For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ ఆడగలడు.. మరో అవకాశమిచ్చి చూడండి: గంగూలీ

Sourav Ganguly asks for Rohit Sharmas inclusion in Test team for Australia tour

హైదరాబాద్: వెస్టిండీస్‌తో మ్యాచ్‌లలో రెచ్చిపోతోన్న ఓపెనర్ రోహిత్ శర్మకి టెస్టుల్లో మరో అవకాశం ఇవ్వాలని సెలక్టర్లకి మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ సూచిస్తున్నాడు. కొద్ది రోజుల ముందు మొదలైన వన్డే మ్యాచ్‌లలో.. అంతకుముందు జరిగిన టెస్టు ఫార్మాట్‌లోనూ దూకుడైన ఆటతీరును ప్రదర్శించిన రోహిత్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు క్రికెట్ అభిమానులు.

సచిన్ రిటైర్‌మెంట్ తీసుకున్న సిరీస్‌లో

సచిన్ రిటైర్‌మెంట్ తీసుకున్న సిరీస్‌లో

ఈ క్రమంలోనే వెస్టిండీస్‌పై 2013లో జరిగిన టెస్టు సిరీస్‌తో ఐదు రోజుల ఫార్మాట్‌లోకి అడుగుపెట్టిన రోహిత్ శర్మకు బాసటగా నిలిచాడు గంగూలీ. వరుసగా రెండు టెస్టుల్లోనూ సెంచరీలు బాదేసి ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్‌'గా నిలిచాడు. ఈ సిరీస్‌లోనే దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తీసుకున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలు బాదినా.. ఆ తర్వాత టెస్టుల్లో రోహిత్ శర్మ వరుసగా విఫలమవుతూ వచ్చాడు..

గంభీర్.. ధోనీలు బీజేపీ నుంచి పోటీ చేయనున్నారా?

ఐదేళ్లకాలంలో ఒకే ఒక్క టెస్టు సెంచరీ

ఐదేళ్లకాలంలో ఒకే ఒక్క టెస్టు సెంచరీ

ఐదేళ్లకాలంలో అతను కేవలం ఒకే ఒక్క టెస్టు సెంచరీ మాత్రమే సాధించగలిగాడు. ఈ ఏడాది ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో అవకాశం దక్కినా.. తొలి రెండు టెస్టుల్లో అతను చేసిన పరుగులు 78 మాత్రమే. టెస్టుల్లో ఫెయిలవుతున్నా.. వన్డే, టీ20ల్లో మాత్రం రోహిత్ శర్మ తిరుగులేని ఫామ్‌ని కనబరుస్తున్నాడు. ఇటీవల దుబాయ్ వేదికగా ముగిసిన ఆసియా కప్‌లో, తాజాగా వెస్టిండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లోనూ సెంచరీలు బాదేశాడు.

నాలుగు టెస్టుల సిరీస్‌లో రోహిత్ శర్మకి అవకాశం

నాలుగు టెస్టుల సిరీస్‌లో రోహిత్ శర్మకి అవకాశం

ఈ నేపథ్యంలో.. ఆస్ట్రేలియాతో డిసెంబరు 6 నుంచి జరగనున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో రోహిత్ శర్మకి అవకాశం ఇవ్వాలని గంగూలీ సూచిస్తున్నాడు. ‘రోహిత్ శర్మ ఆత్మవిశ్వాసం ఇప్పుడు బాగా పెరిగింది. కెప్టెన్‌గానూ ఆసియా కప్‌లో అతను నిరూపించుకున్నాడు. టెస్టుల్లో అతనికి మళ్లీ అవకాశం ఇచ్చేందుకు ఇదే తగిన సమయం. గత రెండేళ్లుగా రోహిత్ శర్మ ఆటతీరు కూడా మెరుగైన నేపథ్యంలో.. ఆస్ట్రేలియాతో జరగనున్న టెస్టు సిరీస్‌కి సెలక్టర్లు అతడ్ని ఎంపిక చేయాలి' అని గంగూలీ సూచించాడు.

రోహిత్ తనకు ఓ అవకాశమిచ్చి చూడాలని

రోహిత్ తనకు ఓ అవకాశమిచ్చి చూడాలని

ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా విఫలమవుతున్న సమయంలో రోహిత్ తనకు ఓ అవకాశమిచ్చి చూడాలని తెలిపాడు. సెలక్టర్లు ఆదేశిస్తే.. తను ఏ ఫార్మాట్‌లో ఆడటానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చాడు.

Story first published: Tuesday, October 23, 2018, 13:25 [IST]
Other articles published on Oct 23, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+