న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అప్పట్లో యో-యో టెస్టు ఉంటే.. మేం ముగ్గురమే పాస్ అయ్యేవాళ్లం: కైఫ్

Only me, Balaji and Yuvraj Singh would’ve cleared the yo-yo test during our time: Mohammad Kaif

న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు యో-యో టెస్టును ప్రామాణికంగా పెట్టిన విషయం తెలిసిందే. ఆటగాళ్లు అందరూ యో-యో టెస్టులో నెగ్గితేనే జట్టులోకి వస్తారు. గత నాలుగేళ్లుగా టీమిండియా ఇదే ఫాలో అవుతోంది. గతంలో ఈ టెస్టులో విఫలమైనందుకు ప్లేయర్స్‌ను జట్టులోకి ఎంపిక చేయని సంగతి తెలిసిందే. ఇదివరకు యో-యో టెస్టులో ప్రతి ఆటగాడికి అర్హత మార్కుని 16.1గా నిర్ణయించారు. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌సింగ్‌, తెలుగు ఆటగాడు అంబటి రాయుడు, మొహమ్మద్ షమీ లాంటి స్టార్ ఆటగాళ్లు కూడా ఒకానొక సందర్భంలో యో-యో టెస్టు ఫెయిల్ అయి జట్టులో స్థానం దక్కించుకోలేకపోయారు.

ప్రతిపాదనను తిరస్కరించిన ప్రధాని.. ఇక అతిపెద్ద క్రికెట్ స్టేడియం లేనట్టే!!ప్రతిపాదనను తిరస్కరించిన ప్రధాని.. ఇక అతిపెద్ద క్రికెట్ స్టేడియం లేనట్టే!!

ఆ రోజుల్లో యో-యో టెస్టు ఉంటే:

ఆ రోజుల్లో యో-యో టెస్టు ఉంటే:

అయితే లాక్‌డౌన్‌ సందర్భంగా మాజీలు తమ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాను క్రికెట్ ఆడే రోజుల్లో యో-యో టెస్టు ఉంటే ఎలా ఉండేదో చెప్పాడు టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్. ఆ రోజుల్లో యో-యో టెస్టు ఉంటే.. కేవలం ముగ్గురు భారత ఆటగాళ్లు మాత్రమే పాసయ్యేవారని కైఫ్ చెప్పుకొచ్చాడు. ఆ ముగ్గురిలో తన పేరును మొదటగా చెప్పుకున్నాడు. తనతో పాటు లక్ష్మీపతి బాలాజీ, యువరాజ్ సింగ్ పేర్లను చెప్పాడు.

ముగ్గురమే పాస్ అయ్యేవాళ్లం

ముగ్గురమే పాస్ అయ్యేవాళ్లం

మహ్మద్ కైఫ్ గురువారం హలో లైవ్ సెషన్‌లో మాట్లాడుతూ... 'క్రికెటర్‌కి ఫిట్‌నెస్ చాలా ముఖ్యం. నేను క్రికెట్ ఆడే రోజుల్లో యో-యో ఫిట్‌నెస్ టెస్టు లేదు. ఒకవేళ ఉండింటే.. నేను, లక్ష్మీపతి బాలాజీ, యువరాజ్ సింగ్ మాత్రమే పాసయ్యేవాళ్లం. నా అంచనా ప్రకారం జట్టులోని మిగిలిన వాళ్లెవరికీ ఆ ఫిట్‌నెస్ ప్రమాణాలని అందుకునే సామర్థ్యం అప్పట్లో లేదు' అని అన్నాడు. మహ్మద్‌ కైఫ్‌ భారత్ తరఫున 13 టెస్టులు, 125 వన్డేలు ఆడాడు.

యో-యో టెస్టు తప్పనిసరి

యో-యో టెస్టు తప్పనిసరి

భారత్ జట్టులోకి ప్రస్తుతం ఏ క్రికెటర్ ఎంపికవ్వాలన్నా యో-యో ఫిట్‌నెస్ టెస్టులో పాసవడం తప్పనిసరి. దీంతోనే ఆటగాళ్లు అందరూ ఫిట్‌నెస్ విషయంలో పోటీ పడుతున్నారు. ఇప్పుడు టీమిండియాలోని చాలా మంది క్రికెటర్లు దాదాపు సిక్స్‌ ప్యాక్‌తో కనిపిస్తున్నారు. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ. కోహ్లీని చూసి హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా, మనీష్ పాండే సిక్స్‌ ప్యాక్‌ చేసారు.

కోహ్లీ ఫిట్‌నెస్ విషయంలో జట్టుని ముందుండి నడిపిస్తున్నాడు. ఇందుకు శంకర్ బసు కూడా ఓ కారణం. అతడు టీమిండియా సహాయ బృందంలో చేరాక జట్టు ఫిట్‌నెస్ విషయంలో అత్యున్నత స్థానానికి చేరుకుంది. యో-యో టెస్టు పేరుతో టీమిండియా యాజమాన్యం యువరాజ్ సింగ్‌ను పక్కన పెట్టిన విషయం తెలిసిందే.

జడేజా అత్యుత్తమ ఫీల్డర్:

జడేజా అత్యుత్తమ ఫీల్డర్:

ఇదివరకు మహ్మాద్ కైఫ్ మాట్లాడుతూ... 'నా ఫీల్డింగ్ నైపుణ్యాలతోనే అభిమానులు నన్ను గుర్తించారు. ఫీల్డింగ్‌తో దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీల నుంచి గౌరవం అందుకున్నా. వారిద్దరు నన్ను చాలా సందర్భాల్లో మెచ్చుకున్నారు. ఇక ప్రస్తుత క్రికెటర్లలో భారత ఆటగాడు రవీంద్ర జడేజా అత్యుత్తమ ఫీల్డర్. ఒక్కోసారి అతని ఫీల్డింగ్ నమ్మశక్యంగా ఉంటుంది. మొహమ్మద్ అజారుద్దీన్, రాబిన్ సింగ్‌లు కూడా మంచి ఫీల్డర్లు' అని పేర్కొన్నాడు.

Story first published: Friday, May 22, 2020, 15:55 [IST]
Other articles published on May 22, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X