న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

2020 T20 World Cup: ఈసారి భారత్ vs పాక్ మ్యాచ్ లేదు

Pakistan, India avoid each other in group stage at T20 World Cup

హైదరాబాద్: వరల్డ్‌కప్ లాంటి మెగా టోర్నీలో భారత్, పాకిస్తాన్‌ జట్లు తలపడతున్నాయంటే ఆ మజానే వేరు. 2011 నుంచి ప్రతి ఐసీసీ ఈవెంట్లోనూ గ్రూప్‌ దశలో భారత్-పాక్ జట్లు తలపడ్డాయి. 2019 వన్డే వరల్డ్ కప్‌లో కూడా గ్రూప్‌లో పోటీపడనున్నాయి. ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న ఈ వన్డే వరల్డ్‌కప్‌లో జూన్‌ 16న దాయాది దేశాలు పోటీకి సిద్ధమయ్యాయి.

కానీ వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో మాత్రం దాయాదుల మధ్య పోరు చూసే అవకాశం గ్రూప్‌ దశలోనైతే లేదు. ఐసీసీ మంగళవారం 2020 టీ20 వరల్డ్‌కప్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్‌లో భారత్, పాకిస్తాన్‌ రెండు వేర్వేరు గ్రూప్‌లలో ఉన్నాయి.

ర్యాంకింగ్స్‌లో రెండు జట్లు

ర్యాంకింగ్స్‌లో రెండు జట్లు

ర్యాంకింగ్స్‌లో రెండు జట్లు తొలి రెండు స్థానాల్లో ఉండడంతో పాక్‌, భారత్‌లను ఒకే గ్రూపులో ఉంచడం కుదరలేదు. నాకౌట్‌ దశలో ఇరు జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుందా? అనేది తదుపరి ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌, పాకిస్థాన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, రెండు క్వాలిఫయింగ్‌ జట్లు గ్రూప్‌-1లో ఉన్నాయి.

అక్టోబర్‌ 24న జరిగే మ్యాచ్‌తో

అక్టోబర్‌ 24న జరిగే మ్యాచ్‌తో

ఇక, భారత్‌, ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, అఫ్గానిస్థాన్‌, రెండు క్వాలిఫయింగ్‌ జట్లు గ్రూప్‌-2లో ఉన్నాయి. భారత్‌ తన తొలి మ్యాచ్‌ను అక్టోబరు 24న దక్షిణాఫ్రికాతో ఆడుతుంది. రెండో మ్యాచ్‌లో 29న క్వాలిఫయింగ్‌ జట్టుతో తలపడుతుంది. గ్రూప్‌ ‘ఎ'లో ఆతిథ్య ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌ మధ్య అక్టోబర్‌ 24న జరిగే మ్యాచ్‌తో టోర్నీ మొదలవుతుంది.

మొత్తం 12 జట్లు

మొత్తం 12 జట్లు

మొత్తం 12 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నమెంట్‌కు ర్యాంకుల్లో టాప్‌-8గా ఉన్న జట్లు ఇప్పటికే నేరుగా అర్హత సాధించాయి. మిగిలిన 4 స్థానాల కోసం శ్రీలంక, బంగ్లాదేశ్‌ సహా మరో ఎనిమిది జట్లు వరల్డ్ కప్‌కు ముందు జరిగే క్వాలిఫయింగ్‌ టోర్నీలో ఆడి అర్హత సాధించాల్సి ఉంది. నవంబర్‌ 15న మెల్‌బోర్న్‌లో ఫైనల్‌ నిర్వహిస్తారు.

Story first published: Wednesday, December 18, 2019, 18:22 [IST]
Other articles published on Dec 18, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X