న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Final: ఏ లెక్కన చూసిన కోహ్లీసేననే బలంగా ఉంది.. జడేజా రాకతో అతనికి చోటు కష్టమే!

Parthiv Patel says India Have Covered All Bases Ahead Of World Test Championship Final

న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ దక్కించుకునే అవకాశాలు భారత్‌కే ఎక్కువగా ఉన్నాయని టీమిండియా మాజీ క్రికెటర్ పార్దీవ్ పటేల్ అన్నాడు. విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత జట్టు అన్ని విధాలుగా బలంగా ఉందన్నాడు. ఏ లెక్కన చూసిన ప్రత్యర్థి న్యూజిలాండ్ కంటే మెరుగ్గా కనిపిస్తోందని తెలిపాడు. రవీంద్ర జడేజా రీ ఎంట్రీతో మరో స్పిన్నర్ అక్షర్ పటేల్‌కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమేనన్నాడు. తాజాగా స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో టీమిండియా అప్ కమింగ్ అసైన్‌మెంట్‌పై చర్చించిన పార్దీవ్ పటేల్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

భీకరమైన బౌలింగ్..

భీకరమైన బౌలింగ్..

'వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ కోసం ఇంగ్లండ్‌కు వెళ్లే భారత జట్టు చాలా బలంగా కనిపిస్తుంది. ప్రత్యర్థి న్యూజిలాండ్‌తో పోల్చి చూస్తే అన్ని విధాల కోహ్లీసేన మెరుగ్గా ఉంది. బీసీసీఐ 20 మందితో కూడిన జట్టును ప్రకటించినప్పుడే విజయం మనదే అని అర్థమైంది. వీరికి తోడుగా నలుగురు స్టాండ్‌ బై ప్లేయర్లను కూడా ఎంపికచేశారు. బౌలింగ్‌ విషయానికి వస్తే జస్‌ప్రీత్ బుమ్రా, ఇషాంత్‌ శర్మ, షమీలతో చాలా పటిష్టంగా కనిపిస్తుంది. ఈ త్రయం 11 మ్యాచ్‌లు కలిపి 149 వికెట్లు తీసింది. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరూ గాయపడినా.. ఫిట్‌గా లేకపోయినా.. బ్యాకప్‌గా మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్ రూపంలో బలమైన బెంచ్ బౌలర్లున్నారు.

బలమైన బ్యాటింగ్..

బలమైన బ్యాటింగ్..

బ్యాటింగ్‌ విషయానికి వస్తే.. రోహిత్‌ శర్మ, శుభ్ మన్ గిల్‌, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్‌తో బలంగా ఉంది. వీరంతా ఇంగ్లండ్‌ గడ్డపై అదరగొట్టగలరు. వీరికి కేఎల్‌ రాహుల్‌ కూడా జత కలిస్తే ఇక బ్యాటింగ్‌లో తిరుగుండదు. అయితే ప్రస్తుత టీమ్ కాంబినేషన్‌లో కేఎల్ రాహుల్‌కు అవకాశం దొరకడమే కష్టంగా ఉందంటే.. భారత జట్టు ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆల్‌రౌండర్‌ కోటాలో చూసుకుంటే అశ్విన్‌, జడేజా రూపంలో ఇద్దరు ఉన్నారు. వీరికి తోడూ అక్షర్‌ పటేల్‌ కూడా ఉన్నాడు. 8వ స్థానం వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంది.

అక్షర్‌కు కష్టమే..

అక్షర్‌కు కష్టమే..

అయితే ఇంగ్లండ్‌తో సిరీస్‌కు రవీంద్ర జడేజా దూరమవడంతో అతని స్థానంలో అక్షర్‌ పటేల్‌ జట్టులోకి వచ్చాడు. అక్షర్‌ వచ్చీ రావడంతోనే 23 వికెట్లతో సత్తా చాటాడు. అయితే ఇప్పుడు జడేజా తుది జట్టులోకి వచ్చిన నేపథ్యంలో అక్షర్‌ పటేల్‌కు జట్టులో చోటు దక్కడం కష్టమే.. అయినా మంచి జట్టుతో మ్యాచ్‌ను గెలవడం అవసరం'అని పార్దీవ్ చెప్పుకొచ్చాడు. ఇక జూన్‌ 18 నుంచి 22 వరకు సౌతాంప్టన్‌ వేదికగా కివీస్‌, భారత్‌ల మధ్య ప్రపంచటెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే.

ద్రవిడ్ సైతం..

ద్రవిడ్ సైతం..

వరల్డ్ చాంపియన్‌షిప్ అనంతరం ఆగస్టులో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌ను టీమిండియా 3-2 తేడాతో గెలిచే అవకాశం ఉందని భారత బ్యాటింగ్‌ దిగ్గజం, మాజీ కెప్టెన్ రాహుల్‌ ద్రవిడ్‌ తెలిపాడు. 'టెస్ట్ సిరీస్ గెలిచేందుకు ఈసారి టీమిండియాకు మంచి అవకాశాలున్నాయి. ఇంగ్లండ్ బౌలింగ్‌ నాణ్యత గురించి ప్రత్యేకంగా చెప్పేదేమీ లేదు. ముఖ్యంగా వాళ్ల సీమ్‌ బౌలింగ్‌ దాడి గొప్పగా ఉంటుంది. వాళ్లకు బౌలింగ్‌లో చాలా ప్రత్యామ్నాయాలున్నాయి. కానీ బ్యాటింగ్‌ ఆర్డర్లో చూస్తే.. జో రూట్‌ రూపంలో టాప్‌-7లో ఒక్కడే ప్రపంచ స్థాయి బ్యాట్స్‌మన్‌ ఉన్నాడు. బెన్ స్టోక్స్‌ కూడా అగ్రశ్రేణి ఆల్‌రౌండర్‌. కానీ రవిచంద్రన్ అశ్విన్‌ ముందు అతని ఆటలు సాగే అవకాశం లేదు. వీళ్లిద్దరి మధ్య పోరు రసవత్తరంగా ఉండనుంది' అని అన్నాడు.

Story first published: Tuesday, May 11, 2021, 17:35 [IST]
Other articles published on May 11, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X