న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

క్వీన్‌తో భేటీ: కుర్తా, ఫైజామా ఎందుకు వేసుకున్నానంటే!: పాక్ కెప్టెన్

Pakistan Captain Sarfaraz Ahmed explains why he wore Shalwar Kameez

హైదరాబాద్: 12వ ఎడిషన్ వరల్డ్‌కప్ ప్రారంభ వేడుకలు అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభ వేడుకలను సుమారు నాలుగు వేలకు పైగా అభిమానులు హాజరై ప్రత్యక్షంగా వీక్షించారు. ఈ వేడుకల్లో 60-సెకండ్ ఛాలెంజ్ అమితంగా ఆకట్టుకుంది.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఈ ప్రారంభ వేడుకలు ముగిసిన తర్వాత వరల్డ్‌కప్‌లో పాల్గొనే పది జట్ల కెప్టెన్లు బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో క్వీన్‌ ఎలిజబెత్‌ IIను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో మిగతా జట్ల కెప్టన్లు అందరూ సూట్‌ ధరంచగా... సర్ఫరాజ్‌ మాత్రం కుర్తా, పైజామా లాంటి సంప్రదాయ దుస్తులు ధరించాడు.

కుర్తా, ఫైజమాపై పాక్ టీమ్‌ బ్లేజర్‌ వేసుకుని అందరిలోనూ ప్రత్యేకంగా నిలిచాడు. పది జట్ల కెప్టెన్లను ప్రిన్స్ హ్యారీతో పాటు క్వీన్‌ ఎలిజబెత్‌‌కు ఐసీసీ నిర్వాహాకులు పరిచయం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ధరించిన డ్రెస్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు జోకులు వేస్తున్నారు.

"అన్ని జట్ల కెప్టెన్లు టై, జాకెట్‌ ధరించి ఎంతో హుందాగా వచ్చారు. కానీ పాక్ మాత్రం అందరికీ భిన్నంగా దర్శనమిచ్చాడు. ఇంకా నయం లుంగీ, బనియన్‌, టోపీ పెట్టుకుని రాలేదు. ఒకవేళ అలా గనుక వచ్చి ఉంటే" అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఎక్కడికి వెళ్లినా మూలాలు మరచిపోలేదని సర్ఫరాజ్‌ని అభిమానులు అభినందించగా, కొంతమంది సర్ఫరాజ్‌కు ఎక్కడ ఎలా ఉండాలో తెలియదంటూ ట్రోల్‌ చేశారు.

తనపై వస్తోన్న ట్రోల్స్‌పై వెస్టిండిస్‌తో శుక్రవారం మ్యాచ్ జరగడానికి ముందు సర్ఫరాజ్ అహ్మద్ స్పందించాడు. "కుర్తా, ఫైజమా అనేది మా జాతీయ డ్రెస్. బోర్డు నుంచి నాకు స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. కాబట్టే నేను మా జాతీయ డ్రెస్‌ను ప్రమోట్ చేశాను. మిగతా కెప్టెన్లు సూట్ వేసుకుంటే నేను మాత్రం మా జాతీయ డ్రెస్ వేసుకున్నందుకు చాలా గర్వంగా అనిపించింది" అని ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు.

Story first published: Friday, May 31, 2019, 16:03 [IST]
Other articles published on May 31, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X