న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనీ జనరేషన్ లో పుట్టడం నా దురదృష్టం'

Parthiv Patel admits he lost his Indian team place to MS Dhoni due to own non-performance

హైదరాబాద్: భారత జట్టులో మెరుగైన ప్రదర్శన చేయలేకపోవడంతోనే..టీమిండియాలో తన స్థానాన్ని మహేంద్రసింగ్‌ ధోనీకి కోల్పోయినట్లు అప్పటి వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ వెల్లడించాడు. ధోనీ కంటే ముందే భారత జట్టు తరఫున వికెట్ కీపర్లుగా ఆడిన పార్థివ్ పటేల్, దినేశ్ కార్తీక్ ఆ తర్వాత దాదాపు దశాబ్దకాలం మళ్లీ జట్టు దరిదాపుల్లోకి రాలేకపోయారు. వన్డే, టీ20లతో పాటు టెస్టుల్లోనూ తన మార్క్ కీపింగ్, బ్యాటింగ్‌తో తిరుగులేని కెప్టెన్‌గా ధోనీ ఎదిగాడు.

దీంతో.. భారత సెలక్టర్లు మరో వికెట్ కీపర్‌ గురించి ఆలోచించే అవసరమే లేకపోయింది. కానీ.. 2014లో టెస్టులకి ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఆ తర్వాత టీమిండియాలోకి వృద్ధిమాన్ సాహా, పార్థీవ్ ప‌టేల్‌, దినేశ్ కార్తీక్‌ల పున‌రాగ‌మ‌నానికి మార్గం సుగుమమైంది. తాము మెరుగ్గా ఆడలేకపోవడంతోనే ధోనీ వైపు సెలక్టర్లు మొగ్గు చూపారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పార్థీవ్ పటేల్ వెల్లడించాడు.

'నాతో చాలా మంది చెప్తుంటారు.. ధోనీ పుట్టిన తరంలో పుట్టడం నా దురదృష్టమని. కానీ.. ధోనీ కంటే ముందే నేను భారత జట్టులో ఆడాను. అక్కడ నేను బాగా ఆడింటే.. ధోనీని జట్టులోకి తీసుకొచ్చేవారు కాదు కదా.? కాబట్టి నేను ఆ మాటల్ని పట్టించుకోలేదు. జట్టులో చోటు కోల్పోవడానికి కారణంగా అత్యుత్తమంగా ఆడలేకపోవడమే. నా ఈ స్థితికి ఒకరిని విమర్శించడం కంటే ధోనీ తరంలో పుట్టడం నా పొరపాటు అని సర్దిచెప్పుకోవడం బాగుంటుంది. ధోనీ ఓ లెజెండ్' అని పార్థీవ్ పటేల్ వెల్లడించాడు.

కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా సుదీర్ఘ పర్యటనకు బయల్దేరింది. తొలుత ఐర్లాండ్ పర్యటన కోసం... ఆ తర్వాత ఇంగ్లాండ్‌ పర్యటన కోసం శనివారం టీమిండియా బయల్దేరింది. ఈ సుదీర్ఘ సిరిస్‌లో భాగంగా కోహ్లీసేన తొలుత జూన్ 27, 29న ఐర్లాండ్‌‌తో రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడనుంది. ఇందుకోసం భారత జట్టులోని ఆటగాళ్లు ఐర్లాండ్‌ పర్యటనకు బయల్దేరారు.

Story first published: Sunday, June 24, 2018, 12:22 [IST]
Other articles published on Jun 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X