న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

'ధోనిని రిటైర్ అవ్వమని అడిగే అధికారం ఎవ్వరికీ లేదు'

Nobody has the right to tell MS Dhoni when to retire - Shahid Afridi

హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని రిటైర్‌ అవ్వమని చెప్పే అధికారం ఏ ఒక్కరికీ లేదని పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది అన్నాడు. గత కొంతకాలంగా బ్యాట్‌తో ధోని నిరాశ పరుస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే వెస్టిండిస్‌తో ముగిసిన సిరిస్‌లో సైతం ధోని ఆశించిన స్థాయిలో రాణించలేదు.

ఈ నేపథ్యంలో ధోని వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందంటూ పలువురు మాజీ క్రికెటర్లు సూచించిన సంగతి తెలిసిందే. అయితే, అఫ్రిది మాత్రం ధోని సేవలు ఇంకా టీమిండియా అవసరమని చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకొని అతని అవసరం జట్టుకు ఉందని అఫ్రిది చెప్పుకొచ్చాడు.

టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్యూలో

టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్యూలో

తాజాగా టైమ్స్ నౌకి ఇచ్చిన ఇంటర్యూలో అఫ్రిది మాట్లాడుతూ "ధోని భారత్‌ క్రికెట్‌ కోసం ఎంతో చేశాడు. దాని గురించి ఎవరికీ సరిగా తెలియదు. ఈ క్రమంలో అతనిని రిటైర్‌ అవ్వాలని అడిగే హక్కు కూడా ఎవరికీ లేదు. అదేవిధంగా 2019 ప్రపంచకప్‌లో భారత క్రికెట్‌కు అతని సేవలు కీలకం కానున్నాయి" అని అన్నాడు.

ధోని నుంచి కోహ్లీ నేర్చుకోవాల్సింది చాలానే ఉంది

ధోని నుంచి కోహ్లీ నేర్చుకోవాల్సింది చాలానే ఉంది

కెప్టెన్సీ విషయానికి వస్తే మహేంద్ర సింగ్ ధోని నుంచి కోహ్లీ నేర్చుకోవాల్సింది చాలానే ఉందని అఫ్రిది చెప్పుకొచ్చాడు. "కోహ్లీ నా ఫేవరెట్ బ్యాట్స్‌మన్. కానీ కెప్టెన్సీ విషయంలో ధోనీనే బెస్ట్. విరాట్ ఇంకా చాలా నేర్చుకోవాలి" అని అఫ్రిది అన్నాడు. ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఆసీస్ పర్యటనపై స్పందించిన అఫ్రిది

ఆసీస్ పర్యటనపై స్పందించిన అఫ్రిది

ఈ పర్యటనపై కూడా అఫ్రిది స్పందించాడు. ఆసీస్ గడ్డపై గెలవాలంటే టీమిండియా బ్యాట్స్‌మెన్ తమ సామర్థ్యానికి మించి ప్రదర్శన చేయాల్సి ఉంటుందని అఫ్రిది అన్నాడు. "ఆస్ట్రేలియా పిచ్‌లు గతంలోలా బౌన్స్‌కు అనుకూలించడం లేదని, ఇండియన్ బ్యాట్స్‌మెన్ బాగా ఆడగలిగితే సిరీస్ గెలిచే అవకాశం ఉంటుంది" అని అఫ్రిది చెప్పుకొచ్చాడు.

 1-0 ఆధిక్యంలో ఆస్ట్రేలియా

1-0 ఆధిక్యంలో ఆస్ట్రేలియా

ప్రస్తుతం భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ జరుగుతుంది. అనంతరం ఆసీస్ గడ్డపై టీమిండియా 4 టెస్టులు, 3 వన్డేల సిరిస్ ఆడనుంది. కాగా, శుక్రవారం మెల్ బోర్న్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన రెండో టీ20 వర్షం కారణంగా రద్దు అయింది. దీంతో మూడు టీ20ల సిరిస్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలో నిలిచింది.

Story first published: Saturday, November 24, 2018, 15:50 [IST]
Other articles published on Nov 24, 2018
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X