న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీ20 క్రికెట్‌లో పాకిస్తాన్‌దే హవా.. ఏకంగా 105 విజయాలు! టీమిండియాది ఎన్నో స్థానమంటే?

Pakistan Takes Top Spot By Winning 105 T20 Matches Followed By India

హైదరాబాద్: టీ20 ఫార్మాట్ ఎప్పుడయితే వచ్చిందో.. క్రికెట్ ఆట స్వరూపమే పూర్తిగా మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా పొట్టి ఫార్మాట్ టోర్నీలు ఎన్నో జరుగుతుండడంతో.. ఆటగాళ్లు అందరూ దంచుడే లక్ష్యంగా ఆడుతున్నారు. దీంతో టీ20 స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్‌ అని కొందరిపై ముద్ర పడింది. టీ20 కారణంగా టెస్ట్, వన్డేల్లో రాణించని జట్లు కూడా అంతర్జాతీయ టీ20ల్లో సత్తాచాటుతున్నాయి. ఈ పొట్టి ఫార్మాట్‌లో చిన్న టీంలు కూడా పెద్ద జట్లపై విజయాలు సాధిస్తున్నాయి. సంప్రదాయ క్రికెట్‌లో అంతగా రాణించని పాకిస్తాన్.. టీ20ల్లో మాత్రం దూసుకుపోతోంది. ఎంతలా అంటే.. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు అందుకుంది పాక్ మాత్రమే.

Sri Lanka vs India: 'చాలా రోజుల తర్వాత భారత జట్టులో అవకాశం దక్కింది.. టీమిండియాను గెలిపిస్తా'Sri Lanka vs India: 'చాలా రోజుల తర్వాత భారత జట్టులో అవకాశం దక్కింది.. టీమిండియాను గెలిపిస్తా'

అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్తాన్ అత్యధిక విజయాలు అందుకుంది. ఇప్పటివరకు 170 టీ20 మ్యాచులు ఆడిన పాక్.. 105 విజయాలు అందుకుంది. ఇటీవలి కాలంలో పాక్ ఎక్కువగా పొట్టి ఫార్మాట్ ఆడుతోంది. పాక్ 170 టీ20 మ్యాచులు ఆడగా.. మరే జట్టు కూడా 150 మ్యాచులు ఆడలేదు. పాక్ తర్వాత ఆస్ట్రేలియా అత్యధికంగా 145 మ్యాచులు ఆడింది. ఆసీస్ కంటే పాక్ 25 ఎక్కువ మ్యాచులు ఆడింది. ఈ రెండు జట్ల తర్వాత భారత్ 142 మ్యాచులు ఆడింది.

అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్తాన్ తర్వాత అత్యధిక విజయాలు అందుకుంది టీమిండియానే. భారత్ 142 మ్యాచులో 91 విజయాలు అందుకుంది. మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా 136 మ్యాచులో 76 విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజీలాండ్ టాప్-5లో ఉన్నాయి. ఆసీస్ 142 మ్యాచుల్లో 72 విజయాలు, కివీస్ 145 మ్యాచుల్లో 72 విజయాలు అందుకున్నాయి. ఆసీస్, కివీస్ విజయాల శాతం దాదాపు 50 మాత్రమే ఉండడం విశేషం. ఇంగ్లండ్ (134 మ్యాచులో 71), వెస్టిండీస్ (139 మ్యాచులో 63), శ్రీలంక (134 మ్యాచులో 61), ఆఫ్ఘనిస్తాన్ (84 మ్యాచులో 58) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

టీ20ల్లో అత్యధిక విజయాలు ఖాతాలో ఉన్న పాకిస్తాన్.. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. వన్డే టీ20 సిరీసుల కోసం ఇంగ్లండ్ వచ్చింది. ఇప్పటికే మూడు వన్డేలు ఆడగా.. మూడింటిలోనూ ఓడిపోయింది. ఇక శుక్రవారం (జులై 16న) ఇరు జట్ల మధ్య నాటింగ్‌హోమ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. లీడ్స్ వేదికగా 18న రెండో మ్యాచ్, మాంచెస్టర్ వేదికగా 20న మూడో మ్యాచ్ జరగనుంది. వన్డేల్లో ఓటమికి పాక్ బదులు తీర్చుకోవాలని చూస్తోస్తోంది. అయితే ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ టీ20ల్లో అదరగొడుతోంది. దీంతో మ్యాచులు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.

Story first published: Thursday, July 15, 2021, 21:46 [IST]
Other articles published on Jul 15, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X