న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం, ధోనీతో సహా 85మందికి

Padma Awards: Mahendra Singh Dhoni Among Luminaries To Receive Prestigious Recognition

హైదరాబాద్: 2018 ఏడాదికి గాను గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో మొత్తం 85 మందికి అవార్డులు వరించగా వారిలో క్రీడారంగానికి చెందిన ధోనీ, పంకజ్ అద్వాణీ, శ్రీకాంత్‌లు ఉండటం విశేషం.

ఈ అవార్డులను మంగళవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతులమీదుగా ప్రదానం చేయగా కిదాంబి శ్రీకాంత్ అందుకున్నారు. పలు కారణాల రీత్యా ధోనీ హాజరుకాలేకపోయారు. వీరితో పాటు పారా అథ్లెట్‌ మురళీకాంత్‌ పేట్కర్‌ కూడా అవార్డును స్వీకరించాడు. ఇక దేశ మూడో అత్యున్నత పురస్కారమైన పద్మభూషణ్‌కు ఎంపికైన టీమిండియా మాజీ కెప్టెన్‌ ధోనీ, లియర్డ్స్‌ స్టార్‌ పంకజ్‌ ఆడ్వాణీ, పద్మశ్రీకి ఎంపికైన మహిళా వెయిట్‌లిఫ్టర్‌ మీరాబాయి చాను వివిధ కారణాల రీత్యా కార్యక్రమానికి గైర్హాజరయ్యారు.

మహేంద్ర సింగ్ ధోనికి 2009లోనే పద్మ అవార్డు వరించింది. అతని కెరీర్‌లో 2008, 2009కి గాను ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఘనతతో ధోనీ రెండు పద్మ అవార్డులను గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా రికార్డు పొందాడు. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును 2007వ సంవత్సరంలో అందుకున్నాడు.

ఇదిలా ఉంచితే బ్యాడ్మింటన్ రంగంలో అతి చిన్న వయస్సులో తొలిసారిగా పద్మ అవార్డు అందుకున్నాడు 25ఏళ్ల కిదాంబి శ్రీకాంత్. మణిపూరికి చెందిన వెయిట్ లిఫ్టర్ మీరాబాయి ఛాను 2018 టోయ్‌సా వెయిట్ లిఫ్టర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును గెలచుకున్నారు. 48కేజీల విభాగంలో 2014 కామన్‌వెల్త్ క్రీడల్లో సిల్వర్ మెడల్ గెలచుకున్నారు.

Story first published: Wednesday, March 21, 2018, 14:55 [IST]
Other articles published on Mar 21, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X