న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్ సరసన చేరేనా? అడిలైడ్ టెస్టులో నసీమ్ షా, అందరి చూపు అతడివైపే!

Pakistan seeing match-winner in 16-year-old pace sensation Naseem Shah

హైదరాబాద్: పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా ఇప్పటికే ముగిసిన మూడు టీ20ల సిరిస్‌ను 2-0తో పాకిస్థాన్ చేజార్చుకుంది. గురువారం నుంచి అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి టెస్టులో అజార్ అలీ నేతృత్వంలోని పాకిస్థాన్ జట్టు తలపడనుంది.

ఈ టెస్టులో పాక్ తరుపున 16 ఏళ్ల యువ పేస్ సంచలనం నసీమ్ షా అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే గనుక జరిగితే ఆస్ట్రేలియా గడ్డపై అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా నసీమ్ షా అరుదైన ఘనత సాధిస్తాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆసీస్ మాజీ కెప్టెన్ ఇయాన్ క్రెయిగ్ పేరిట ఉంది.

కేకేఆర్‌పై కోపంతోనే! అలెక్స్ హేల్స్ రికార్డు బద్దలు కొట్టిన క్రిస్‌లిన్కేకేఆర్‌పై కోపంతోనే! అలెక్స్ హేల్స్ రికార్డు బద్దలు కొట్టిన క్రిస్‌లిన్

1953లో 17 ఏళ్ల వయసులో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఇయాన్ క్రెయిగ్ ఆస్ట్రేలియా తరుపున అరంగేట్రం చేశాడు. మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆడిన తన తొలి మ్యాచ్‌లో ఇయాన్ క్రెయిన్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఆప్ఘనిస్థాన్‌ బోర్డర్‌లోని దిర్ జిల్లాకు చెందిన నసీమ్ షా ఇప్పటివరకు పాక్ తరుపున ఏడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.

అడిలైడ్ వేదికగా తొలి టెస్టు

అడిలైడ్ వేదికగా తొలి టెస్టు

గురువారం నుంచి అడిలైడ్ వేదికగా ప్రారంభమయ్యే తొలి టెస్టులో పేస్ బౌలింగ్ స్లాట్ కోసం పోటీ పడుతున్న ముగ్గురు టీనేజర్లలో నసీమ్ షా చిన్నవాడు కావడం విశేషం. నసీమ్ షాతో పాటు 19 ఏళ్ల ముహమ్మద్ ముసా, షాహిన్ అఫ్రిదిలు కూడా రేసులో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు ముహమ్మద్ అబ్బాస్, ఇమ్రాన్ ఖాన్‌లతో బంతిని పంచుకోనున్నారు.

పాక్ మీడియా విమర్శలు

పాక్ మీడియా విమర్శలు

ఇటీవలే నసీమ్ షా తల్లి చనిపోయారు. అయినా సరే, నసీమ్ షా తన అరంగేట్రానికి సిద్ధమయ్యాడు. దీంతో యువ టీనేజీ బౌలర్లపై ఎక్కువ ఆధారపడటంపై కోచ్ మిస్బా ఉల్ హక్, అతని తోటి సెలెక్టర్లు పాక్ మీడియా తీవ్ర విమర్శలు గుప్పించింది. ముఖ్యంగా ఆస్ట్రేలియా లాంటి జట్టుకు వ్యతిరేకంగా ఆ దేశ పిచ్‌లపై. అయితే, పాక్ కోచింగ్ స్టాఫ్ మాత్రం దీనిని సమర్ధించుకుంటుంది.

టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానం

టెస్టు ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానం

ప్రస్తుతం టెస్టు ర్యాంకింగ్స్‌లో ఉన్న పాకిస్థాన్‌ను ప్రపంచ శక్తిగా మార్చడానికి ధైర్యం ముఖ్యమని వారు చెబుతున్నారు. ఇందులో భాగంగా యువ టాలెంట్‌ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాక్ మాజీ క్రికెట్ దిగ్గజం వకార్ యూనిస్ ప్రస్తావన తెరపైకి తీసుకొచ్చారు. వకార్ యూనిస్ తన 18వ పుట్టినరోజుకు ఒక రోజు ముందు భారత్‌పై అరంగేట్రం చేశాడు.

వకార్ యూనిస్ ప్రస్తావన

వకార్ యూనిస్ ప్రస్తావన

1989లో కరాచీలో వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేసిన వకార్ యూనిస్ పాక్ తరుపున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. తన మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు పడగొట్టిన వకార్ యూనిస్ మొత్తం 87 మ్యాచ్‌ల కెరీర్‌లో 373 వికెట్లు తీశాడు.

వార్మప్ మ్యాచ్‌లో మెరిసిన నసీమ్ షా

వార్మప్ మ్యాచ్‌లో మెరిసిన నసీమ్ షా

తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియా ఎలెవన్ జట్టుతో జరిగిన రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో నసీమ్ షా ఎనిమిది ఓవర్లు వేసి ఒక వికెట్‌తో పాటు 21 పరుగులు ఇచ్చాడు. అడిలైడ్ టెస్టు తుది జట్టులో గనుక నసీమ్ షాకు చోటు దక్కితే 16 ఏళ్ల వయసులో అరంగేట్రం చేసిన ఆటగాళ్ల జాబితాలో చేరతాడు. ఇదే జాబితాలో సచిన్ టెండూల్కర్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.

అతి పిన్న వయస్కుడిగా

అతి పిన్న వయస్కుడిగా

అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతి పిన్న వయస్కుడి రికార్డు హసన్ రాజా పేరిట ఉంది. పాకిస్థాన్‌కు చెందిన హసన్ రాజా 14 ఏళ్ల వయసులో 1996లో టెస్టు అరంగేట్రం చేశాడు. రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో భాగంగా నవంబర్ 21-25న అడిలైడ్ వేదికగా మొదటి టెస్టు జరగనుండగా, నవంబర్ 29 నుంచి డిసెంబర్ 3 వరకు రెండో టెస్టు జరగనుంది.

టెస్టు జట్టు:

టెస్టు జట్టు:

అజార్ అలీ (కెప్టెన్), అబిద్ అలీ, అసద్ షఫీఖ్, బాబర్ అజమ్, హారిస్ సోహైల్, ఇమామ్ ఉల్ హక్, ఇమ్రాన్ ఖాన్ సీనియర్, ఇఫ్తిక ర్ అహ్మద్, ఖషీఫ్ భాటి, మహ్మద్ అబ్బాస్, మహ్మ ద్ రిజ్వాన్, ముస ఖాన్, నసీమ్ షా, షాహీన్ అఫ్రి దీ, షాన్ మసూద్, యాసిర్ షా.

Story first published: Tuesday, November 19, 2019, 15:52 [IST]
Other articles published on Nov 19, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X