న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

తేల్చేసిన రవిశాస్త్రి: ప్రస్తుతం అతడే No.1 ఓవర్సీస్ స్పిన్నర్

 Now, Kuldeep Yadav will be our No.1 overseas spinner: Coach Ravi Shastri

హైదరాబాద్: చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ విదేశీ పర్యటనల్లో ప్రధాన స్పిన్నర్‌గా మారాడని టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నాడు. ఇక్కడ రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజాల కంటే కూడా కుల్దీప్‌ యాదవ్‌ ముందున్నాడని రవి శాస్త్రి పేర్కొన్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య బుధవారం తొలి టీ20 ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ గత కొంతకాలంగా విదేశీ పిచ్‌లపై కుల్దీప్‌ అద్భుత ప్రదర్శన చేస్తుండటంతో అతను కీలక బౌలర్‌గా మారిపోయాడని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.

New Zealand vs India: టీ20 సిరిస్ విజేత ఎవరో తేల్చిచెప్పిన సన్నీNew Zealand vs India: టీ20 సిరిస్ విజేత ఎవరో తేల్చిచెప్పిన సన్నీ

శాస్త్రి మాట్లాడుతూ

శాస్త్రి మాట్లాడుతూ

క్రిక్‌బజ్‌కి ఇచ్చిన ఇంటర్యూలో రవి శాస్త్రి మాట్లాడుతూ విదేశాల్లో ఒక స్పిన్నర్‌తో బరిలోకి దిగాలనుకుంటే మాత్రం కుల్దీప్‌కే తొలి ప్రాధాన్యత ఇస్తామంటూ వివరించాడు. అయితే ప్రతీ ఒక్కరికీ సమయం కచ్చితంగా వస్తుందంటూ అశ్విన్‌ను ఉ‍ద్దేశించి శాస్త్రి మాట్లాడాడు. 2018లో ఫిట్‌నెస్‌ రికార్డు సరిగా లేకపోవడం వల్లే అశ్విన్ జట్టుకు దూరమయ్యాడని అన్నాడు.

కుల్దీప్‌ ప్రధాన స్పిన్నర్‌

కుల్దీప్‌ ప్రధాన స్పిన్నర్‌

"కుల్దీప్‌ ప్రధాన స్పిన్నర్‌! విదేశీగడ్డపై రాణిస్తున్నాడు. సిడ్నీ టెస్టులో ఐదు వికెట్లతో కుల్దీప్‌ రాణించడం అతనిలోని ప్రతిభను మరింత వెలుగులోకి తీసుకొచ్చింది. విదేశీ గడ్డపై ప్రధాన బౌలర్‌గా అవతరించాడు. కచ్చితంగా టెస్టుట్లో మా ఓవర్‌సీస్‌ ప్రధాన స్పిన్నర్‌ అతనే. మేం ఒక స్పిన్నర్‌తోనే బరిలోకి దిగాల్సి ఉంటే తొలి ప్రాధాన్యం అతడికే" అని శాస్త్రి అన్నాడు.

కుల్దీప్‌ అందరికన్నా ముందున్నాడు

కుల్దీప్‌ అందరికన్నా ముందున్నాడు

"మిగతా వారికీ అవకాశం ఉంది. కానీ కుల్దీప్‌ అందరికన్నా ముందున్నాడు. టెస్టుల్లో అతడి బౌలింగ్‌ సంతృప్తికరంగా ఉంది" అని శాస్త్రి అన్నాడు. ఇక, టీమిండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఛటేశ్వర్ పుజారా స్టాన్స్‌ను కొద్దిగా మార్చామని శాస్త్రి అన్నాడు. ప్రస్తుతం టీమిండియ సాధిస్తోన్న ఫలితాల కోసం మళ్లీ పుజారాను ఒక మ్యాచ్‌లో తప్పించేందుకు తాను సిద్ధమని శాస్త్రి వెల్లడించాడు.

రిచర్డ్స్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ను గుర్తుచేస్తోన్న కోహ్లీ

రిచర్డ్స్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ను గుర్తుచేస్తోన్న కోహ్లీ

ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌ తర్వాత పుజారాను విశ్రాంతి తీసుకోవాలని సూచించామని అన్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ తనకు సర్‌ వివియన్‌ రిచర్డ్స్‌, ఇమ్రాన్‌ ఖాన్‌ను గుర్తుచేస్తున్నాడని శాస్త్రి వెల్లడించాడు. రోజురోజుకు అతడి నాయకత్వ ప్రతిభ మెరుగవుతుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. టెస్టు సిరీస్‌లో ఆసీస్‌ను కోహ్లీ తెలివిగా బోల్తా కొట్టించాడని చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, February 5, 2019, 17:38 [IST]
Other articles published on Feb 5, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X