న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పుల్వామా ఉగ్రదాడి: ఇమ్రాన్ ఫోటోలు తొలగింపుపై స్పందించిన పీసీబీ

PCB reacts to suspension of PSL broadcast in India and Imran Khans portrait being covered by CCI, PCA

ఇండియా ఎలా అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ నిర్వహిస్తుందో, అలాగే పాకిస్తాన్ కూడా పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహిస్తుంది. అయితే పుల్వామా ఘటన తరువాత ఇండియా వరుసగా పాకిస్తాన్ కు షాక్ లు మీద షాక్ లు ఇస్తుంది. అయితే పాకిస్తాన్ సూపర్ లీగ్ ప్రసారాలను భారత్ లో నిలిపివేయాలని డిస్పోర్ట్ నిర్ణయించింది. అలాగే వివిధ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్స్ పాకిస్తాన్ క్రికెటర్స్ ఫోటోలను తొల గించింది. అంతే కాకుండా మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ ఫోటోలను కూడా క్రికెట్ క్లబ్ అఫ్ ఇండియా తొలిగించింది.

పుల్వామా ఉగ్రదాడి ఎఫెక్ట్: పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లు నిలిపివేతపుల్వామా ఉగ్రదాడి ఎఫెక్ట్: పాకిస్థాన్ సూపర్ లీగ్ మ్యాచ్‌లు నిలిపివేత

ఈ చర్యలతో పీసీబీ స్పదించింది. క్రికెట్ ను రాజకీయాలను ఒకటిగా చూడకూడదని హిత భోద చేసింది. ఈ సందర్భంగా పీసీబీ మేనేజింగ్ డైరెక్టర్ వసీం ఖాన్ మాట్లాడుతూ "ఇది చాలా దురదృష్ట కరం. క్రికెట్ రెండు దేశాల మధ్య ఐక్యత కు వారధి లాంటిదని చెప్పింది. కొన్ని రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్స్ పాకిస్తాన్ ఆటగాళ్ల ఫోటోలను తొలగించడం మా దృష్టికి వచ్చింది" అని అన్నారు.

"అలాగే పాకిస్తాన్ ప్రధాని, మాజీ క్రికెటర్ ఫోటోలను తొలగంచడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయాలు, క్రీడలు రెండు వేరువేరు అని గ్రహించాలని సన్నాయి నొక్కులు నొక్కుతుంది. ఇదే విషయం మీద బీసీసీఐతో మాట్లాడుతామని, ఐసీసీ తో కూడా సంప్రదింపులు జరుపుతాం" పీసీబీ మేనేజింగ్ డైరెక్టర్ వసీం ఖాన్ తెలిపారు.

అయితే జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడి పట్ల భారత దేశ ప్రభుత్వం చాలా కోపంతో రగిలి పోతుంది. ఇప్పటికే ముంబై దాడుల వల్లన పాకిస్తాన్ కు ఇండియాకు మధ్య ద్వైపాక్షిక మ్యాచ్‌లు జరగడం ఆగిపోయాయి. ఈ చర్యతో ఇప్పటికే పాక్ బోర్డు తీవ్రంగా నష్ట పోయింది. చాలా సార్లు ఐసీసీ కు పిర్యాదు కూడా చేసింది. అయితే ఇప్పడూ పుల్వామా ఘటన తో రెండు దేశాల మధ్య క్రికెట్ బంధాలు ఇంకా క్షిణించాయి అని చెప్పాలి.

Story first published: Wednesday, February 20, 2019, 10:22 [IST]
Other articles published on Feb 20, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X