న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డేలకు ఉరి: శవ పేటిక తయ్యార్: రెండు-మూడేళ్లల్లో అంతం: మరిన్ని రిటైర్మెంట్స్

ODI Format is boring, Nobody will want to play it after within 2-3 years, says Moeen Ali
వన్డే ఫార్మట్ నుంచి క్రికెటర్ల రిటైర్మెంట్ *Cricket | Telugu OneIndia

లండన్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది క్రికెట్ అభిమానులను దశాబ్దాల పాటు ఉర్రూతలూగిస్తూ వస్తోన్న 50 ఓవర్ల వన్డే మ్యాచ్‌లు.. చరమాంకానికి చేరుకున్నాయా?, త్వరలోనే ఈ ఫార్మట్ క్రికెట్ కనుమరుగు కానుందా?, టీ20లు దీన్ని మింగేస్తోన్నాయా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. భవిష్యత్‌లో వన్డే ఇంటర్నేషనల్స్ ఉండబోవంటూ కొందరు మాజీ క్రికెటర్లు చేస్తోన్న వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతోన్నాయి.

వాళ్లది బలమైన బ్యాటింగ్ లైనప్: భారీ స్కోర్ చేసినా.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందేవాళ్లది బలమైన బ్యాటింగ్ లైనప్: భారీ స్కోర్ చేసినా.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాల్సిందే

వసీం అక్రమ్..

వసీం అక్రమ్..

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వన్డే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పాకిస్తాన్ లెజెండరీ క్రికెటర్ వసీం అక్రమ్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వన్డే ఫార్మట్ క్రికెట్ ఎక్కువ రోజులు కొనసాగకపోవచ్చని వ్యాఖ్యానించాడు. వన్డే క్రికెట్‌ వల్ల ప్లేయర్లు ఎక్కువగా అలసిపోతున్నారని అంచనా వేశాడు. అది వారి కేరీర్‌‌ను సైతం ప్రభావితం చేస్తోందని చెప్పాడు. టీ20 ఇంటర్నేషనల్స్, టెస్టుల్లో ఆడటానికే ప్లేయర్లు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, వన్డేలను నిర్వహించడం తగ్గించాలని సూచించాడు.

మొయన్ అలీ కీలక వ్యాఖ్యలు..

మొయన్ అలీ కీలక వ్యాఖ్యలు..

సుదీర్ఘకాలం వన్డే క్రికెట్‌ను ఆడిన వసీం అక్రమ్ వంటి సీనియర్లే ఆ ఫార్మట్‌ మనుగడపై అనుమానాలు లేవనెత్తుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తాజాగా మరో ఆల్‌రౌండర్ ఈ జాబితాలో చేరాడు. ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ.. తాజాగా వన్డే ఫార్మట్ క్రికెట్‌పై అనాసక్తిని ప్రదర్శించాడు. 50 ఓవర్ల పాటు మ్యాచ్ ఆడటానికి ఇష్టపడట్లేదని తేల్చి చెప్పాడు. వన్డే ఫార్మట్ క్రికెట్ బోరింగ్‌గా తయారైందని కుండబద్దలు కొట్టాడు. క్రికెట్ 365కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు.

టైట్ ప్యాక్..

టైట్ ప్యాక్..

వచ్చే రెండు-మూడు సంవత్సరాల్లో వన్డే క్రికెట్‌ను ఆడటానికి ఎవరూ ఇష్టపడరని స్పష్టం చేశాడీ చెన్నై సూపర్ కింగ్స్ ఆల్‌రౌండర్. దీనికి కారణాలు కూడా వివరించాడు. క్రికెట్ క్యాలెండర్ క్రమంగా టైట్ ప్యాక్‌గా మారుతోందని వ్యాఖ్యానించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, బిగ్ బాష్, కరేబియన్ ప్రీమియర్ లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్, 100 బంతులు.. వంటి టోర్నమెంట్లు క్రికెటింగ్ క్యాలెండర్‌లో చోటు చేసుకుంటోన్నాయనే విషయాన్ని మొయిన్ అలీ పరోక్షంగా ప్రస్తావించాడు.

ప్లేయర్లల్లోనే ఆసక్తి ఉండట్లేదు..

ప్లేయర్లల్లోనే ఆసక్తి ఉండట్లేదు..

రోజురోజుకూ వన్డే ఫార్మట్ క్రికెట్ మ్యాచ్‌ల సంఖ్య తగ్గుతూ వస్తోందని, వచ్చే రెండు మూడేళ్లలో కనుమరుగువుతుందని పేర్కొన్నాడు. చరిత్ర పుస్తకాల్లో చేరిపోతుందని వ్యాఖ్యానించాడు. 50 ఓవర్ల మ్యాచ్‌ ఆడటానికి ప్లేయర్లలోనే ఆసక్తి లేనప్పుడు.. అది అంతం కావడాన్ని ఎవరూ అడ్డుకోలేరని అభిప్రాయపడ్డాడు మొయిన్ అలీ. దేశవాలీ టోర్నమెంట్లల్లోనూ వన్డే ఫార్మట్ మ్యాచ్‌ల సంఖ్య తగ్గే అవకాశాలు లేకపోలేదని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నాడు.

మరింతమంది రిటైర్మెంట్..

మరింతమంది రిటైర్మెంట్..

సమీప భవిష్యత్తులో పలువురు క్రికెటర్లు వన్డే ఫార్మట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటిస్తారని మొయిన్ అలీ జోస్యం చెప్పాడు. ఈ ఫార్మట్ నుంచి ఇదివరకే బెన్ స్టోక్స్ రిటైర్ అయిన విషయాన్ని అతను ప్రస్తావించాడు. బెన్ స్టోక్స్ వంటి నాణ్యమైన ప్లేయర్ వన్డేలకు గుడ్‌బై చెప్పాడంటే దాని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించాడు. మూడు ఫార్మట్ల క్రికెట్‌ను ఆడితేనే మజా వస్తుందనేది వాస్తవమే అయినప్పటికీ- ఒక క్యాలెండర్ ఇయర్‌లో అనేక టోర్నమెంట్లల్లో పాల్గొనాల్సి రావడం ఇబ్బందికరమని పేర్కొన్నాడు.

Story first published: Sunday, August 7, 2022, 12:59 [IST]
Other articles published on Aug 7, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X