న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

త‌రానికి ఓ ప్లేయ‌ర్ వ‌స్తాడు.. దేశం ఆ ఆటగాడితో ఏకమవుతుంది: సెహ్వాగ్

Once in a generation, a player comes and the nation connects with him: Virender Sehwag wishes MS Dhoni


ఢిల్లీ: భారత క్రికెట్ చరిత్రలో బెస్ట్ కెప్టెన్ జాబితాలో కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, మహమ్మద్ అజారుద్దీన్, సౌరవ్ గంగూలీ ముందు వరుసలో ఉంటారు. అయితే గొప్ప కెప్టెన్‌గా మాత్రం ఎంఎస్ ధోనీ భారత క్రికెట్ అభిమానుల్లో చెరగని ముద్ర వేశాడు. ఎందుకంటే.. ఎవరికీ సాధ్యం కాని విధంగా 2007లో టీ20 ప్రపంచకప్, 2011లో వన్డే ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియాకు అందించాడు. అంతేకాదు క్రికెట్ ప్రపంచంలో ఈ మూడు ఐసీసీ టోర్నీలు గెలిచిన ఏకైక కెప్టెన్ కూడా మహీనే. ధోనీ బ్యాట్ పట్టి చాలా రోజులే అయినా క్రికెట్ ప్రేమికుల్లో ఆయనపై అభిమానం మాత్రం తగ్గలేదు.

సోషల్ మీడియాలో ట్రెండ్:

ఈ రోజు (జూలై 7) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ పుట్టినరోజు. దీంతో సోషల్ మీడియాలో ఆయన పేరు విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ధోనీ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులతో పాటు క్రికెట్ ప్రేమికులు, మాజీ క్రికెటర్లు ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్, ఐసీసీ, బీసీసీఐ మహీకి బ‌ర్త్‌డే విషెస్ తెలిపారు.

మ‌హీ భాయ్ హ్యాపీబ‌ర్త్‌డే:

మ‌హీ భాయ్ హ్యాపీబ‌ర్త్‌డే అంటూ కెప్టెన్ విరాట్ కోహ్లీ గ్రీటింగ్స్ తెలిపారు. 'మ‌హీ భాయ్ హ్యాపీబ‌ర్త్‌డే. ఎప్పుడూ ఆరోగ్యంగా, ఆనందంతో ఉండాలని కోరుకుంటున్నా' అని కోహ్లీ ట్వీట్ చేసాడు. ధోనీ ముఖంలో ఎప్పుడూ చిరున‌వ్వు క‌నిపించాలంటూ కోహ్లీ త‌న ట్వీట్‌లో దేవున్ని ప్రార్థించాడు. త‌న ట్విట్ట‌ర్‌లో ధోనీతో దిగిన కొన్ని ఫోటోల‌ను కోహ్లీ షేర్ చేసుకున్నాడు.

 త‌రానికి ఓ ప్లేయ‌ర్:

త‌రానికి ఓ ప్లేయ‌ర్:

39వ ప‌డిలోకి అడుగుపెట్టిన ఎంఎస్ ధోనీకి.. మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ కూడా విషెస్ తెలిపాడు. 'త‌రానికి ఓ ప్లేయ‌ర్ వ‌స్తాడు, దేశం ఆ ఆటగాడితో ఏకం అవుతుంది. అత‌ని కుటుంబంలో స‌భ్యుడినైనందుకు థ్యాంక్స్. ప్రపంచంలోని ఎంతో మందికి ఆరాధ్య దైవం అయిన ధోనీకి పుట్టినరోజు శుభాకాంక్షలు' అంటూ వీరూ ట్వీట్ చేశాడు. 'ఒక మనిషి, లెక్కలేనన్ని మధురస్మృతులు. అతని భయంకరమైన సిక్సర్లతో పుట్టినరోజును జరుపుకుందాం' అని బీసీసీఐ ట్వీట్ చేసింది.

ఏడాది కాలంగా క్రికెట్‌కి దూరం:

2019లో చివరగా భారత్ తరఫున మ్యాచ్‌లాడిన ఎంఎస్ ధోనీ.. ఆ తర్వాత దాదాపు ఏడాది కాలంగా క్రికెట్‌కి పూర్తిగా దూరమైపోయాడు. ఈ క్రమంలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ని కూడా కోల్పోయిన మహీ .. ఐపీఎల్ 2020 సీజన్‌లో రాణించడం ద్వారా మళ్లీ టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని ఆశించాడు. కానీ కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ వాయిదాపడగా.. ధోనీ ఆఖరిగా ఆడాలనుకుంటున్న 2020 టీ20 ప్రపంచకప్ జరగడంపై కూడా సందిగ్ధత నెలకొంది. దాంతో ధోనీ కెరీర్‌ కూడా ప్రశ్నార్థకంలో పడిపోయింది.

కెరీర్‌లో తొలిసారి.. ప్రపంచ నంబర్‌వన్‌ ర్యాంక్‌ దక్కించుకున్న యువ బాక్సర్‌!!

Story first published: Tuesday, July 7, 2020, 12:25 [IST]
Other articles published on Jul 7, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X