న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వరుసగా 11వ టీ20 సిరిస్: చరిత్ర సృష్టించిన పాకిస్థాన్

Pakistan down New Zealand for 11th successive T20 series win

హైదరాబాద్: టీ20ల్లో దాయాది దేశం పాకిస్థాన్ చరిత్ర సృష్టించింది. దుబాయి వేదికగా శుక్రవారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20లో పాక్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరిస్‌ను 6 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు టీ20ల సిరిస్‌ను మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే 2-0తో సిరీస్‌ సొంతం చేసుకుంది.

<strong>కోహ్లీకి వెలకట్టలేని సాయం, ధోనికి మద్దతు ప్రకటించిన ఆశిష్ నెహ్రా</strong>కోహ్లీకి వెలకట్టలేని సాయం, ధోనికి మద్దతు ప్రకటించిన ఆశిష్ నెహ్రా

దీంతో వరుసగా 11 టీ20 సిరీస్‌లు గెలుచుకున్న జట్టుగా పాకిస్థాన్ చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్ జట్టులో కొలిన్‌ మున్రో(44), విలియమ్సన్‌ (37), అండర్సన్‌ (44) రాణించడంతో 7 వికెట్లు కోల్పోయి 153 పరుగుల చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్థాన్ జట్టులో బాబర్‌ అజమ్‌ (40), అసీఫ్‌ అలీ (38), మహ్మద్‌ హఫీజ్‌ (34)లు రాణించడంతో రెండు బంతులు మిగిలుండగా విజయాన్ని అందుకుంది. అంతేకాదు టీ20ల్లో ఈ విజయం పాకిస్థాన్‌కు ఇది వరుసగా ఎనిమిదో విజయం.

ఈ జాబితాలో ఆప్ఘనిస్థాన్ జట్టు వరుసగా 11 మ్యాచ్‌లు గెలిచి అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఇంగ్లాండ్‌, ఐర్లాండ్‌, పాకిస్థాన్ వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచి ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. వరుసగా అత్యధిక సిరీస్‌లు గెలిచిన జాబితాలో భారత్‌(6 టీ20 సిరీస్‌లు) పాక్ తర్వాతి స్థానంలో ఉంది.

Story first published: Saturday, November 3, 2018, 15:01 [IST]
Other articles published on Nov 3, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X