృష్టించాడు. హాఫీజ్‌ ఇలా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు.

సెంట్రల్ కాంట్రాక్టులో లేకున్నా..

సెంట్రల్ కాంట్రాక్టులో లేకున్నా..

గతంలోనూ అతను క్రమశిక్షణ తప్పి మందలింపునకు గురయ్యాడు. అతను బోర్డు సెంట్రల్ కాంట్రాక్ట్‌లో లేడు. కానీ పాక్ జట్టుకు ఎంపికయ్యాడు. కాబట్టి బోర్డు నిబంధనలు తప్పకుండా పాటించాలి. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండాలి. ఓ పెద్ద సమస్యను సృష్టించిన అతని వ్యవహారంపై ఏమి చేయవచ్చనే దానిపై చర్చలు జరుపుతున్నాం.' అని వసీమ్ ఖాన్ వెల్లడించాడు.

10 మందికి కరోనా..

ఇంగ్లండ్‌ పర్యటన కోసమని ఎంపిక చేసిన 29 మంది క్రికెటర్లకు ముందస్తుగా రెండు రోజుల క్రితం కరోనా పరీక్షలు నిర్వహించిన పీసీబీ.. సోమవారం ముగ్గురు, మంగళవారం ఏడుగురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని తెలిపింది. కంగారుపడిన ఆటగాళ్లు సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లగా.. అందులో ఒకడైన మహ్మద్ హఫీజ్ వ్యక్తిగతంగా మరోసారి కరోనా వైరస్ టెస్టు చేయించుకున్నాడు. అందులో నెగటివ్ రావడంతో ట్విటర్‌ వేదికగా ఆ విషయాన్ని వెల్లడించాడు.

 ఆ అల్లా దయ..

ఆ అల్లా దయ..

‘రిపోర్ట్స్‌లో నాకు కరోనా పాజిటివ్‌ వచ్చిందని పీసీబీ మంగళవారం స్పష్టం చేసింది. అయితే నా ఆత్మ సంతృప్తికొరకు మరోసారి కుటుంబ సభ్యులతో కలిసి పరీక్షలు చేయించుకున్నా. నాతో సహా మా కుటుంబ సభ్యులకు నెగటీవ్ వచ్చింది. ఆ అల్లానే మా అందరిని సురక్షితంగా ఉంచాడు'అని ట్వీట్ చేశాడు. ఇక హఫీజ్ ట్వీట్‌తో పాక్ క్రికెట్ వర్గాల్లో గందరగోళం నెలకొంది. దీంతో పీసీబీ మరోసారి అందరికి కరోపరీక్షలు జరిపించాలని నిర్ణయించింది. శుక్రవారం(జూన్ 26)న 29 మంది ఆటగాళ్లకు మరోసారి పరీక్షలు చేయనున్నాడు. ఇక ఈ నెల 28న పాక్ జట్టు ఇంగ్లండ్‌కు బయల్దేరనుంది.

భారత గ్రేటెస్ట్ టెస్ట్ బ్యాట్స్‌మన్‌ ‌అతనే.. 52 శాతం ఓట్లతో పట్టం కట్టిన ఫ్యాన్స్

Story first published: Thursday, June 25, 2020, 13:22 [IST]
Other articles published on Jun 25, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X