న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'కోహ్లీ రిటైర్‌మెంటా..!! దానికింకా చాలా సమయముంది'

Not retiring, Virat Kohli will play till the age of 40: Childhood coach Rajkumar Sharma

హైదరాబాద్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరో ఐదారేళ్లలో రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్లు వస్తున్న వార్తలపై అతని చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందించాడు. వెస్టిండీస్‌తో ఇటీవల గౌహతి వేదికగా ఆదివారం భారత్‌-విండిస్‌ మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్‌ విజయానంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. ఈ ప్రసంగంలో తన రిటైర్‌మెంట్ గురించి ప్రస్తావిస్తూ.. భావోద్వేగానికి గురైయ్యాడు.

నా కెరీర్‌లో కొన్ని సంవత్సరాలే మిగిలి:

నా కెరీర్‌లో కొన్ని సంవత్సరాలే మిగిలి:

'క్రికెట్‌ని ఎంజాయ్ చేయడానికి నా కెరీర్‌లో కొన్ని సంవత్సరాలే మిగిలి ఉన్నాయి. దేశం తరఫున ఆడటం గొప్పగా, గర్వంగానూ ఉంటుంది. అందుకే.. ఏ మ్యాచ్‌ని తేలిగ్గా తీసుకోను. క్రికెట్‌ను ఎంజాయ్‌ చేస్తూ ఆడటానికి మరికొన్ని సంవత్సరాలు మాత్రమే మిగిలుంది. దేశం కోసం ఆడటాన్ని నేను గౌరవంగా, గర్వంగా భావిస్తున్నాను. 'అని భావోద్వేగానికి లోనయ్యాడు.

రోహిత్ ఆడగలడు.. మరో అవకాశమిచ్చి చూడండి: గంగూలీ

జట్టు బాధ్యత కూడా నాదే కాబట్టి

జట్టు బాధ్యత కూడా నాదే కాబట్టి

ఆటను తేలికగా తీసుకోను. నా వంతు మైదానంలో మెరుగైన ప్రదర్శన ఉండేలా జాగ్రత్త పడతాను. ఇక జట్టు బాధ్యత కూడా నాదే కాబట్టి మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ సందర్భంగా కొన్ని సార్లు ఒత్తిడి కూడా ఎదురవుతూ ఉంటుంది. దాన్ని అధిగమించి నా పని నేను చేసుకుంటూపోవాలి. ఎంతో కష్టపడి ఆడతాం. ఆ కష్టమంతా.. విజయం, ప్రశంసల రూపంలో మనకు తిరిగివచ్చినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు.

గాయాల బెడద కారణంగానే రిటైర్‌మెంట్

గాయాల బెడద కారణంగానే రిటైర్‌మెంట్

ఈ నేపథ్యంలో.. విరాట్ కోహ్లి మరో ఐదారేళ్లు మాత్రమే క్రికెట్ ఆడతాడని, గాయాల బెడద కారణంగానే అతను ఆ వ్యాఖ్యలు చేసినట్లు వార్తలు వచ్చాయి. కోహ్లీ గురించి వస్తున్న వార్తలపై తాజాగా అతని చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ స్పందించాడు.

కోహ్లి మరికొన్నేళ్లు మాత్రమేనంటే సమర్థించను:

కోహ్లి మరికొన్నేళ్లు మాత్రమేనంటే సమర్థించను:

‘విరాట్ కోహ్లి మరికొన్నేళ్లు మాత్రమే క్రికెట్ ఆడతానని చెప్పడాన్ని నేను సమర్థించను. అతను మరో 10ఏళ్ల పాటు భారత్ తరఫున మ్యాచ్‌లు ఆడాలి. ప్రస్తుతం అతని వయసు 29 కాబట్టి.. 40 ఏళ్ల వరకూ అతను రిటైర్మెంట్ ఆలోచన చేయకూడదు. తాను మరో ఐదారేళ్లు మాత్రమే ఆడతానని అతను పరోక్షంగా చెప్పాడు. కానీ.. మరో 10ఏళ్లపాటు భారత జట్టుని కోహ్లీ వీడడు. అతనికి ఎలాంటి గాయాల బెడద లేదు' అని రాజ్‌కుమార్ శర్మ స్పష్టం చేశాడు.

Story first published: Tuesday, October 23, 2018, 14:26 [IST]
Other articles published on Oct 23, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X