ఐపీఎల్‌కు ముందే ధోని జట్టు చెన్నైకి షాక్: క్రికెట్‌కు 9 నెలలు దూరం

Posted By:
NZ all-rounder Mitchell Santner out for nine months, to miss IPL

హైదరాబాద్: ఇంగ్లాండ్‌తో రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌కు ముందు కివీస్‌కు ఊహించని దెబ్బ తగిలింది. న్యూజిలాండ్ జట్టుకు మోకాలి గాయం కారణంగా న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మరో తొమ్మిది నెలలకు క్రికెట్‌కు దూరమయ్యాడు. 26 ఏళ్ల మిచెల్ శాట్నర్ ఇటీవల ఇంగ్లాండ్‌తో ముగిసిన ఐదు వన్డేల సిరిస్‌లో అద్భుత ప్రదర్శన చేశాడు.

ఐపీఎల్ 2018: బరిలోకి దిగే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఇదే

వన్డే సిరిస్ అనంతరం ఇంగ్లాండ్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌ల సిరిస్ బుధవారం 12 మందితో కూడి జట్టుని సెలక్టర్లు ప్రకటించారు. న్యూజిలాండ్ బోర్డు ప్రకటించిన ఈ జట్టు నుంచి మిచెల్ శాట్నర్‌ను తప్పించారు. వన్డే సిరిస్‌లో మిచెల్ శాట్నర్ మోకాలికి గాయం అవడంతో అతడికి ఇప్పుడు సర్జరీ చేయాల్సి ఉండటంతో న్యూజిలాండ్ బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది.

అతడి స్థానంలో లెగ్ స్పిన్నర్ టోడ్ టాడ్ ఆస్టల్‌ని సెలక్టర్లు ఎంపిక చేశారు. న్యూజిలాండ్ తరుపున 17 టెస్టులాడి 37 యావరేజితో 34 వికెట్లు తీశాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరిస్‌లో గాయపడటంతో స్కానింగ్ తీసిన వైద్యులు అతడికి సర్జరీ అవసరమని సూచించారు. ఈ మేరకు జట్టు కోచ్ మైక్ హెస్సాన్ వెల్లడించారు.

'మిచెల్ శాట్నర్ విషయంలో ప్రతి ఒక్కరూ బాధగానే ఉన్నారు. డ్రెస్సింగ్ రూమ్‌లో అందరి ఆటగాళ్లతో కలిసిపోతాడు. మూడు ఫార్మాట్లలో కూడా జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. అలాంటి ఆటగాడు వచ్చే సిరిస్‌లకు దూరమవ్వడం బాధాకరమే. వచ్చే 18 నెలలు జట్టుకు ఎంతో కీలకం' అని పేర్కొన్నాడు.

చెన్నై సూపర్‌కింగ్స్‌కు షాకే:

తాజా గాయంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్‌కు కూడా మిచెల్ శాట్నర్ దూరం కానున్నాడు. ఈ ఏడాది జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ వేలంలో మిచెల్ శాట్నర్‌ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ. 50 లక్షలకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో సాంట్నర్‌ మోకాలికి తీవ్ర గాయమైంది. స్కానింగ్‌లో మోకాలి ఎముకలో లోపం ఉన్నట్లు తేలడంతో సర్జరీ చేయాల్సిందేనని వైద్యులు స్పష్టం చేశారు. ఆరు నుంచి తొమ్మిది నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీంతో ఇంగ్లాండ్‌తో జరిగే రెండు టెస్టు మ్యాచ్‌‌ల సిరిస్‌తోపాటు, ఐపీఎల్‌కు దూరం కానున్నాడు.

Story first published: Wednesday, March 14, 2018, 13:34 [IST]
Other articles published on Mar 14, 2018

Mykhel బ్రేకింగ్ అలర్ట్స్ పొందండి