న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

బదులు తీర్చుకుంది: ఐపీఎల్‌ ప్రసారాలను నిషేధించిన పాకిస్థాన్

IPL 2019 : Pak Decide Not To Broadcast Indian Premier League 2019 Matches | Oneindia Telugu
Pakistan bans broadcast of Indian Premier League 2019 matches

హైదరాబాద్: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) 2019 ప్రసారాలను పాక్‌లో నిషేధిస్తున్నామని ఆ దేశ సమాచార, ప్రసార శాఖ మంత్రి ఫవాద్‌ అహ్మద్‌ చౌద్రీ తెలిపారు. ఇటీవలే పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌లో పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) మ్యాచ్‌ ప్రసారాలను డీస్పోర్ట్స్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీనికి కౌంటర్‌గానే పాకిస్థాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

కన్నీళ్లు వచ్చాయి, 'డాడీస్‌ ఆర్మీ' అని వెక్కిరించారు: సీఎస్‌కేతో అనుబంధంపై ధోనికన్నీళ్లు వచ్చాయి, 'డాడీస్‌ ఆర్మీ' అని వెక్కిరించారు: సీఎస్‌కేతో అనుబంధంపై ధోని

"పీఎస్‌ఎల్ సమయంలో భారత్‌కి చెందిన ప్రసార కంపెనీలు, ప్రభుత్వం పాకిస్థాన్‌ క్రికెట్‌పై వివక్ష చూపాయి. కాబట్టి ఐపీఎల్‌ ప్రసారాలు పాకిస్తాన్‌లో ప్రదర్శించబడటాన్ని మేము సహించలేం. ఇప్పుడు మేము ఎందుకు ఐపీఎల్‌ని ఉపేక్షించాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.

ఆర్మీ క్యాప్‌లు ధరించి మరీ భారత్ మ్యాచ్ ఆడింది

ఆర్మీ క్యాప్‌లు ధరించి మరీ భారత్ మ్యాచ్ ఆడింది

"మేము రాజకీయాల్ని, క్రికెట్‌ను కలపకూడదని అనుకున్నాం. కానీ.. భారత్ జట్టు ఆస్ట్రేలియాపై ఆర్మీ క్యాప్‌లు ధరించి మరీ మ్యాచ్ ఆడింది. దీనిపై ఐసీసీ నుంచి ఎలాంటి చర్యలూ లేవు. ఐపీఎల్‌ను పాకిస్థాన్‌లో ప్రసారం చేయనివ్వకపోతే.. అది కచ్చితంగా భారత క్రికెట్‌కి నష్టం చేకూరుస్తుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో పాకిస్థాన్ ఓ సూపర్ పవర్" అని చౌదరీ వెల్లడించాడు.

పుల్వామాలో ఉగ్రదాడిలో 40 మందికి పైగా మృతి

పుల్వామాలో ఉగ్రదాడిలో 40 మందికి పైగా మృతి

ఫిబ్రవరి 14న కశ్మీన్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో 40 మందికి పైగా భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు పీఎస్‌ఎల్‌ నాలుగో సీజన్‌ ప్రారంభమైంది. ఆ రోజు నుంచి టోర్నీ ముగిసే వరకూ అంటే మార్చి 17 వరకూ పీఎస్‌ఎల్ మ్యాచ్‌లను భారత్‌లో డీస్పోర్ట్స్, ఐఎంజీ రిలయన్స్‌ ప్రసారం చేయలేదు. దీంతో అప్పట్లో ఘాటు విమర్శలు గుప్పించిన పాక్ ఇప్పుడు బదులు తీర్చుకుంది.

2008 ఆరంభ సీజన్‌లో ఆడిన పాకిస్థాన్ క్రికెటర్లు

2008 ఆరంభ సీజన్‌లో ఆడిన పాకిస్థాన్ క్రికెటర్లు

ఐపీఎల్‌ ఆరంభ సీజన్‌ 2008లో పాకిస్థాన్ క్రికెటర్లను టోర్నీలో ఆడేందుకు అనుమతిచ్చిన భారత్.. ముంబయి దాడుల తర్వాత వారిని ఐపీఎల్‌లోకి అనుమతించడం లేదు. దీంతో.. గత పదేళ్లుగా ఐపీఎల్‌కి దూరంగానే పాక్ క్రికెటర్లు ఉంటున్నారు. మార్చి 23న జరిగే తొలి మ్యాచ్‌లో కోహ్లి మిస్టర్‌ కూల్‌ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌... కోహ్లీ నాయకత్వంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుతో తలపడనుంది.

Story first published: Friday, March 22, 2019, 10:23 [IST]
Other articles published on Mar 22, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X