న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

పాకిస్థాన్ ఆటగాళ్లకు హెచ్చరికలు జారీ చేసిన ఐసీసీ

Pakistan reprimanded by anti-corruption official for wearing smart watches during England Test

హైదరాబాద్: పాకిస్థాన్ ఆటగాళ్లకు ఐసీసీ హెచ్చరిక జారీ చేసింది. క్రమశిక్షణను ఉల్లంఘించరాదని ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న టెస్టు మ్యాచ్ తొలి రోజు అనంతరం ఇలా పేర్కొంది. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఆటగాడైన హసన్ అలీ వెల్లడించారు.

ప్లేయర్స్ ఎవరూ స్మార్ట్‌వాచ్‌లు పెట్టుకోవద్దని

ప్లేయర్స్ ఎవరూ స్మార్ట్‌వాచ్‌లు పెట్టుకోవద్దని

రెండో రోజు మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన అలీ.. టీమ్‌లోని ప్లేయర్స్ ఎవరూ స్మార్ట్‌వాచ్‌లు పెట్టుకోవద్దని ఐసీసీ స్పష్టంచేసింది. తొలి రోజు ఆట ముగిసిన తర్వాత ఐసీసీకి చెందిన అవినీతి నిరోధక బృందం పాక్ టీమ్‌ను కలిసింది. దాదాపు ఓ మొబైల్ ఫోన్‌లాగే గ్రౌండ్ నుంచే టెక్ట్స్, వాయిస్ మెసేజ్‌లు పంపే వీలున్న స్మార్ట్‌వాచ్‌లను చూపించి ఇలాంటి వాటిని వాడేందుకు వీల్లేదని నిరాకరించింది.

తొలి రోజు ఆటలో ఇంగ్లండ్‌ 184 పరుగులకు ఆలౌట్

తొలి రోజు ఆటలో ఇంగ్లండ్‌ 184 పరుగులకు ఆలౌట్

'మా జట్టులో ఎవరో అలాంటి వాచ్ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఆ వాచ్‌ను ఎవరు పెట్టుకున్నారో తెలియదుగానీ.. ఐసీసీ అధికారులు మాత్రం అలాంటివి గ్రౌండ్‌లో కుదరవన్నారు' హసన్ అలీ చెప్పాడు. తొలి రోజు ఆటలోనే ఇంగ్లండ్‌ను 184 పరుగులకు ఆలౌట్ చేసిన పాకిస్థాన్.. తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 50 పరుగులు చేసి ఆధిపత్యం చెలాయించింది. ప్లేయర్స్ ఎలాంటి సమాచార వ్యవస్థను తమ వెంట తీసుకెళ్లకుండా ఐసీసీ నిషేధం విధించింది.

మ్యాచ్ ఫిక్సింగ్‌కు కేరాఫ్ అడ్రెస్ పాకిస్థాన్

మ్యాచ్ ఫిక్సింగ్‌కు కేరాఫ్ అడ్రెస్ పాకిస్థాన్

మ్యాచ్ ఫిక్సింగ్‌కు కేరాఫ్ అడ్రెస్ పాకిస్థాన్ క్రికెటర్లు. ఇప్పటికే ఎన్నోసార్లు ఈ ఫిక్సింగ్‌కు పాల్పడి నిషేధాలు కూడా ఎదుర్కొన్నారు. 2010లో ఇంగ్లండ్ టూర్‌లో స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడి ముగ్గురు క్రికెటర్లు నిషేధానికి గురైన విషయం తెలిసిందే. దీంతో ఇప్పుడదే ఇంగ్లండ్ టూర్‌లో ఉన్న పాక్ క్రికెటర్లకు ఐసీసీ ముందే ఓ వార్నింగ్ ఇచ్చింది.

ఇద్దరు పాక్ ఆటగాళ్లు స్మార్ట్‌వాచ్‌లు పెట్టుకున్నట్లు

ఇద్దరు పాక్ ఆటగాళ్లు స్మార్ట్‌వాచ్‌లు పెట్టుకున్నట్లు

డ్రెస్సింగ్ రూమ్‌లోనూ వీటికి అనుమతి లేదు. అధికారులకు మాత్రం తమ టీమ్‌తో సమాచారం పంచుకోవడానికి వాకీటాకీలాంటి కొన్ని పరికరాలను అనుమతిస్తారు. ఇద్దరు పాక్ ఆటగాళ్లు స్మార్ట్‌వాచ్‌లు పెట్టుకున్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. అయితే వాళ్లు ఆ స్మార్ట్‌ఫోన్ల ద్వారా ఎలాంటి తప్పుడు పనులు చేయలేదు.

యాపిల్ స్మార్ట్ వాచ్‌లు వద్దంటే వద్దు:

యాపిల్ స్మార్ట్ వాచ్‌లు వద్దంటే వద్దు:

‘యాపిల్‌ స్మార్ట్‌ వాచ్‌లు.. ఫోన్‌ లేదా వైఫైకి కనెక్ట్‌ అవుతాయి. దీంతో మెసేజ్‌లు వచ్చే అవకాశం ఉంది. ఈ వాచ్‌ ఇంచుమించు ఫోన్‌లాగే పని చేస్తోంది. ఇలాంటి వాచ్‌లను పెట్టుకుని ఆడితే బుకీలు ఆటగాళ్లను సంప్రదించే అవకాశం ఉంది. తద్వారా మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే పాక్‌ ఆటగాళ్లను పెట్టుకోవద్దని చెప్పాం. ' అని ఓ ఐసీసీ అధికారి తెలిపారు.

Story first published: Friday, May 25, 2018, 13:36 [IST]
Other articles published on May 25, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X